Jasprit Bumrah: వచ్చేనెల 13 వరకు వెస్టిండీస్ లో సుదీర్ఘమైన సీరియస్ కోసం పర్యటిస్తున్నది భారత్ క్రికెట్ జట్టు. ఈ సిరీస్ లో వెస్టిండీస్ తో రెండు టెస్ట్ మ్యాచ్లు, మూడు వన్డేలు ,అలాగే ఐదు టి20 ఇంటర్నేషనల్ మ్యాచ్లను టీమిండియా ఆడనుంది. ఇప్పటికే ఇందులో రెండు టెస్ట్ మ్యాచ్లు ముగిసిన సంగతి తెలిసిందే. 1-0 తేడాతో భారత్ చెట్టు ఈ టెస్ట్ మ్యాచ్లలో విజయాన్ని సాధించింది. అయితే వన్డేల విషయంలో మాత్రం భారత్ జట్టు కాస్త తడబడిందని చెప్పవచ్చు. మొదటి వన్డే సిరీస్ లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన భారత్ రెండవ వండే వచ్చేటప్పటికి పేలవమైన పర్ఫామెన్స్ తో పెవిలియన్ కి పరిమితం అయింది. వెండిస్ మాత్రం రెండవ వండే లో విజయఢంకా మోగించింది. ఆగస్టు ఒకటి మంగళవారం నాడు నిర్ణయాత్మక మూడవ వన్డే జరుగుతుంది. ఆ తర్వాత మూడవ తేదీ నుంచి టి20 మ్యాచ్ ప్రారంభమవుతాయి.
ఈ మ్యాచ్ పూర్తయిన తర్వాత భారత్ జట్టు చైనాలోని హౌంగ్ఝౌలో జరగనున్న ఆసియా గేమ్స్ లో పాల్గొనాలని ఉంది. దీని షెడ్యూల్ సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు జరగనుంది. ఇందులో ఉన్న మ్యాచెస్ అన్ని టి20 ఫార్మాట్లో ఉంటాయి. ఈ సీరియస్ ముగిసిన తర్వాత భారత్ తిరిగి ఐర్లాండ్ కు బయలుదేరుతుంది. అక్కడ మరో మూడు t20 మ్యాచ్ల సిరీస్ ఉంది మరి. తొలి మ్యాచ్ షెడ్యూల్ ఆగస్టు 18 వ తారీకున ఉండగా రెండు మరియు మూడవ మ్యాచ్ ఆగస్టు 20 , 23 తారీకులలో జరుగుతాయి. ఈ మూడు మ్యాచ్లు డబ్లింగ్ స్టేడియంలో జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఐర్లాండ్ లో జరగనున్న ఈ సిరీస్ లో పాల్గొన్న పోయే జట్టు వివరాలను భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ప్రకటించడం జరిగింది.
బిసిసిఐ విడుదల చేసిన క్రికెట్ టీం మెంబెర్స్ జాబితా ప్రకారం ఈసారి కెప్టెన్సీ పదవిని ఫాస్ట్ బౌలర్ జస్ట్ బుమ్రా కు ఇవ్వడం జరిగింది. సుదీర్ఘకాలం నుంచి క్రికెట్ కు దూరంగా ఉన్న బొమ్రాకు ఒక్కసారిగా కెప్టెన్సీ బాధ్యత అప్పగించడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. బుమ్రాతో పాటుగా గాయం కారణంగా అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉన్న ప్రసిద్ధ్ కృష్ణ కి కూడ ఈసారి జట్టులో చోటు దొరికింది. ఇక టీం వివరాల విషయానికి వస్తే ..జస్‌ప్రీత్ బుమ్రా( కేప్టెన్),రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్‌ను జట్టులో సభ్యులుగా నియమించబడ్డారు.
అయితే గత ఏడాదికాలంగా వెన్నునొప్పి కారణంతో మ్యాచులకు దూరంగా ఉన్న బుమ్రా పూర్తి ఫిట్నెస్ తో తిరిగి రావడమే కాకుండా ఏకంగా టీం కి కెప్టెన్ గా రియంట్రి ఇవ్వడం భారత్ క్రికెట్ అభిమానులకు శుభవార్త గా మారింది. ఈ స్టార్ పేసర్ ఐర్లాండ్ లో తన సత్తా చాటుతాడు అని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఈ సంవత్సరం చివరిలో జరగనున్న ప్రపంచ కప్ నేపథ్యంలో
బుమ్రా తిరిగి క్రికెట్లో అడుగు పెట్టడం అభిమానుల్లో ఒక రకమైన ఉత్సాహాన్ని నింపుతోంది.
Web Title: Bumrah to captain india for t20 series against ireland
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com