Chinna Jeeyar Swamy Amaravati Comments: అమరావతి రాజధానిపై ( Amravati capital )చిన్న జీయర్ స్వామి కీలక కామెంట్స్ చేశారు. హనుమంతుడి దయతో అమరావతి రాజధాని ఏర్పడిన విషయాన్ని చెప్పుకొచ్చారు. కొంతమంది రాజధానిని తరలించాలని చూశారని.. కానీ ఆంజనేయుడు కృపతో అది సాధ్యం కాలేదని హాట్ కామెంట్స్ చేశారు. అమరావతిని ఆంజనేయుడి కాపాడుతున్నాడంటూ చిన్న జీయర్ స్వామి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఒక విధంగా ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చేసిన కామెంట్స్ అని భావించాలి. ఎందుకంటే అమరావతి రాజధాని నిర్మాణం ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకున్నారు సీఎం చంద్రబాబు. మధ్యలో మూడు రాజధానులు అంటూ తెరపైకి తెచ్చింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అయితే ఇప్పుడు చిన్న జీయర్ స్వామి చేసిన కామెంట్స్ మాత్రం రాజకీయంగా సంచలనం రేపుతున్నాయి.
Also Read: ఘనంగా జరిగిన హీరో అల్లు శిరీష్ వివాహం..సినీ ఇండస్ట్రీ నుండి ఎవరెవరు వచ్చారంటే!
* ఏకాభిప్రాయంతో అమరావతి..
2014లో రాష్ట్ర విభజన జరిగింది. నవ్యాంధ్రప్రదేశ్లో తొలిసారిగా అధికారంలోకి వచ్చారు చంద్రబాబు( CM Chandrababu). ఆయన అందరి అభిప్రాయం తీసుకొని అమరావతి రాజధానిగా ఎంపిక చేశారు. రైతుల నుంచి దాదాపు 30 మూడు వేల ఎకరాల భూమిని కూడా సమీకరించారు. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అట్టహాసంగా శంకుస్థాపన కూడా పూర్తి చేశారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజధానుల విషయంలో మాట మార్చింది. మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. దీంతో అమరావతి రాజధాని నిర్మాణం నిలిచిపోయింది. అమరావతి రైతులు ఉద్యమం చేసి సజీవంగా ఉంచగలిగారు. 2024 ఎన్నికల్లో టిడిపి కూటమి గెలవడంతో అమరావతి కి కొత్త కళ వచ్చింది. మళ్లీ అమరావతి రాజధాని నిర్మాణం ప్రారంభం అయింది. అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు గట్టి ప్రయత్నాల్లోనే ఉన్నారు..
* ఆ విమర్శలకు చెక్..
మరోవైపు అమరావతి పునర్నిర్మాణ ప్రారంభం అయిన నేపథ్యంలో ఇప్పటికీ వ్యతిరేక ప్రచారాన్ని నమ్ముకుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.. మొన్నటి వరకు విషం చిమ్ముతూనే ఉంది. కృష్ణానది వరదల్లో అమరావతి కొట్టుకు వెళ్ళిపోతుందని.. వర్షాకాలంలో మునక తప్పదు అని ప్రచారం చేస్తూ వచ్చింది. అయితే తాజాగా త్రిదండి చిన్న జీయర్ స్వామి అమరావతి విషయంలో స్పందించడం విశేషం. మధ్యలో అమరావతి నుంచి రాజధానిని తరలించేందుకు ప్రయత్నం చేశారని.. కానీ భగవంతుడు అడ్డుకున్నారని అర్థం వచ్చేలా మాట్లాడారు చిన్న జీయర్ స్వామి. తద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై పరోక్ష ఆరోపణలు చేసినట్టు అయ్యింది. అందుకే ఇప్పుడు కూటమి వర్గాలు స్వామీజీ వ్యాఖ్యలను విపరీతంగా వైరల్ చేస్తున్నారు.