Fruit : మాంసాహారం కంటే, రోజు తీసుకునే ఆహారం కంటే పండ్లను తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుందని వైద్యులు చెబుతుంటారు. మధుమేహ రోగులు(మామిడి, సపోటా, సీతాఫలం, నల్ల, ఆకుపచ్చ ద్రాక్ష పండ్లు మినహా) మిగతా వాటిని తీసుకోవచ్చని చెబుతుంటారు. ఎందుకంటే పండ్లల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఖనిజలవణాలు అధికంగా ఉంటాయి. పండ్లలో నాచురల్ స్వీట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది శరీరానికి ఎంతో మంచి చేస్తుంది. ఇక పీచు పదార్థం.. ఇతర విటమిన్లు పండ్లలో అధికంగా ఉంటాయి. అందువల్లే వాటిని తీసుకోవడం వల్ల శరీరం నేరుగా శోషించుకుంటుంది. తద్వారా శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి.. ఎటువంటి వ్యాధులైనా తట్టుకునే శక్తి ఏర్పడుతుంది. శరీర అభివృద్ధి కూడా బాగుంటుంది.
పండ్లలో ఎన్నో రకాలు అందుబాటులో ఉన్నాయి. ప్రాంతానికి తగ్గట్టుగా పండ్లు లభిస్తుంటాయి. ముఖ్యంగా ఎండాకాలంలో మామిడి పండ్లు.. సపోటాలు.. తునికి పండ్లు.. వంటివి విరివిగా లభిస్తుంటాయి. మన ప్రాంతంలో లభించే మామిడి మహా అయితే కిలో 400 నుంచి 500 వరకు లభిస్తుంది.. అది కూడా ఇమామ్ పసంద్, సింధూరి లాంటి రకాలు మాత్రమే.. ఇక కర్బుజా లాంటి పనులకు మహా అయితే కిలో వందలోపే ఉంటుంది. కానీ జపాన్ లో పండే “యుబారి కింగ్ మెలోన్” అనే పండు మాత్రం అక్షరాల 22 లక్షలకు మించి పలుకుతుంది. జపాన్ దేశంలోని హోక్వైడో ద్వీపంలోని యుబారి ప్రాంతంలో ఈ పండు పండుతుంది. ఒక రకంగా ఇది కర్భుజ రకానికి చెందింది. ఈ నేలలో ఉన్న ప్రత్యేకమైన లక్షణం వల్లే ఈ పండుకు అత్యంత రుచి వస్తుందట. ఈ పండును జపాన్లోని శ్రీమంతులు బహుమతులుగా ఇచ్చిపుచ్చుకుంటారట. ఈ పండ్లు అత్యంత తీయగా ఉంటాయి. పైగా తక్కువ సంఖ్యలో పండుతుంటాయి. అందువల్లే ఈ పండుకు ఎంతైనా సరే చెల్లించడానికి అక్కడి శ్రీమంతులు సిద్ధంగా ఉంటారు. యుబారి నగరంలో ఉష్ణోగ్రతలు ఎంత అస్థిరంగా ఉంటే.. ఈ పండుకు అంత రుచి వస్తుందట. పైగా ఈ పండును మార్కెట్లో ఎట్టి పరిస్థితిలోనూ విక్రయించరు. ఈ పండ్లను కేవలం వేలం ద్వారా మాత్రమే దక్కించుకోవాలి.. ఈ పండులో ఉన్న గుజ్జు నారింజరంగులో ఉంటుంది. అత్యంత తీపిగా ఉంటుంది. ఈ పండు వాసన కూడా సాంబ్రాణి పొగలాగా ఉంటుంది. ఇక ఈ కర్భుజాలు 1.5 నుంచి రెండు కిలోల వరకు పెరుగుతాయి. ఒక్కో మొక్క ఐదు నుంచి ఏడు వరకు మాత్రమే కాయలు కాస్తుంది. ఇక ఈ పండ్లలో అరుదైన పోషకాలు ఉంటాయి. అవి క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తాయని ఇక్కడ ప్రజలు నమ్ముతుంటారు. వైద్యులు కూడా అదే విషయాన్ని చెబుతుంటారు. ఇందులో ఉన్న ఏమైనో ఆమ్లాలు శరీర వృద్ధికి సహకరిస్తుంటాయి. ఇందులో ఉండే విటమిన్లు ముఖానికి సరికొత్త అందాన్ని అందిస్తుంటాయి.. ఇవి యాంటీ ఏజింగ్ ఎలిమెంట్ లాగా కూడా పనిచేస్తుంటాయి. దీని తొక్క ద్వారా సౌందర్య ఉత్పత్తులు కూడా తయారు చేస్తుంటారు.. అందుకే ఇది మోస్ట్ కాస్ట్లీ ఫ్రూట్ గా పేరు పొందింది. ప్రస్తుతం జపాన్ దేశంలో ఈ పండ్లు అందుబాటులోకి వచ్చాయి. వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
Also Read : ప్రకృతి ప్రసాదించిన ఫలం ఇదీ.. ఈ సీజన్ లోనే దొరుకుతుంది.. ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకండి!