https://oktelugu.com/

రికార్డుకు బ్రేక్..కోల్‌కతాకు కోలుకోలేని దెబ్బ

  కరోనా పుణ్యమాని.. గత మార్చి నుంచి అందరూ లాక్ అయిపోయారు. ఓ ఎంటర్ టైన్ మెంట్ లేదు పాడూ లేదు.. వేసవిలో సినిమాలు బంద్ అయ్యాయి. ఈ సమ్మర్ లో జనాలను ఊపేసే ఐపీఎల్ కూడా వాయిదా పడింది. కరోనాతో ఇంట్లో ఉండి ఉండి ఎంటర్ టైన్ మెంట్ లేక జనాలకు నరకం కనిపిస్తున్న వేళ యూఏఈలో ఐపీఎల్ మొదలు కావడంతో కాస్త ఊరట లభించింది. ఐపీఎల్‌ సీజన్‌ స్టార్ట్‌ కావడంతో ప్రేక్షకుల్లో కోలాహలం అంతా […]

Written By:
  • NARESH
  • , Updated On : September 24, 2020 1:38 pm
    Follow us on

     

    కరోనా పుణ్యమాని.. గత మార్చి నుంచి అందరూ లాక్ అయిపోయారు. ఓ ఎంటర్ టైన్ మెంట్ లేదు పాడూ లేదు.. వేసవిలో సినిమాలు బంద్ అయ్యాయి. ఈ సమ్మర్ లో జనాలను ఊపేసే ఐపీఎల్ కూడా వాయిదా పడింది. కరోనాతో ఇంట్లో ఉండి ఉండి ఎంటర్ టైన్ మెంట్ లేక జనాలకు నరకం కనిపిస్తున్న వేళ యూఏఈలో ఐపీఎల్ మొదలు కావడంతో కాస్త ఊరట లభించింది.

    ఐపీఎల్‌ సీజన్‌ స్టార్ట్‌ కావడంతో ప్రేక్షకుల్లో కోలాహలం అంతా ఇంతా కాదు. దేశ వ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు సాయంత్రం 7 గంటలు దాటిందంటే టీవీ ముందు వాలిపోతున్నారు. నిన్న ముంబై ఇండియన్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ ఆసక్తిగా జరిగింది. 2012 నుంచి ప్రతీ ఫస్ట్‌ మ్యాచ్‌లోనూ గెలుస్తూ వచ్చిన నైట్‌రైడర్స్‌ నిన్నటి మ్యాచ్‌లో ఓడిపోయి అభిమానులను నిరాశ పరిచింది. ముంబై మొదటి మ్యాచ్‌లో ఓడిపోయి.. ఈ సెకండ్‌ మ్యాచ్‌లో మాత్రం గెలుపు సాధించింది.

    బరిలో దిగిన జట్లలోంచి ఏ జట్టైనా తమ తొలి మ్యాచ్‌ గెలవాలనే చూస్తుంది. రెండుసార్లు ఐపీఎల్‌ ట్రోఫీ ఆందుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కూడా అందుకు భిన్నమేమీ కాదు. కానీ.. 2012 తర్వాత తొలిసారి ఆ జట్టుకు తొలి మ్యాచ్‌ పరాభవం ఎదురైంది.

    ప్రస్తుతం ఐపీఎల్‌ 13వ సీజన్‌ నడుస్తోంది. ఇందులోనూ ఫస్ట్‌ మ్యాచ్‌ గెలుపు బోణీ కొట్టాలని కేకేఆర్‌‌ ఎంతోగానో ఆశపడింది. కానీ.. ముంబయి దాని అంచనాలకు దొరక్కుండా దూసుకెళ్లింది. ఏకంగా 49 పరుగులతో ఓడించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన రోహిత్‌ సేన 195/5 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో కార్తీక్‌ బృందం ఢీలా పడింది. 146/7 పరుగులకే పరిమితమైంది. 2012 తర్వాత తొలిసారి మొదటి మ్యాచ్‌లో ఓటమి పాలైంది.

    2013 సీజన్‌ ప్రారంభ పోరులో ఢిల్లీని 6 వికెట్ల తేడాతో కోల్‌కతా ఓడించింది. ప్రత్యర్థి ఇచ్చిన 129 పరుగుల టార్గెట్‌ను సునాయసంగా ఛేదించింది. 2014లో ముంబయిని ఏకంగా 41 పరుగుల తేడాతో చిత్తు చేసింది. 164 పరుగుల లక్ష్యంతో దిగిన ఆ జట్టును 122/7తోనే ముగించేసింది. 2015లోనూ ముంబయి మీద కేకేఆర్‌‌ పైచేయి సాధించింది. ముంబయి నిర్దేశించిన 169 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్ల తేడాతో 18.3 ఓటర్లలోనే కంప్లీట్‌ చేశారు. 2016లో ఢిల్లీని 98 పరుగులకే కుప్పకూల్చింది. 14.1 ఓటర్లలోనే వికెట్‌ నష్టపోయి టార్గెట్‌ను కంప్లీట్‌ చేసింది.

    తదుపరి సీజన్‌లో గుజరాత్‌ లయన్స్‌పై కోల్‌కతా భారీ విజయం సాధించింది. ప్రత్యర్థి నిర్దేశించిన 184 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్‌ కూడా నష్టపోకుండానే 14.5 ఓటర్లలో ఛేదించింది. 2018లో బెంగళూరు తన ముందుంచిన 177 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్ల నష్టానికి 18.5 ఓటర్లలోనే కరిగించింది. 2019లోనూ హైదరాబాద్‌ ఇచ్చిన 182 పరుగుల టార్గెట్‌ను 6 వికెట్ల తేడాతో మరో 2 బంతులు మిగిలి ఉండగానే గెలిచేసింది. నిన్నటి మ్యాచ్‌లో ఓడిపోవడంపై అటు జట్టులోనూ.. ఇటు అభిమానుల్లోనూ నైరాశ్యం కనిపించింది.