Homeక్రీడలుక్రికెట్‌IND Vs ENG: ఇంగ్లాండ్ ను గెలవాలంటే.. ముందు వాళ్ళ పని పట్టాలి!

IND Vs ENG: ఇంగ్లాండ్ ను గెలవాలంటే.. ముందు వాళ్ళ పని పట్టాలి!

IND Vs ENG: టి20 వరల్డ్ కప్ చివరి దశకు చేరుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ దక్షిణాఫ్రికా పై 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఫైనల్ వెళ్లిపోయింది. ఇక రెండవ సెమీఫైనల్ గురువారం ముంబై వేదికగా ఇంగ్లాండ్, టీమిండియా మధ్య జరగనుంది.

Also Read: విజయ్–రష్మిక పెళ్లి రిసెప్షన్.. ప్రముఖుల సందడి.. వైరల్ పిక్స్

రెండు జట్లు సమవుజ్జీలు

ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో అటు టీమిండియా.. ఇటు ఇంగ్లాండ్ చెరొక మ్యాచ్ ఓడిపోయాయి. గ్రూప్ దశలో ఇంగ్లాండ్.. సూపర్ 8 దశలో టీమిండియా ఓటమి పాలయ్యాయి. ఆ తర్వాత ఈ రెండు జట్లు దూకుడుగా ఆడాయి. ఫలితంగా సెమీఫైనల్ దాకా వచ్చాయి. సెమీ ఫైనల్ లో ఈ రెండు జట్లు హోరాహోరీగా పోరాడటం ఖాయం. రెండు జట్లలో కూడా అద్భుతమైన ప్లేయర్లు ఉన్నారు. లీగ్ దశలో టీమిండియా ఇబ్బంది పడుతూనే విజయాలు సాధించింది. సూపర్ 8 దశలో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయింది. ఈ దశలో వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్లో విజయం సాధించి ఆత్మవిశ్వాసాన్ని సొంతం చేసుకుంది.

మేనేజ్మెంట్ కీలక నిర్ణయం

జట్టులోకి సంజు శాంసన్ ను తీసుకొని మేనేజ్మెంట్ మంచి నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఎంత గొప్పదో వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్ నిరూపించింది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ జట్టుతో జరిగే మ్యాచ్ లో టీమిండియా ప్రణాళికలను పకడ్బందీగా అమలు చేయాలి. వ్యూహాలకు పదును పెట్టి విజయం సాధించాలి.

వీళ్లు అదరగొట్టాలి

అభిషేక్ శర్మ గొప్ప ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది. ఇషాన్ కిషన్ ముంబై మైదానంపై చెలరేగాల్సిన సందర్భం ఇది. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్.. హార్దిక్ పాండ్యా.. తిలక్ వర్మ కు ముంబై సొంతమైదానం కాబట్టి.. ఇది ముగ్గురిపై భారీగా అంచనాలు ఉన్నాయి. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన మాయజాలాన్ని ప్రదర్శించాలి. బుమ్రా అదరగొడుతున్నప్పటికీ.. అర్ష్ దీప్ సింగ్ దారుణంగా పరుగులు ఇవ్వడం బాధ కలిగిస్తుంది. శివం దుబే కూడా బంతి పై నియంత్రణ కోల్పోతున్నాడు. జట్టుకూర్పులో ఎటువంటి మార్పులు లేవు కాబట్టి.. కులదీప్ యాదవ్ రిజర్వు బెంచ్ కే పరిమితమయ్యే అవకాశం ఉంది.

ఇంగ్లాండ్ జట్టులో..

ఇంగ్లాండ్ జట్టులో అద్భుతమైన ప్లేయర్లు ఉన్నారు. ముఖ్యంగా రషీద్ ఖాన్ డేంజరస్ బంతులతో ఇబ్బంది పెడుతున్నాడు. కెప్టెన్ బ్రూక్, విల్ జాక్స్ జట్టు బ్యాటింగ్ కు ప్రధాన బలంగా మారారు. సాల్ట్, సామ్ కరణ్ కీలక ప్లేయర్ల అవతారం ఎత్తారు. ఓవర్టన్ మిడిల్ ఓవర్లలో వికెట్లు పడగొడుతున్నాడు. దాసన్, ఆదిల్ రషీద్ స్పిన్ బౌలింగ్ ను భారత బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో చూడాల్సి ఉంది.

పిచ్ మీద డ్యూ ఉండకపోవడంతో.. భారీగా పరుగులు వచ్చే అవకాశం ఉంది. రెండువైపులా బౌండరీ సమాన దూరంలో ఉంది. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండే అవకాశం నేపథ్యంలో.. భారీగా పరుగులు నమోదయ్యే అవకాశం ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version