Pushpa 2 : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న హీరోలు చాలామంది ఉన్నారు…కానీ స్టార్ హీరో రేస్ లో ఉండి నెంబర్ వన్ స్థానాన్ని అందుకునే పొజిషన్ లో ఉన్న హీరోలు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో అల్లు అర్జున్ ఒకరు…
టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతున్న హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని శాశించిన విషయం మనకు తెలిసిందే. అయితే చిరంజీవి ప్రజారాజ్యం అనే పార్టీని పెట్టి రాజకీయ నాయకుడిగా మారి ప్రజలకు సేవ చేసుకుంటూ తన కర్తవ్యాన్ని పూర్తి చేసుకుంటూ ముందుకు సాగిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే ఆయన దాదాపు 10 సంవత్సరాలపాటు సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చాడు. మరి ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చిన ఆయన ఇప్పుడు వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నప్పటికి ఇప్పుడున్న స్టార్ హీరోలు పాన్ ఇండియా హీరోలుగా మంచి గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్నారు. ఇక చిరంజీవి ప్లేస్ ను రీప్లేస్ చేసే విధంగా కొంతమంది హీరోలు ప్రణాళికలను రూపొందించుకుంటూ ముందుకు సాగుతున్నప్పటికి వాళ్ళు సరైన సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే పాన్ ఇండియాలో సత్తా చాటుకున్న హీరో ఎవరు అనే దానిమీద సరైన క్లారిటీ అయితే రావడం లేదు. ఇక అల్లు అర్జున్ పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్న విషయం మనకు తెలిసిందే. మరి ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించాలి అంటే అంతకు మించిన భారీ ఎలిమెంట్స్ అయితే ఇందులో ఏదో ఒకటి ఉండాలి. ప్రస్తుతం సగటు ప్రేక్షకులు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న సినిమాలనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమాలన్నీ చూస్తున్నారు. కాబట్టి ప్రేక్షకులు చాలా అప్డేటెడ్ గా ఉన్నారు. అలాంటి ప్రేక్షకులను మెప్పించాలంటే ఈ సినిమాలో అంతకుమించిన ఎలిమెంట్స్ ని జోడిస్తూ ప్రేక్షకుడి ఊహలను సాటిస్ఫై చేస్తూ అతన్ని ఒక ట్రాన్స్ లోకి తీసుకుపోయినప్పుడే ఈ సినిమా సక్సెస్ అవుతుంది.
మరి పుష్ప 2 విషయంలో కూడా అదే జరిగితే ఆ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుంది. ఇక ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోతే మాత్రం ఈ సినిమాకి అనుకున్న ఆదరణ అయితే దక్కదు. కాబట్టి అల్లు అర్జున్ కి కూడా పాన్ ఇండియాలో భారీ కలెక్షన్స్ అయితే రావు…
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా మీద భారీ అంచనాలను పెంచడానికి సినిమా మేకర్స్ తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో అయిన రజనీకాంత్ సూపర్ హిట్ సాంగ్ అయినా తిలానా తిలానా అనే సాంగ్ మీద పుష్ప 2 లో ఒక స్టెప్పు వేయించబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి దీంతో పాటుగా తెలుగు, తమిళ్ ఆడియన్స్ ను కూడా తనకు బాగా దగ్గర అవుతారని అల్లు అర్జున్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఈ సినిమాలో ఆయన ఆ స్టెప్పులతో అదరగొట్టబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి…మరి ఈ స్టెప్పు ఇంపాక్ట్ ప్రేక్షకుల్లో ఎంతవరకు ఉంటుందనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…