Bumrah and Gill : టీమిండియాలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ల జాబితాలో రోహిత్ శర్మకు కచ్చితంగా ముందు వరుసలోనే స్థానం ఉంటుంది. ఎందుకంటే రోహిత్ జట్టు మీద చూపించిన ప్రభావం అటువంటిది. అతడు ఆడిన తీరు.. అతడు జట్టును నడిపించిన తీరు.. తను మాత్రమే నిలబడిన తీరు ఇప్పటికీ అభిమానులు కథలు కథలుగా చెప్పుకుంటారు. అందువల్లే రోహిత్ శర్మకు హిట్ మ్యాన్ అనే బిరుదు వచ్చింది. రోహిత్ తనకు మాత్రమే సాధ్యమైన ఆటతీరుతో టీమ్ ఇండియాకు ఎన్నో విజయాలు అందించాడు. కొన్నిసార్లు విఫలమైనప్పటికీ.. అన్నిసార్లు అతడు నిలబడి జట్టుకు ఆత్మస్థైర్యాన్ని.. మనోధైర్యాన్ని కల్పించాడు. అయితే కొంతకాలంగా సరైన ఆట తీరు ప్రదర్శించకపోవడంతో.. రోహిత్ శర్మ పై వ్యక్తం అవుతున్నాయి. మేనేజ్మెంట్ కూడా అతనిపై తెలియని ఒత్తిడిని తీసుకొస్తోంది. దీంతో అతడు దానిని భరించలేక రెడ్ బాల్ ఫార్మాట్ నుంచి శాశ్వతంగా బయటికి వెళ్లిపోయాడు.
Also Read : గాయమా తీసేసారా.. రోహిత్ శర్మ ముంబై ప్లేయింగ్ 11 లో ఎందుకు లేడు?
ఎవరు కెప్టెన్
రోహిత్ వెళ్లిపోయిన తర్వాత.. విరాట్ కోహ్లీ తప్పకున్న తర్వాత… టీమిండియా కు నాయకుడి స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారు అనే ప్రశ్న ఇప్పుడు అందులోనూ వ్యక్తం అవుతుంది. గిల్ కాబోయే నాయకుడు అని ఊహాగానాలు వ్యక్తమవుతున్నప్పటికీ.. దానిపై ఇంతవరకు మేనేజ్మెంట్ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ వైస్ కెప్టెన్ ను కెప్టెన్ గా నియమిస్తే.. అప్పుడు బుమ్రా కు మాత్రమే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అతడు ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్లో రెండు మ్యాచ్లకు నాయకత్వం వహించాడు. పైగా టీమిండియా ఒక మ్యాచ్లో విజయం కూడా సాధించింది. అయితే బుమ్రా తరచూ ఫిట్ నెస్ సమస్యలను ఎదుర్కోవడం.. కీలకమైన మ్యాచ్లకు దూరంగా ఉండడంతో అతడికి నాయకత్వ బాధ్యతలు ఇస్తారా? లేదా? అనేది ప్రశ్నార్దకంగా ఉంది.
మరో వైపు సునీల్ గవాస్కర్ లాంటి సీనియర్ ప్లేయర్ల అండ బుమ్రా కు ఉంది. గిల్ నాయకత్వాన్ని వారు తప్పపట్టకపోయినప్పటికీ.. సీనియార్టీ ప్రకారం.. గత రికార్డుల ప్రకారం బుమ్రా కు అవకాశం ఇవ్వాలని సీనియర్ ప్లేయర్లు సూచిస్తున్నారు. మరోవైపు గిల్ కు టెస్టులలో తనను తాను నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని.. అప్పుడు టీమిండియా మరింత శక్తివంతంగా తయారవుతుందనే వ్యాఖ్యలు చేసే ఆటగాళ్ళూ లేకపోలేదు. కాకపోతే మెజారిటీ ప్లేయర్లు మాత్రం బుమ్రా నాయకత్వం అయితే ఆసక్తి చూపిస్తున్నారు. ” అతడి శరీర సామర్థ్యాన్ని కాస్త పక్కన పెడితే.. మిగతా విషయాలలో అతను నెంబర్ వన్. బౌలింగ్ అద్భుతంగా చేయగలడు.
Also Read : చాయ్ వాలాగా విరాట్.. పాలవాడిగా బుమ్రా.. అరేయ్ ఏంట్రా ఇది!
ఉదాహరణకు పెర్త్ టెస్టును తీసుకుంటే.. కీలకమైన వికెట్లు మొత్తం అతడే పడగొట్టాడు. ఆ మ్యాచ్లో టీమిండియా అద్వితీయమైన విజయాన్ని అందుకుంది. టెస్టులలో పరుగుల కంటే వికెట్లు తీయడమే పెద్ద టాస్క్. బౌలింగ్ విభాగం ఎంత బలంగా ఉంటే జట్టు విజయాలు సాధించడానికి అంత అవకాశం ఉంటుంది. పైగా నాయకత్వ బాధ్యతలు ఉంటాయి కాబట్టి బుమ్రా కు ఆ అవకాశం ఇస్తే మరింత మెరుగ్గా బౌలింగ్ చేయగలడు. అప్పుడు టీమిండియా విజయాలు అందుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది.
ఇప్పుడు మేనేజ్మెంట్ కు కావలసింది కూడా అదే. ఎందుకంటే ఈ సైకిల్ లోనైనా సరే టెస్ట్ ఛాంపియన్ గా ఆవిర్భవించాలని బిసిసిఐ బలమైన పట్టుదలతో ఉంది. అది నెరవేరాలంటే బుమ్రా కెప్టెన్ కావాల్సిన అవసరం ఉందని” మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.