https://oktelugu.com/

Aamir: మాజీ భార్యతో మళ్ళీ అమీర్.. మరో క్రేజీ బయోపిక్ కి రంగం సిద్ధం !

Aamir: బాలీవుడ్ లో నేటి క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్ ఓ వ్యక్తి పై సిటీ సివిల్ కోర్టులో కేసు పెట్టడం అందరికి షాక్ ఇచ్చింది. అసలు సల్మాన్ ఎవరి పై కేసు పెట్టాడు ? ఎందుకు పెట్టాడు ? అంటే.. మీడియా, సామాజిక మాధ్యమాల్లో అవమానకర వ్యాఖ్యలతో తన పరువు తీస్తున్నాడంటూ కేతన్ కక్కడ్‌ పై సల్మాన్ ఖాన్ పరువునష్టం దావా వేశాడు. తనకు వ్యతిరేకంగా ఉన్న కంటెంట్ […]

Written By:
  • Shiva
  • , Updated On : January 16, 2022 / 12:34 PM IST
    Follow us on

    Aamir: బాలీవుడ్ లో నేటి క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్ ఓ వ్యక్తి పై సిటీ సివిల్ కోర్టులో కేసు పెట్టడం అందరికి షాక్ ఇచ్చింది. అసలు సల్మాన్ ఎవరి పై కేసు పెట్టాడు ? ఎందుకు పెట్టాడు ? అంటే.. మీడియా, సామాజిక మాధ్యమాల్లో అవమానకర వ్యాఖ్యలతో తన పరువు తీస్తున్నాడంటూ కేతన్ కక్కడ్‌ పై సల్మాన్ ఖాన్ పరువునష్టం దావా వేశాడు. తనకు వ్యతిరేకంగా ఉన్న కంటెంట్ ప్రసారం కాకుండా స్టే ఇవ్వాలని, ఆయా మాధ్యమాల్లో తనను అవమానపర్చేలా ఉన్న కంటెంట్‌ను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని సల్మాన్ ఖాన్ కోరుతూ కోర్టుకు విజ్ఞప్తి చేశాడు.

    Aamir:

    అయితే, సల్మాన్ ఖాన్ వేసిన కేసును కోర్టు జనవరి 21కి వాయిదా వేసింది. మరి సల్మాన్ ఖాన్ వేసిన ఈ కేసు చివరికి ఏమవుతుందో చూడాలి. ఇక అలాగే మరో క్రేజీ అప్ డేట్ విషయానికి వస్తే.. బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ తన మాజీ భార్య కిరణ్‌రావు దర్శకత్వంలో మరోసారి నటించబోతున్నాడు. ఓ కామెడీ డ్రామా తెరకెక్కించే క్రమంలో ఆమెతో కలిసి అమీర్ ఖాన్ పనిచేయబోతున్నాడు 2010లో ‘ధోబీ ఘాట్’ అనే సినిమాకు ఆమె దర్శకత్వం వహించింది. ఇప్పుడు మరోసారి ఆమె మెగాఫోన్ పట్టబోతుంది.

    Also Read:  హిట్ పుట్టిస్తున్న సింగర్ చిన్మయి వ్యాఖ్యలు..!

    అన్నట్టు ఈ కామెడీ డ్రామాను అమీర్‌ ఖాన్ నిర్మించనున్నాడు. మొత్తమ్మీద తన మాజీ భార్యకి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చాడు అమీర్‌ ఖాన్. మరి తన మాజీ భర్త తనకు ఇచ్చిన ఛాన్స్ ను కిరణ్ రావు ఎంతవరకు ఉపయోగించుకుంటుందో చూడాలి. కాగా మరో బాలీవుడ్ క్రేజీ అప్ డేట్ విషయానికి వస్తే.. హిందీ స్టార్ కమెడియన్ ‘కపిల్ శర్మ షో’ ఫేం.. కపిల్ శర్మపై త్వరలోనే బయోపిక్ రాబోతోంది. ఆ సినిమాకు ‘ఫంకార్’ అని టైటిల్ పెట్టారు. ఆ చిత్రానికి మృగ్దీప్ సింగ్ లంబ దర్శకత్వం వహించనున్నాడు.ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సమర్పిస్తుంది.

    పంజాబ్‌కు చెందిన కపిల్.. అనామకుడిగా బాలీవుడ్‌లో అడుగుపెట్టి.. ఎన్నో షోలు, కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు. పైగా తనకంటూ ఓ ప్రత్యేకతను కూడా కపిల్ సాధించాడు. కిందిస్థాయి నుంచి బాలీవుడ్ లో ఓ స్థాయికి రావడం అంటే మాములు విషయం కాదు. ఐతే, ఈ ప్రయాణం అనేది అంత ఈజీగా రాలేదు. ఎంతో ప్రతిష్టాత్మకమైనది ఈ జర్నీ. భవిష్యత్తు తరాలకు కపిల్ జర్నీ గొప్ప ప్రేరణ కలిగించింది. మరి త్వరలో రానున్న స్టార్ కమెడియన్‌ బయోపిక్ ఎలా ఉంటుందో చూడాలి.

    Also Read:మెగా ఫ్యాన్స్ కి గుడ్ నెస్.. ఆచార్య రిలీజ్ ఎప్పుడంటే.. ?

    Tags