https://oktelugu.com/

Dhoni: సీఎస్‌కే ఫ్యాన్స్‌కు చేదు వార్త.. ధోని సంచ‌ల‌న నిర్ణ‌యం..!

Dhoni: క్రికెట్ అభిమానులు ఫేవరెట్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని అని చెప్పొచ్చు.. టీమిండియాకు దొరికిన గొప్ప క్రికెటర్ అయిన ధోని.. మంచి కెప్టెన్ మాత్రమే కాదు..మంచి వికెట్ కీపర్, సూపర్ ఫినిషర్, గొప్ప మార్గ నిర్దేశకుడు కూడా. అయితే, ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు గుబ్ బై చెప్పడంతో చాలా మంది క్రీడాభిమానులు షాక్‌కు గురయ్యారు. అలా ధోని ఆటను మిస్సయ్యారు అభిమానులు. కానీ, ఐపీఎల్‌లో మాత్రం ధోని ఉన్నాడు. దాదాపు దశాబ్దం పాటు చెన్నై సూపర్ […]

Written By:
  • Mallesh
  • , Updated On : January 16, 2022 12:39 pm
    Follow us on

    Dhoni: క్రికెట్ అభిమానులు ఫేవరెట్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని అని చెప్పొచ్చు.. టీమిండియాకు దొరికిన గొప్ప క్రికెటర్ అయిన ధోని.. మంచి కెప్టెన్ మాత్రమే కాదు..మంచి వికెట్ కీపర్, సూపర్ ఫినిషర్, గొప్ప మార్గ నిర్దేశకుడు కూడా. అయితే, ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు గుబ్ బై చెప్పడంతో చాలా మంది క్రీడాభిమానులు షాక్‌కు గురయ్యారు. అలా ధోని ఆటను మిస్సయ్యారు అభిమానులు. కానీ, ఐపీఎల్‌లో మాత్రం ధోని ఉన్నాడు.

    Dhoni

    Dhoni

    దాదాపు దశాబ్దం పాటు చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కు ధోని కెప్టెన్‌గా వ్యవహరించాడు. నాలుగు సార్లు చాంపియన్‌గానూ నిలిచాడు. ఐపీఎల్ ద్వారా ధోనిని చూసి ఆనందం వ్యక్తం చేశారు క్రీడాభిమానులు. కాగా, చెన్నై సూపర్ కింగ్స్ టీంకు త్వరలోనే ఓ బ్యాడ్ న్యూస్ అందబోతున్నదని ప్రచారం జరుగుతోంది. టీ ట్వంటీ వరల్డ్ కప్‌లో టీమిండియాకు మెంటార్‌గా కనిపించిన ధోని..ఈ సారి ఐపీఎల్‌‌లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరిస్తాడా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలోనే ధోని సంచలన నిర్ణయం తీసుకున్నాడని సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఆ న్యూస్ ప్రకారం.. ధోని సీఎస్ కే కి కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరిస్తాడా? లేడా? అనేది తేలాల్సి ఉంది.

    Also Read: 2022లో రాబోయే మూవీ సిక్వెల్స్ ఇవే..!

    ఒక వేళ ధోని లేకపోతే కనుక ఆయన వారసుడిగా రవీంద్ర జడేజా ఐపీఎల్ 2022 సీజన్‌లో జట్టును నడిపిస్తాడనే ప్రచారం కూడా సా..గుతోంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2022 సీజన్ ధోని కెరీర్ లో చివరి ఐపీఎల్ లీగ్ అవుతుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇకపోతే ధోని తన అభిమానుల మధ్యనే తన సొంత మైదానంలోనే వీడ్కోలు తీసుకోవాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.ధోని సూచనల మేరకు రవీంద్ర జడేజాను చెన్నై సూపర్ కింగ్స్ రూ.16 కోట్లకు రిటైన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, మహేంద్ర సింగ్ ధోనిని మాత్రం రూ.12 కోట్లకు తీసుకుంది సీఎస్ కే.

    మొత్తంగా మహేంద్ర సింగ్ ధోనీ పర్యవేక్షణలోనే రవీంద్ర జడేజాను సీఎస్‌కేకు సారథిగా సిద్ధం చేయాలని ఆ టీమ్ భావిస్తోందట. అలా సదరు టీమ్ భవిష్యత్తుకు ఈ సీజన్‌తోనే గట్టి పునాది వేయాలని ధోనీతో పాటు ఆ ఫ్రాంచైజీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. అలా ధోని వచ్చే సీజన్ లో ఆటగాడిగానే కొనసాగుతారని అంటున్నారు. అయితే, ఈ విషయాలపై అధికారిక ప్రకటన అయితే ఇంకా వెలువడలేదు.

    Also Read: హిట్ పుట్టిస్తున్న సింగర్ చిన్మయి వ్యాఖ్యలు..!

    Tags