Skoda Kylaq car : కార్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కొత్త కొత్త కార్లు మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో విదేశీ కార్లను సైతం ఇక్కడి వినియోగదారులు కోరుకుంటున్నారు. చెక్ రిపబ్లిక్ కు చెందిన SKODA కంపెనీని భారత కార్ల వినియోగదారులు కొన్నేళ్ల నుంచి ఆదరిస్తున్నారు. దీంతో ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయినా కోడియాక్, కుషాక్ అనే కార్లు పేరు తెచ్చుకున్నాయి. తాజాగా ఈ కంపెనీ నుంచి కైలాక్ అనే కారు మార్కెట్లోకి వచ్చింది. స్టైలిష్ లుక్ తో ఆకర్షిస్తోంది. అయితే ఇది రిలీజ్ అయిన వారం రోజుల్లోనే 10 వేల బుకింగ్ అయ్యాయి. ఇంతకీ ఈ కారు ధర, ఫీచర్లు, ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం..
ప్రస్తుతం కాలంలో కారు కొనాలని అనుకునేవారు లేటేస్ట్ ఫీచర్లు కొరుకుంటున్నారు. అంతేకాకుండా అప్డేట్ టెక్నాలజీతో ఉన్న కార్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో స్కోడా లాంటి కొన్ని కంపెనీలు లేటేస్ట్ డిజైన్ తో అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పుడు స్కోడా నుంచి రిలీజ్ అయిన Kylaq కారులో కూడా ఆకట్టుకునే డిజైన్లు ఉన్నాయి. ఆధునిక ఫీచర్లు, నాణ్యమైన ఇంజిన్ తో అందుబాటులోకి వచ్చిన దీనిని చూసి ఇంప్రెస్ అవుతున్నారు. అందుకే అంతలా ఎగబడుతున్నారు.
Skoda Skylaq కారులో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను అమర్చారు. ఇది 113 బీహెచ్ పీ పవర్ తో పనిచేస్తుంది. ఇది 178 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో పనిచేసే ఈ కారు కేవలం 10.5 సెకన్లలో 100 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్తుంది. MQB AO-IN ప్లాట్ ఫాం ఆధారంగా నిర్మితమైన ఈ కారు ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయినా ఫస్ట్ కాంపాక్ట్ ఎస్ యూవీ కారు. ఈ మోడల్ మొత్తం నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటిలో క్లాసిక్, సిగ్నేచర్, సిగ్నేచర్ ప్లస్, ప్రెస్టీస్ వంటివి ఉన్నాయి.
స్కోడా కొత్త కారు ఫీచర్స్ విషయానికొస్తే.. ఇందులో 8 అంగుళాల డిసిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్ ను అమర్చారు. వైర్ లెస్ ఆండ్రాయిడ్, ఆటో ఆపిల్ కార్ ప్లే వంటివి ఉన్నాయి. 10.1 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్పోటైన్మెంట్ సిస్టమ్ తో పనిచేసే ఇందలో వెంటిలేటేడ్ ప్రంట్ సీట్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, వైర్ లెస్ చార్జర్ ఉన్నాయి. సంగీత ప్రియులను ఆకర్షించే విధంగా కాంటన్ సౌండ్ సిస్టమ్ ను అమర్చారు. యాంబియంట్ లైటింగ్ వంటివి ఉన్న ఈ కారు ఎక్సీటీయర్ ఫీచర్లు కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.
ప్రస్తుతం మార్కెట్లో స్కోడా కైలాక్ కారు రూ.7.89 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. 10 రోజుల కింద మార్కెట్లోకి వచ్చిన ఈ కారు రోజుకు 1000 మంది చొప్పున కొనుగోలు చేశారు. వీరికి జనవరి 27న కారు అందుబాటులోకి రానుంది. సబ్ ఫోర్ మీటర్ స్పోర్ట్స్ యూటిలిటీ విభాగంలో ఉన్న ఈ కారును ఫీచర్లు, ధరతోనే ఎక్కువ మంది లైక్ చేస్తున్నారని అంటున్నారు.