https://oktelugu.com/

Ramya Krishna : రమ్యకృష్ణ తో ఉన్న ఈ చిన్న కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా..? ఇప్పుడు ఇతను బిగ్ బాస్ కంటెస్టెంట్ కూడా!

హీరో గా రీ ఎంట్రీ ఇచ్చాడు కూడా. మొదటి సినిమా పెద్ద హిట్ అయ్యింది. కానీ ఆ తర్వాత ఇతగాడు చేసిన సినిమాలన్నీ ఎప్పుడు వచ్చాయో, ఎప్పుడు వెళ్ళాయో కూడా జనాలకు తెలియదు. అంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్స్ అయ్యాయి. కానీ అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి, వెండితెర కి దూరమైనా ఇతగాడు బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

Written By:
  • Vicky
  • , Updated On : September 16, 2024 8:28 am
    Ramya krishna

    Ramya krishna

    Follow us on

    Ramya Krishna :  రమ్యకృష్ణ తో కలిసి ఉన్న ఈ క్యూట్ కుర్రాడు ఎవరో గుర్తు పట్టగలరా..?, చిన్నతనం నుండే ఇతను స్టార్ కిడ్ గా పిలవబడే వాడు. అనేక సూపర్ హిట్ సినిమాల్లో అద్భుతమైన నటన కనబర్చి శబాష్ అనిపించుకున్నాడు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం ఇలా అన్నీ భాషల్లో కలిపి 40 కి పైగా చిత్రాల్లో నటించాడు. కొన్ని సినిమాలకు అవార్డ్స్ కూడా వచ్చాయి. పెద్దయ్యాక పెద్ద సూపర్ స్టార్ హీరో అవుతాడని అందరు అనుకున్నారు. హీరో గా రీ ఎంట్రీ ఇచ్చాడు కూడా. మొదటి సినిమా పెద్ద హిట్ అయ్యింది. కానీ ఆ తర్వాత ఇతగాడు చేసిన సినిమాలన్నీ ఎప్పుడు వచ్చాయో, ఎప్పుడు వెళ్ళాయో కూడా జనాలకు తెలియదు. అంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్స్ అయ్యాయి. కానీ అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి, వెండితెర కి దూరమైనా ఇతగాడు బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

    అతను మరెవరో కాదు బాలాదిత్య. చిన్నతనం లో ఎన్నో కల్ట్ క్లాసిక్ చిత్రాల్లో అద్భుతంగా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ‘ఎదురింటి మొగుడు..పక్కింటి పెళ్ళాం’, ‘అన్న’ వంటి చిత్రాల్లో బాలాదిత్య నటించిన తీరుని చూస్తే చప్పట్లు కొట్టని ప్రేక్షకుడు ఉండదు. చిన్న తనం లో అంత షార్ప్ గా డైలాగ్స్ చెప్పడం, కామెడీ టైమింగ్ దగ్గర నుండి ఎమోషనల్ సన్నివేశాల వరకు ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసే అద్భుతమైన ప్రతిభ దేవుడు అందరికీ ఇవ్వడు, కేవలం కొంతమందికి మాత్రమే ఇస్తాడు. అలాంటి వారిలో బాలాదిత్య ఒకడు. కానీ పెద్దయ్యాక ఆ టాలెంట్ ఏమైంది?, ఎందుకు అనుకున్న స్థాయికి చేరుకోలేకపోయాడంటే, టాలెంట్ అయితే పెద్దయ్యాక కూడా ఉంది, కానీ సరైన స్క్రిప్ట్ ఎంపికలు ఉండకపోవడం వల్లే, అనుకున్న స్థాయికి చేరుకోలేకపోయారు బాలాదిత్య. కానీ సీరియల్స్ ద్వారా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఆయన హీరో గా చేసిన ‘సావిత్రమ్మ గారి అబ్బాయి’ అనే సీరియల్ స్టార్ మా ఛానల్ లో ప్రసరమై మంచి టీఆర్ఫీ రేటింగ్స్ ని దక్కించుకుంది. అలాగే బాలాదిత్య బిగ్ బాస్ సీజన్ 6 లో ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టి మంచి మార్కులు కొట్టేసాడు.

    ఆ సీజన్ పెద్ద ఫ్లాప్ అయ్యింది కానీ, బాలాదిత్య మాత్రం ఫ్లాప్ అవ్వలేదు. ఒక్క సిగరెట్స్ విషయం లో బాగా నెగటివ్ అయ్యాడు కానీ, మిగిలిన విషయాల్లో గోల్డ్ అనిపించుకున్నాడు. బిగ్ బాస్ తర్వాత బాలాదిత్య కి సినిమాల్లో కూడా అవకాశాలు బాగానే వస్తున్నాయి. కానీ హీరో గా మాత్రం కాదు, క్యారక్టర్ ఆర్టిస్టుగా. బిగ్ బాస్ తర్వాత ఆయన ప్రధాన పాత్ర పోషించిన ‘మా ఊరి పొలిమేర’ సిరీస్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు కూడా ఆయన పలు సినిమాల్లో క్యారక్టర్ రోల్స్ చేస్తున్నాడు. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా, తమిళంలో కూడా బాలాదిత్య కి మంచి అవకాశాలు వస్తున్నాయి. వీటితో పాటు ఎంటర్టైన్మెంట్ షోస్ లో కూడా బాగా కనిపిస్తున్నాడు.