Royal Challengers Bengaluru : చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు జట్టు జరుగుతున్న మ్యాచ్లో చివర్లో వచ్చిన అతడు మైదానంలో పరుగుల సునామీ సృష్టించాడు. బీస్ట్ మోడ్ క్రికెట్ ఆడాడు. కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి.. ఐపీఎల్ చరిత్రలోనే బెంగళూరు తరఫున అత్యంత వేగవంతమైన అర్థ శతకం చేసిన ఆటగాడిగా నిలిచాడు. రోమారియో 14 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఆరు సిక్సర్ల సహాయంతో అజేయంగా 53 పరుగులు చేయడం విశేషం. విరాట్ కోహ్లీ వల్ల కానిది.. గేల్ కూడా సృష్టించలేని రికార్డును అతడు సాధించాడు. అతడు దూకుడు వల్ల బెంగళూరు జట్టు స్కోర్ చివర్లో రాకెట్ వేగంతో దూసుకుపోయింది. అంతేకాదు చివరి రెండు ఓవర్లలో షెఫర్డ్ దూకుడు వల్ల ఏకంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 54 పరుగులు వికెట్ నష్టపోకుండా సాధించడం విశేషం. ఐపీఎల్ చరిత్రలోనే ఇది అరుదైన ఘనతగా నిలిచింది.
Also Read :చివరి రెండు ఓవర్లలో.. ఇంత విధ్వంసమా.. చెన్నై బౌలర్లకు ఏడుపొకటే తక్కువ!
తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీలు
ఇక ఐపీఎల్ లో తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో యశస్వి జైస్వాల్ ముందు వరుసలో ఉన్నాడు. 2023లో రాజస్థాన్ రాయల్స్ తరఫున కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు పై అతడు 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు.
2018లో ఢిల్లీ క్యాపిటల్స్ పై పంజాబ్ జట్టు తరఫున ఆడిన కేఎల్ రాహుల్ 14 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు.
2022లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తరపున కమిన్స్ ముంబై ఇండియన్స్ పై 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు.
ఇక 2025లో బెంగళూరు జట్టు ఆటగాడు రోమారియో 14 బంతుల్లోనే చెన్నై జట్టుపై హాఫ్ సెంచరీ చేశాడు.
చెత్త రికార్డులు
ఇక 19 ఓవర్ వేసిన ఖలీల్ అహ్మద్ మోస్ట్ ఎక్స్ పెన్సివ్ బౌలర్ గా నిలిచాడు. అతడు 19 ఓవర్లో మొత్తంగా 33 పరుగులు ఇచ్చాడు.
చివరి ఓవర్ వేసిన మతిషా పతీరణ 21 పరుగులు ఇచ్చాడు. ఖలీల్ అహ్మద్ ధారాళంగా పరుగులు ఇచ్చి ఐపీఎల్లో అత్యంత చెత్త రికార్డు చెన్నై జట్టు తరఫున చేశాడు.
2020లో చెన్నై జట్టు బౌలర్ ఎంగిడి రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 30 పరుగులు ఇచ్చాడు.
2021లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో జరిగిన మ్యాచ్లో సామ్ కరణ్ 30 పరుగులు ఇచ్చాడు.
2019లో ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో డీజే బ్రావో 29 పరుగులు ఇచ్చాడు.
ఇక ఈ మ్యాచ్లో ఖలీల్ అహ్మద్ మూడు ఓవర్లు వేసి 65 పరుగులు ఇచ్చాడు. అతడి ఎకానమీ రేటు 21.70 గా నమోదు కావడం విశేషం.
ROMARIO – FASTEST FIFTY EVER IN RCB HISTORY..!!! pic.twitter.com/cwHsYyU3p6
— Johns. (@CricCrazyJohns) May 3, 2025