Pushpa 2 : ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా హీరోగా ఎదిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో స్టార్ హీరోలు ఉండడం విశేషం మరి యంగ్ హీరోలు ఎందుకు పాన్ ఇండియా సినిమాలు చేయడం లేదు. వాళ్ళు చేసిన కూడా అవి పెద్దగా ప్రేక్షకుల ఆదరణ ఎందుకు పొందడం లేదనే విషయాల మీద వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. మంచి కంటెంట్ తో వస్తే ప్రతి ప్రేక్షకుడు కూడా వాళ్ళ సినిమాలను ఆదరిస్తారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
పుష్ప సినిమాకి సీక్వేల్ గా వస్తున్న పుష్ప 2 సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా భారీ సక్సెస్ ని సాధిస్తుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీప్రసాద్ వ్యవహరించినప్పటికి బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం దీవి ని పక్కనపెట్టి మిగతా డైరెక్టర్లతో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని కొట్టిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అందులో భాగంగానే మొదట తమన్ చేత బ్యాగ్రౌండ్ స్కోర్ ను కొట్టించిన సుకుమార్ అది అంతగా సెట్ అవ్వలేదనే ఉద్దేశ్యంతో తమన్ కూడా పక్కనపెట్టి శ్యామ్ సీఎస్, అంజనీష్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్లతో బ్యాగ్రౌండ్ స్కోర్ కొట్టిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోగలిగే ఈ మ్యూజిక్ డైరెక్టర్లు సినిమాకి చాలా మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ ని అందించినట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. మరి వీళ్ళ బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో సుకుమార్ పూర్తిగా సాటిస్ఫై అయ్యాడా లేదా అనే విషయాలు ఇప్పుడు తెలియాల్సిన అవసరమైతే ఉంది. ఇక మొత్తానికైతే సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న నేపధ్యంలో ఈ సినిమా యూనిట్ అందరూ చాలా సంతోషంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా సుకుమార్ చాలా హ్యాపి గా ఉండటమే కాకుండా ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకుడిని ఎంగేజ్ చేస్తుందనే ఒక కాన్ఫిడెంట్ తో ఉన్నాడు.
ఇక 3 గంటల 20 నిమిషాల నిడివితో రానున్న ఈ సినిమా ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టించబోతుందనేది తెలియాల్సి ఉంది. ఇక ఏది ఏమైనా కూడా పుష్ప 2 సినిమాతో అల్లు అర్జున్ మాత్రం పాన్ ఇండియాలో స్టార్ హీరో గా ఒక పెను ప్రభంజనాన్ని సృష్టిస్తాడనేది మాత్రం చాలా ఖచ్చితంగా తెలుస్తోంది.
ఇక ఈ సినిమా విషయంలో ఎవరు ఎలా ఉన్నా కూడా సుకుమార్ మాత్రం మంచి డైరెక్టర్ గా గుర్తింపు ను సంపాదించుకోవడమే కాకుండా ఇకమీదట చేయబోయే సినిమాలతో భారీ సక్సెస్ లను అందుకోవాలనే ప్రయత్నమైతే చేస్తున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ కి బాలీవుడ్ నుంచి కూడా భారీ ప్రాజెక్టులు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి.
మరి తను బాలీవుడ్ సినిమాలను చేస్తాడా లేదా అనే విషయాలు తెలియాల్సి ఉన్నాయి. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా ప్రొడ్యూసర్స్ అయిన మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు పెట్టిన డబ్బులకి డబుల్ కలెక్షన్స్ ను ఈ సినిమా వసూలు చేయబోతుంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి…