Naga Chaitanya , Sobhita Dhulipala
Sobhita Dhulipala: అక్కినేని వారసుడు నాగ చైతన్య గత ఏడాది డిసెంబర్ 4న వివాహం చేసుకున్నాడు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ఆయన ఏడడుగులు వేశాడు. తెలుగు అమ్మాయి అయిన శోభితతో రెండేళ్లకు పైగా ఆయన రిలేషన్ లో ఉన్నాడు. వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ కథనాలు వెలువడ్డాయి. ప్రైవేట్ ఫోటోలు సైతం ఇంటర్నెట్ లో చక్కర్లు కొట్టాయి. అయినప్పటికీ తమ మధ్య ఏం లేదని శోభిత కొట్టి పారేసే ప్రయత్నం చేసింది.
Also Read: ఫైనల్ లో రోహిత్ పరిణతి… హాఫ్ సెంచరీతో జట్టుకు ఊపిరి
అందరికీ షాక్ ఇస్తూ ఆగస్టు నెలలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. నాగార్జున ఈ విషయాన్ని ట్విట్టర్ ఎక్స్ వేదికగా తెలియజేశాడు. శోభిత ధూళిపాళ్లను అక్కినేని ఫ్యామిలీలోకి ఆనందంగా ఆహ్వానించాడు. మంచి ముహూర్తం కోల్పోకూడదు అనే హడావుడిగా నిశ్చితార్థం జరిపామని అనంతరం వివరణ ఇచ్చారు. పెళ్లి కూడా సింపుల్ గా ముగించారు. అన్నపూర్ణ స్టూడియోలో కేవలం 300 మంది అతిథుల సమక్షంలో వివాహం జరిగింది. సుదీర్ఘంగా హిందూ సాంప్రదాయంలో 8 గంటల పాటు శోభిత-నాగ చైతన్యల వివాహం జరిగింది.
కాగా నాగ చైతన్యకు ఇది రెండో వివాహం. సమంతకు విడాకులు ఇచ్చిన నాగ చైతన్య శోభిత ధూళిపాళ్లను పెళ్లి చేసుకున్నాడు. ఇదిలా ఉంటే గతంలో ఓ ఇంటర్వ్యూలో నీ ఫస్ట్ క్రష్ ఎవరని శోభితను యాంకర్ అడిగారు. ఆ ప్రశ్నకు తడబడకుండా సమాధానం చెప్పింది. అది ప్రేమో లేక క్రష్ అనేది నాకు తెలియదు. స్కూల్ డేస్ లో మా క్లాస్ సీఆర్ అంటే నాకు చాలా ఇష్టం. అతన్ని ఇంప్రెస్ చేయడానికి ఏస్సే రైటింగ్ లో పార్టిసిపేట్ చేసేదాన్ని. ఏదో ఒకటి చేసి అతని దృష్టి నా వైపు మల్లేలా చేయాలి అనుకునేదాన్ని.
అతడు నన్ను పట్టించుకునేవాడు కాదు. నాకు చాలా బాధగా ఉండేది. ఆ ఏజ్ లో నాకు ఏం తెలియదు. కానీ ఈ ప్రాసెస్ లో నేను కొంచెం మెచ్యూరిటీ రాబట్టాను. కాలేజ్ డేస్ లో లవ్ లెటర్స్ వచ్చేవి. నేను కూడా కొన్ని రాశాను… అని శోభిత చెప్పుకొచ్చింది. మోడలింగ్ కెరీర్ గా ఎంచుకున్న శోభిత హిందీ చిత్రాలతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. తెలుగులో గూఢచారి, మేజర్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం గూఢచారి 2లో ఆమె నటిస్తుంది.
Web Title: Do you know who naga chaitanyas wife sobhita dhulipala first crush was
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com