Sachin And Vinod Kambli: సచిన్ గురించి క్రికెట్ ప్రపంచానికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనదేశమే కాదు, ప్రపంచంలో అతడిని ఎవరూ గుర్తించకుండా ఉండలేరు. అయితే అటువంటి ఆటగాడిని ఓ క్రికెటర్ గుర్తించలేకపోయాడు. పక్కనున్నవాళ్లు చెబితే అప్పుడు గుర్తుపట్టి దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేశాడు. ముంబై లో రమాకాంత్ విగ్రహ ఆవిష్కరణకు సచిన్, టీమిండియా మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ హాజరయ్యారు. రమాకాంత్ చేసిన సేవలకు గుర్తుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.. రమాకాంత్ వద్ద వినోద్ కాంబ్లీ, సచిన్ శిక్షణ పొందారు. అక్కడే వారిద్దరూ తొలిసారిగా కలుసుకున్నారు. మళ్లీ ఇన్నాళ్లకు రమాకాంత్ స్మారక విగ్రహ ఆవిష్కరణలో ఒకే వేదిక పంచుకున్నారు దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో తెగ సందడి చేస్తోంది.. ఒక వేదిక పై సచిన్, వినోద్ కాంబ్లీ పక్క పక్కన కూర్చున్నారు. సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియో ప్రకారం సచిన్ వేదిక పైకి వెళ్ళగానే వినోద్ వద్దకు చేరుకున్నారు. అయితే వినోద్ కాంబ్లీ సచిన్ ను గుర్తుపట్టలేక పోయినట్టు ఆ వీడియోలో కనిపిస్తోంది. సచిన్ వినోద్ వద్దకు వచ్చినప్పటికీ షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. ఎటువంటి స్పందనలు కూడా తెలియజేయలేదు. ఆ సమయంలో సచిన్ ఏదో గుర్తు చేయడానికి ప్రయత్నించాడు. కొద్దిసేపు మాట్లాడిన తర్వాత వినోద్ ఒకసారిగా స్పందించాడు. అతని ముఖం సంతోషంతో కనిపించింది. తర్వాత సచిన్ తో వినోద్ కాంబ్లీ చాలాసేపు మాట్లాడుకున్నారు.
రోహిత్ రాయ్ ఏమన్నాడంటే..
వినోద్ కాంబ్లీ, సచిన్ టెండూల్కర్ మధ్య జరిగిన సంభాషణ పై బాలీవుడ్ నటుడు రోహిత్ రాయ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ” సచిన్ టెండూల్కర్ మొదట్లో వినోద్ కాంబ్లీని గుర్తించలేకపోయాడు. ఆ తర్వాత తన స్నేహితుడి దుస్థితి చూసి సచిన్ చలించి పోయాడు. తనను తాను పరిచయం చేసుకున్నాడు. కొన్ని విషయాలు చెప్పాడు. దీంతో వినోద్ కు గతం తాలూకు జ్ఞాపకాల గుర్తుకు వచ్చాయి.. దీంతో వినోద్ కాంబ్లీ సచిన్ ను గుర్తించాడు. వినోద్ పరిస్థితి చూస్తుంటే అతని ఆరోగ్యం బాగోలేదని అర్థమవుతోందని” రోహిత్ వ్యాఖ్యానించాడు.. కొన్ని నెలల క్రితం నుంచి వినోద్ ఆరోగ్యం ఏ మాత్రం బాగోలేదు. అతడు ఆసుపత్రి బిల్లులు కూడా చెల్లించలే ని దుస్థితిలో ఉన్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే బిసిసిఐ ఆస్పత్రిలో చికిత్స కయ్యే ఖర్చులు మొత్తం భరించి నట్టు తెలుస్తోంది. అయితే వినోద్ ఒకప్పుడు సచిన్ కంటే మెరుగ్గా బ్యాటింగ్ చేసేవాడు. అద్భుతంగా ఆడేవాడు. అయితే క్రమశిక్షణా రాహిత్యం, ఆట మీద పట్టు కోల్పోవడం, వివాదాలలో తలదూర్చడం వల్ల వినోద్ కాంబ్లీ ఫేడ్ అవుట్ అయ్యాడు. అంతేకాదు చివరికి క్రికెట్ కే దూరమయ్యాడు.. ఫలితంగా వినోద్ కాంబ్లీ మధ్యలోనే తన కెరియర్ కు ముగింపు పలకాల్సి వచ్చింది. వినోద్ తోనే కెరియర్ ప్రారంభించిన సచిన్ మాత్రం మొన్నటి వరకు క్రికెట్ ఆడాడు.
#WATCH | Maharashtra: Former Indian Cricketer Sachin Tendulkar met former cricketer Vinod Kambli during an event in Mumbai.
(Source: Shivaji Park Gymkhana/ANI) pic.twitter.com/JiyBk5HMTB
— ANI (@ANI) December 3, 2024