Homeబిజినెస్Google Pixel 10a: Google Pixel మొబైల్ కు ఎందుకంత క్రేజ్..? ఎగబడి కొనడానికి కారణం...

Google Pixel 10a: Google Pixel మొబైల్ కు ఎందుకంత క్రేజ్..? ఎగబడి కొనడానికి కారణం ఏంటి?

Google Pixel 10a: మొబైల్ కొనే వారిలో రకరకాల మనస్తత్వాలతో ఉంటారు. కొందరు బడ్జెట్లో మొబైల్ కొనాలని చూస్తే మరికొందరు ప్రీమియం ఫీచర్లు కలిగిన లగ్జరీ డివైస్ లను కొనుగోలు చేస్తుంటారు. ప్రీమియం ఫీచర్లు కావాలని అనుకునేవారు Google Pixel ixel మొబైల్ పై ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇది ఇప్పటికే రకరకాల సిరీస్ లతో మార్కెట్లోకి వచ్చింది.7a నుంచి 10 a సిరీస్ వరకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే 10a వెర్షన్ పై ఇటీవల ఆసక్తిగా చర్చ సాగుతుంది. ఈ మొబైల్ కు.. ఇదివరకు వచ్చిన 9a మొబైల్ కు తేడా ఏంటి? అని కొందరు చర్చలు పెడుతున్నారు. అంతేకాకుండా 10a మొబైల్ పై ఎందుకంత క్రేజ్? అని ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ ఈ మొబైల్లో ఏముందంటే?

Also Read: ఘనంగా జరిగిన హీరో అల్లు శిరీష్ వివాహం..సినీ ఇండస్ట్రీ నుండి ఎవరెవరు వచ్చారంటే!

గూగుల్ పిక్సెల్ 10a మొబైల్ గతంలో ఉన్న 9a మొబైల్ లాగే అనిపించినప్పటికీ ఇందులో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. దీని డిజైన్ క్యాప్సూల్ ఆకారంలో ఉంటుంది. కెమెరా మాడ్యూల్ చుట్టూ అంచులు కనిపించవు. దీంతో పాత మొబైల్ కంటే ఈ మొబైల్ డిజైన్ కొత్తగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ మొబైల్ చేతిలో పట్టుకోవడానికి అనుగుణంగా ఉండడంతో పాటు ఇది 9 mm మందంతో ఉండడంవల్ల సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ మొబైల్ లో 6.3 అంగుళాల POLED డిస్ప్లే ఉంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. ఈ డిస్ప్లే పై 7i గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ను అందిస్తుంది. ఇప్పటివరకు వచ్చిన డిస్ప్లే కంటే ఈ మొబైల్ డిస్ప్లే ప్రత్యేకంగా లేటెస్ట్ టెక్నాలజీతో ఉండడంతో ప్రీమియం లుక్ ను అందిస్తుంది. అలాగే ఈ డిస్ప్లే 2000 nits బ్రైట్నెస్ ను అందిస్తుంది.

గూగుల్ పిక్సెల్ 10a మొబైల్ లో ఆండ్రాయిడ్ 16 వర్షం ఆధారిత పిక్సెల్ UI సాఫ్ట్వేర్ నువ్వు కలిగి ఉంటుంది. దీంతో AI ఫీచర్లను పొందవచ్చు. అలాగే ఈ మొబైల్లో గూగుల్ టెన్సర్ G4 తోపాటు 8gb రామ్, 256 జీబీ స్టోరేజ్ కలిగి ఉంది. దీంతో కావాల్సిన ఫోటోలు, వీడియోలు స్టోర్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కెమెరా విషయానికి వస్తే ఇందులో 48 MP మెయిన్ కెమెరా ఉండనుంది. 13 MP అల్ట్రా వైడ్ లెన్స్ కెమెరా ఉండగా..13 MP ఫ్రంట్ కెమెరాతోపాటు వీడియో కాలింగ్ కోసం అనుగుణంగా పనిచేస్తుంది. ఈ కెమెరాలు ఫోటోలను స్పష్టంగా తీసేందుకు ఉపయోగపడుతుంది బ్యాటరీ విషయానికి వస్తే గూగుల్ పిక్సెల్ 10 ఏ లో 5100 mAh బ్యాటరీని చేర్చారు. ఇది 30 W వైర్డ్ చార్జింగ్ సపోర్ట్ చేయనుంది. అలాగే 10 W వైర్లెస్ చార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. నేటితరం వినియోగదారులకు అనుగుణంగా గూగుల్ పిక్సెల్ 10a మొబైల్ ఫుల్ సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉందని కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version