Anasuya : అనసూయ భరద్వాజ్ హాట్ గ్లామరస్ యాంకర్. జబర్దస్త్ వేదికగా ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. తెలుగు బుల్లి తెరకు గ్లామర్ యాంగిల్ పరిచయం చేసిన ఫస్ట్ యాంకర్ అనడంలో సందేహం లేదు. ఆమె డ్రెస్సింగ్ మీద ఎన్ని విమర్శలు వచ్చినా అనసూయ పట్టించుకోదు. నా బట్టలు నాకు సౌకర్యంగా అనిపిస్తే చాలు. ఎలాంటి దుస్తులు అయినా ధరిస్తాను. నా డ్రెస్సింగ్ ని జడ్జి చేయడానికి మీరెవరు? అని పలుమార్లు ఎదురు ప్రశ్నించింది.
అనసూయకు పొగరు, యాటిట్యూడ్ అనే భావన జనాల్లో ఉంది. అందుకే సోషల్ మీడియాలో ఆమెను హేట్ చేసేవారి సంఖ్య ఎక్కువే. తన సోషల్ మీడియా పోస్ట్స్ కి వచ్చే కామెంట్స్ మీద అనసూయ స్పందిస్తుంది. విమర్శలు చేసే వారికి బుద్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఒక దశ దాటి ట్రోల్ చేస్తే, కేసులు పెడుతుంది. తనను విమర్శించే వారిని మరింత రెచ్చగొట్టేలా గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తుంది. విజయ్ దేవరకొండ వంటి స్టార్ ని నేరుగానే విమర్శించి, తన గట్స్ తెలియజేసింది అనసూయ.
Also Read : శేఖర్ మాస్టర్ పై అనసూయ ఫైర్..కంట్రోల్ లో ఉండు అంటూ వార్నింగ్!
అనసూయ ప్రవర్తన చూసిన ఎవరైనా.. ఇంట్లో ఆమెదే పెత్తనం అనుకుంటారు. అనసూయ భర్త కొంగు చాటు మొగుడు. ఆయన చాలా సాఫ్ట్, అనసూయకు స్వేచ్ఛను ఇచ్చాడనే భావన కలుగుతుంది. అనసూయ అంత పెద్ద సెలెబ్ అయినప్పటికీ ఆమె భర్త సుశాంక్ భరద్వాజ్ గురించి తెలిసింది తక్కువే. అయితే ఓ సందర్భంలో అనసూయ భర్తకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఇంట్లో ఆర్థిక వ్యవహారాలు అన్నీ ఆయనే చూసుకుంటాడట. మనీ మేనేజ్మెంట్ లో ఆయన సూపర్, అని అనసూయ వెల్లడించింది.
సుశాంక్ కి బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం అట. అద్భుతంగా బైక్ రైడ్ చేస్తాడట. మరొక విశేషం ఏమిటంటే… సుశాంక్ కి సినిమా ఆఫర్స్ కూడా వచ్చాయట. పాప్యులర్ టాలీవుడ్ డైరెక్టర్స్ రోల్స్ ఆఫర్ చేశారట. కానీ ఆయన రిజెక్ట్ చేశాడట. సుశాంక్ నటుడిగా సక్సెస్ కాలేడు. ఎందుకంటే ఆయనకు నటించడం రాదు, అని అనసూయ అన్నారు. ఇక సుశాంక్ ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నట్లు సమాచారం. నెలకు కోట్లలో సంపాదిస్తున్న అనసూయ ఇటీవల ఒక లగ్జరీ హౌస్ కొన్నారు. కుటుంబ సభ్యులతో పాటు గృహప్రవేశం చేసింది.
Also Read : ఆకాశాన్ని డ్రెస్ గా చుట్టేసుకుందా ఏంటి ఈ అనసూయ..