Game changer and Guntur Karam : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం ఇటీవలే విడుదలై ఘోరమైన నెగటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరూ తీవ్రమైన నిరాశని వ్యక్తం చేస్తూ ట్వీట్లు వేశారు. ముఖ్యంగా రామ్ చరణ్ అంటే విపరీతమైన ద్వేషం ఉండే కొన్ని వర్గాలకు చెందిన మీడియా అయితే తెలుగు రాష్ట్రాల్లో షో పడకముందే నెగటివ్ రివ్యూస్ ఇవ్వడం మొదలు పెట్టారు. దానికి తోడు డైరెక్టర్ శంకర్ వరుస ఫ్లాప్స్ లో ఉన్న బ్యాడ్ ఇమేజ్ ఈ సినిమా మీద బలంగా పడింది. ఒక్క ప్రమోషనల్ కంటెంట్ కూడా ఆడియన్స్ ని భారీ రేంజ్ లో ఆకట్టుకోలేకపోయాయి. దీంతో సినిమా మరీ దారుణంగా లేకపోయినా, యావరేజ్ రేంజ్ లో ఉన్నప్పటికీ రామ్ చరణ్ ని అందరి హీరోల అభిమానులు టార్గెట్ చేసి ఈ చిత్రానికి డిజాస్టర్ టాక్ ని తెచ్చిపెట్టారు.
దాని ప్రభావం వసూళ్లపై పడింది. సోషల్ మీడియా లో జరుగుతున్న నెగటివిటీ ని చూసి బయట ఆడియన్స్ కూడా సినిమా బాగాలేదని అనుకున్నారు. కానీ చాలా కాలం తర్వాత వచ్చిన రామ్ చరణ్ సినిమా కావడంతో ఒకసారి థియేటర్ లో చూద్దామని చూస్తే వచ్చిన ఓపెనింగ్ వసూళ్లే ఇవి. మూడు రోజుల్లో 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్, 100 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్ ని దాటేసింది. రిటర్న్ జీఎస్టీ ని తీసేస్తే ‘గుంటూరు కారం’ చిత్రం వరల్డ్ వైడ్ గా క్లోజింగ్ లో కేవలం 90 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. ఫక్తు కమర్షియల్ ఎలిమెంట్స్ తో, బ్లాక్ బస్టర్ సాంగ్స్ తో రూపొందిన ‘గుంటూరు కారం’ చిత్రానికి కూడా ఇదే రేంజ్ నెగటివ్ టాక్ వచ్చింది.
కానీ అది సంక్రాంతికి ఆడతగిన సినిమానే. కానీ ‘గేమ్ చేంజర్’ లో గుంటూరు కారం లో ఉన్నటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు, బ్లాక్ బస్టర్ పాటలు లేవు, అయినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం ఆ సినిమా వసూళ్లను కేవలం మూడు రోజుల్లోనే దాటేసిందంటే, రామ్ చరణ్ ని ఎందుకు గ్లోబల్ స్టార్ అని పిలుస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. సినిమాలో రెండు మూడు ఎలివేషన్ సన్నివేశాలు ఉన్నా, వసూళ్లు వేరే రేంజ్ లో ఉండేవి. డైరెక్టర్ శంకర్ ఈ చిత్రాన్ని చాలా ఫ్లాట్ న్యారేషన్ తో తీయడం, దానికి తగ్గట్టుగానే నెగటివ్ టాక్ ఒక రేంజ్ లో రావడం వల్లే కమర్షియల్ గా ఇలాంటి ఫలితాన్ని ఎదురుకోవాల్సి వచ్చింది. కానీ ఫుల్ రన్ లో ఈ చిత్రం 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టే దిశగా అడుగులు వేస్తుంది. వచ్చిన ప్రతీ పైసా రామ్ చరణ్ పేరు మీదనే, ఈ సినిమా పోతే పోయింది, తదుపరి వచ్చే సినిమాతో ఆయన మరోసారి తన సూపర్ స్టార్ డమ్ ని నిరూపించుకుంటారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.