Funny Videos Making: చాట్ జిపిటి అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలామంది తమకు కావాల్సిన కంటెంట్, ఫోటోలు, వీడియోలు దీని ద్వారా సేకరిస్తున్నారు. ఇందులో కొన్ని వీడియోలను కూడా తయారు చేస్తున్నారు. గతంలో ఒక వీడియో తయారు చేయాలంటే ఒక కెమెరా ఉండి.. దాని ముందు ఎక్స్ప్రెషన్ చేస్తూ వీడియో తయారు చేసేవారు. ఇందుకోసం చాలా వరకు ఖర్చు అయ్యేది. కానీ ఇప్పుడు ఈ యాప్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కావాల్సిన వీడియోలు దీని ద్వారా తయారు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఇటీవల చిన్న పిల్లల పేస్ తో పెద్దవాళ్లలాగా మాట్లాడుతున్నట్లు కొన్ని వీడియోలు కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఇవి చాలా క్రేజీగా కూడా ఉంటున్నాయి. ఒక విషయాన్ని పెద్ద వ్యక్తుల గొంతుతో చిన్న పిల్లల మొహాలతో చెప్పడం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అయితే ఈ వీడియో తయారు చేయడానికి ప్రత్యేకంగా టూల్ అవసరం లేదు. కేవలం ఈ యాప్ లోనే తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
ముందుగా మీకు సంబంధించిన ఫోటో లేదా ఇతరుల ఫోటోలు ఏ ఐ ద్వారా తీసుకోవాలి. అందుకోసం చాట్ జిపిటి లోకి ఒక ఫోటోను పంపి దాని కింద Turn This Image Child Animated అని టైప్ చేయాలి. ఇప్పుడు చిన్నపిల్లల మొహంతో ఉన్న ఒక ఫోటో క్రియేట్ అవుతుంది. ఈ ఫోటోను డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు గూగుల్ లోకి వెళ్లి hedra.com అని టైప్ చేయాలి. ముందుగా వచ్చిన వెబ్సైట్ను ఓపెన్ చేయాలి. ఈ వెబ్సైట్ కు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అప్పటికే జిమెయిల్ కనెక్ట్ అయి ఉంటే దానితో కూడా లాగిన్ కావచ్చు. ఆ తర్వాత ఓపెన్ అవుతుంది. ఇప్పుడు కింద కనిపించే వీడియో మేకర్ మీద క్లిక్ చేయాలి. దీనికి సంబంధించిన ఇమేజ్ అడుగుతుంది. ఇప్పటికే క్రియేట్ చేసుకున్న ఇమేజ్ ను ఇందులో అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత దీనికి కావాల్సిన ఆడియో కూడా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మేక్ వీడియో అని క్లిక్ చేయాలి.
Also Read: మీ పిల్లలకు ఈ రెండు అలవాట్లు నేర్పిస్తున్నారా? లేకపోతే కష్టమే..
ఆ తర్వాత వీడియో క్రియేట్ అవుతుంది. అయితే ముందుగానే కావాల్సిన ఆడియోను రికార్డ్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత బేబీ స్టైల్ లో ఉన్న ఇమేజ్ తయారు చేసుకోవాలి. ఏదైనా ఒక విషయాన్ని ఫన్నీగా చెప్పాలని అనుకుంటే వీటి ద్వారా చెప్పుకోవచ్చు. ఇలా ఇమేజ్ కి ఫేస్ కి సంబంధం లేకుండా ఉండడంవల్ల ఆ వీడియో క్రేజీగా ఉంటుంది. అంతేకాకుండా వీటికి లైక్స్ కూడా ఎక్కువగా వస్తుంటాయి. ఈ వీడియోలు కామెడీ తరహా వాటికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అయితే ఆడియో డిస్టబెన్స్ లేకుండా ఉంటే ఇంకా బాగుంటుంది.
ఇప్పటికే చాలామంది ఇలాంటి వీడియోలను తయారు చేసే ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్ అనే సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. మిగతా వాటి కంటే ఈ వీడియోలకు ఎక్కువగా వ్యూస్ వస్తున్నాయి. మీరు కూడా అలాంటి వీడియో తయారు చేయాలంటే ఇప్పుడే క్రియేట్ చేసుకోండి.