Ravi Shastri : గత ఏడది టి20 వరల్డ్ కప్ ను భారత్ గెలిచిన తర్వాత.. రోహిత్ శర్మ, రవీంద్ర జడేజ దారిలోనే విరాట్ కోహ్లీ నడిచాడు. రిటైర్మెంట్ ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వాస్తవానికి టి20 ఫార్మాట్ కు వీడ్కోలు పలుకుతున్నప్పుడు విరాట్ కోహ్లీ వయసు 35 సంవత్సరాలు మాత్రమే.. అయినప్పటికీ అతడు యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో టీ 20 ఫార్మాట్ నుంచి శాశ్వతంగా వీడ్కోలు తీసుకున్నాడు. ఇక ఇప్పుడు సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్లో విరాట్ కోహ్లీ అద్భుతమైన రికార్డులు సృష్టించాడు. అనితర సాధ్యమైన పరుగుల వరద పారించాడు. టెస్ట్ ఫార్మాట్లో దిగ్గజ కెప్టెన్లకూడా సాధించలేని రికార్డులను అతడు సొంతం చేసుకున్నాడు. ద్వారా టెస్ట్ క్రికెట్ లో మకుటం లేని మహారాజు లాగా వెలుగొందాడు. అటువంటి విరాట్ కోహ్లీ ఉన్నటువంటి సుదీర్ఘ ఫార్మాట్ నుంచి శాశ్వతంగా తప్పుకోవడం ఒక రకంగా సంచలనం కలిగించింది. క్రికెట్ వర్గాలను సైతం పరిచింది. విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయంతో ఆశ్చర్యానికి గురైన వారిలో టీమిండియా లెజెండరీ ఆటగాడు రవి శాస్త్రి కూడా ఒకరు. అయితే విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఇన్నాళ్లకు రవి శాస్త్రి తన నోరు విప్పాడు.
Also Read : ఆ దృశ్యాలు కళ్ళముందు కనిపించాయి.. అందువల్లే నితీష్ సెంచరీ చేసినప్పుడు ఏడ్చేశాను: రవి శాస్త్రి
అందువల్లే నట
విరాట్ కోహ్లీకి, రవి శాస్త్రికి అవినాభావ సంబంధం ఉంది. వీరిద్దరూ మైదానం అవతల అత్యంత క్లోజ్ గా ఉంటారు. వ్యక్తిగత జీవితానికి సంబంధించి.. క్రీడా జీవితానికి సంబంధించిన విషయాలను పంచుకుంటారు. అయితే తన రిటైర్మెంట్ నిర్ణయం గురించి విరాట్ కోహ్లీ రవి శాస్త్రి తో చెప్పాడట..” పరిపూర్ణంగా ఉన్నాను. నా సంసిద్ధతను మొత్తం నిరూపించాను. ఇక కొత్తగా నిరూపించుకోవాల్సింది కూడా ఏమీ లేదు. కొత్తగా సాధించాల్సింది కూడా లేదు. జట్టులో ఉన్నప్పుడు నూటికి నూరు శాతం ఉన్న ప్రతిభను చూపించాను. ఇక ఇలాంటప్పుడు తప్పుకోవడమే మంచిదని అనిపిస్తోందని” రవి శాస్త్రి తో విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఇదే మాటలను రవి శాస్త్రి ఫారిన్ మీడియాతో ఉటంకించాడు. ” విరాట్ అత్యంత శక్తివంతమైన ఆటగాడు. బౌలింగ్ తనే చేయాలనుకుంటాడు. బ్యాటింగ్ కూడా తనే సాగించాలి అనుకుంటాడు. వికెట్లు మొత్తం పడగొట్టాలని భావిస్తాడు. ఇంత తీవ్రమైన ఆట తీరును ప్రదర్శించాలని ఒక ఆటగాడికి ఉన్నప్పుడు.. కచ్చితంగా అతడు మానసికంగా ఇబ్బంది పడుతూనే ఉంటాడు. అయితే ఇన్ని సంవత్సరాలు పాటు సుదీర్ఘంగా క్రికెట్ ఆడిన విరాట్ కోహ్లీ.. బహుశా మానసికంగా అలసిపోయి ఉంటాడు. అందువల్లే అతడు శాశ్వత వీడ్కోలు తీసుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చాడు. ఈ విషయాన్ని నాతో చెప్తున్నప్పుడు ఒక రకంగా ఆశ్చర్యం అనిపించింది. కాకపోతే ఆ నిర్ణయం సరైనదేమోనని నాకు అనిపించింది. కొన్ని విషయాలు చెప్పకూడదు గాని.. విరాట్ మెంటల్ గా స్ట్రెస్ అనుభవిస్తున్నాడు. ఇలాంటి సమయంలో అందరికీ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. అతడు ఫ్యామిలీతో ఉండాలి. ఇకనుంచి అతడు తన క్వాలిటీ టైం ఫ్యామిలీకి కేటాయిస్తాడని అనుకుంటున్నానని” రవి శాస్త్రి పేర్కొన్నాడు. మొత్తంగా విరాట్ కోహ్లీ సుదీర్ఘ ఫార్మాట్ కు వీడ్కోలు పలకడం వెనక జరిగింది మొత్తం ఏంటో ఇప్పుడు తెలిసిపోయింది.
Also Read : రోహిత్‌కు ఇక కష్టకాలమేనా.. రవిశాస్త్రి మాటల్లో ఆంతర్యం అదేనా?