Sanju Samson: ఎప్పటికప్పుడు కొత్త ప్లేయర్లతో, టఫ్ కాంపిటీషన్ తో సాగే ఆట క్రికెట్. ఫామ్ లో నిలదొక్కుకున్నాక కాస్త అటు ఇటు అయినా మళ్ళీ తిరిగి అవకాశాలు సంపాదించడం కష్టమైపోతున్న ఈ రోజుల్లో …రాకరాక వచ్చిన అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవడంలో టీమ్ ఇండియన్ బాటర్ విఫలమయ్యాడు. ఎప్పటినుంచో అతను టీం లో ఛాన్స్ ఇవ్వడం లేదు అని సోషల్ మీడియాలో గగ్గోలు పెట్టిన అభిమానులు అతని పేలవమైన పర్ఫామెన్స్ చూసి నిరాశ చెందుతున్నారు.
చాలా రోజుల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు వన్డేలో ఆడే ఛాన్స్ వచ్చినా ఈ కేరళ బ్యాటర్ తన చేజేతులారా మంచి అవకాశాన్ని జారవిడుచుకున్నాడు. అతనికి అన్యాయం జరుగుతోంది అని ఏకంగా జట్టు ఎంపిక పైన అభిమానులు నెట్లో విపరీతంగా టోల్ చేశారు. ఒక బ్యాటరీ భవిష్యత్తును బలి చేస్తున్నారు అని అరిచి గగ్గోలు పెట్టారు. పోనీ ఇంకా చేరి సెకండ్ ఇన్నింగ్స్ లో అతనికి ఒక సువర్ణ అవకాశాన్ని కల్పిస్తే…దానిని సరిగ్గా వాడుకోకుండా తిరిగాడు. ఇంతకీ ఆ బ్యాటర్ మరెవరో కాదు సంజూ శాంసన్.
మొదట జరిగిన వన్డే మ్యాచ్లో సంజులు వికెట్ కీపర్ గా కాదు అని ఇషాన్ కిషన్‌కు ఫైనల్ టీం లో చోటు కల్పించారు. సంజూకు అన్యాయం జరిగిందని, కావాలనే పక్కన పెట్టారని ఫాన్స్ మేనేజ్మెంట్ ఎంపిక తీరుపై మండిపడ్డారు. ఎవరికి నచ్చిన వాళ్ళని వాళ్ళు ఎంపిక చేసుకునేటప్పుడు కంటి తుడుపు కోసం జట్టు ఎంపిక చేయడం ఎందుకు అని ఆన్లైన్ సాక్షిగా విమర్శించారు. అయితే కెప్టెన్ రోహిత్ ప్లేస్ లో ఓపెనర్ గా బరిలోకి దిగిన ఇషాన్ హాఫ్ సెంచరీ చేసి తన ఎంపిక సరియైన పద్ధతిలో జరిగింది అని నిరూపించుకున్నాడు.
రోహిత్, విరాట్ కోహ్లీ కు రెండవ మ్యాచ్ లో విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో సంజూ శాంసన్, అక్షర పటేల్‌లకు టీం లో ప్లేస్ దక్కింది. వన్డౌన్ లో టైపింగ్ అవకాశం తెచ్చుకున్న సంజూ 19 బంతులకు కేవలం 9 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మరోవైపు అక్షర పటేల్ ఒక్క పరుగు సాధించి వెనుతిరిగాడు. సంజూ కి అన్యాయం జరిగిపోయింది అని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న అభిమానులు అతని పర్ఫామెన్స్ చూసి డీలా పడిపోయారు. మరి కొంతమంది నేటిజెన్లు…అవకాశం ఇవ్వకపోతే ఇవ్వలేదు అంటారు.. పోనీ వచ్చిన అవకాశాన్ని ఏమన్నా వాడుకుంటారా అంటే ఇలా చేస్తారు…అని సంజూ ను తెగ ట్రోల్ చేస్తున్నారు.
గత ఏడవది నవంబర్ 25 తన చివరి వన్డే ఆడిన సంజూ సుమారు 247 రోజుల నిరీక్షణ తర్వాత చేతికి వచ్చిన ఈ గోల్డెన్ ఛాన్స్ ను సరిగ్గా ఉపయోగించుకోవడంలో విఫలమయ్యాడు. ఇప్పుడు 2023లో ప్రపంచ కప్ కోసం సిద్ధం కాబోతున్న భారత్ టీం లో అతని స్థానం ప్రశ్నార్ధకంగా మారింది. ప్రస్తుతం భారత జట్టు తన మిడిల్ ఆర్డర్ ను పటిష్టం చేసే దిశగా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఈసారి జరగనున్న ప్రపంచ కప్ పోటీలకు ఆతిథ్యం ఇస్తున్న భారత్ ఎలాగైనా కప్పును కైవసం చేసుకోవాలి అనే భావనతో ఉండడంతో కాస్త ఫామ్ లేని ప్లేయర్స్ పరిస్థితి వచ్చే టీం లో కష్టమని చెప్పవచ్చు.
Web Title: Sanju samsons flop show continues after many days of opportunity
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com