Team India Captain : ఇంగ్లండ్(England) క్రికెట్ టీం త్వరలో ఇండియాకు రాబోతోంది. ఈ పర్యటనలో భారత్‌తో ఐదు టీ20 మ్యాచ్‌లు, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ భారత టీ20 జట్టును ఎంపికచేసింది. ఇక వన్డే జట్టు ఎంపికకు సకసత్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో వన్డే జట్టుకు ఎవరు సారథ్యం వహిస్తారన్న జరుగుతోంది. ఈ క్రమంలో రోహిత్‌శర్మ (Rohith Shrama)తాను మరికొన్ని రోజులు జట్టుకు సారథ్యం వహిస్తానని బీసీసీఐకి విన్నవించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో జూన్‌లో జరగబోయే టెస్టు సిరీస్‌కు అతడే సారథిగా ఉంటాడన్న వార్తలు వచ్చాయి. కానీ, తాజాగా మారిన సమీకరణలతో జస్‌ప్రిత్ బూమ్రాను వన్డే జట్టుసారథిగా ప్రకటిస్తారన్న చర్చ జరుగుతోంది. ఈమేరకు బీసీసీఐ(BCCI) కూడా సంకేతాలు ఇస్తోందని సమాచారం. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025–27 సీజన్ కూడా జూన్‌లో ప్రారంభం అవుతుంది.. కొత్త ఎడిషన్‌ను కొత్త సారథితోనే మొదలు పెడితే బాగుంటుందన్న ఆలోచనలో బీసీసీఐ ఉంది.
గాయంతో బాధపడుతున్న బూమ్రా..
ఇదిలా ఉంటే జస్‌ప్రిత్ బూమ్రా ప్రస్తుతం గాయంతో బాధపడుతున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడ్డాడు. అందుకే చివరి టెస్టు సెకండ్ ఇన్నింగ్స్‌లో బౌలింగ్ కూడా చేయలేదు. తరచూ గాయాలతో ఇబ్బందిపడే బూమ్రాకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగిస్తే ఇబ్బందులు ఎదురవుతాయన్న అభిప్రాయం కూడా ఉంది. అయితే అతడిని తాత్కాలికంగా కొన్ని రోజులు కొనసాగించి.. కొత్త కెప్టెన్‌ను రెడీ చేయాలన్న ఆలోచనలో బీసీసీఐ ఉందని సమాచారం.
రేసులో పంత్, జైస్వాల్..
ఇదిలా ఉంటే భారత జట్టును నడిపించేందుకు రిషబ్ పంత్(Rishabpanth), యశస్వి జైస్వాల్(Yashaswi Jaishwal) రెడీగా ఉన్నారు. ఈమేకు క్రికెట్ పండితులు పేర్కొంటున్నారు. డబ్ల్యూటీసీ కొత్త సీజన్‌లో బుమ్రాకు కొన్ని రోజులు డిప్యూటీగా ఒకరిని నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తర్వాత బూమ్రాపై ఒత్తిడి తగ్గించేలా సారథిని ఎంపిక చేస్తే బాగుంటుందన్న ఆలోచనలో బీసీసీఐ ఉంది. మాజీలు కూడా రిషభ్ అయితే బాగుంటుందని పేర్కొంటున్నారు. ఇప్పటికే పలు మ్యాచ్‌లు ఆడిన అనుభవం నేపథ్యంలో బీసీసీఐ కూడా రిషబ్‌వైపే మొగ్గు చూసే అవకాశం ఉంది.
బూమ్రా కీలకం..
ఇదిలా ఉంటే భారత జట్టుకు బూమ్రా చాలా కీలకమని మాజీ క్రికెటర్ దీప్‌దాస్‌గుప్తా అన్నారు. ఐసీసీ ఈవెంట్ల నేపథ్యంలో తగినంత విశ్రాంతి ఇవ్వాలని సూచించారు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్, తర్వాత వన్డే ప్రపంచకప్ పోటీలు ఉన్నాయి. ద్వైపాక్షిక సిరీస్‌లు ఉన్నాయి ఈ నేపథ్యంలో బూమ్రాపై ఒత్తిడి పెట్టకపోవడం మంచిది అని సూచించారు. కెప్టెన్‌గా బూమ్రాను ఎంపిక చేసినా అతడికి డిప్యూటీగా బలమైన క్రీడాకారుడిని ఎంపిక చేయాలని సూచించారు.