BCCI: ఒక్కో మ్యాచ్ కు 4.20 కోట్లు.. బీసీసీఐపై కురవనున్న కనక వర్షం…

ఇప్పటివరకు టీమిండియా టైటిల్స్ స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న మాస్టర్ కార్డ్ ఈ సంవత్సరం మార్చిలో పక్కకు తప్పుకుంది. ఆ తరువాత టైటిల్స్ స్పాన్సర్ కోసం బీసీసీఐ బిడ్లకు ఆహ్వానం ఇచ్చిన విషయం తెలిసిందే.

Written By: Vadde, Updated On : August 26, 2023 11:49 am

BCCI

Follow us on

BCCI: బిసిసిఐ టైటిల్స్ స్పాన్సర్ గా క్లోజ్డ్ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ కన్ఫర్మ్ అయింది. అయితే స్పాన్సర్ గా మారుతున్నందుకు ఐడీఎఫ్సీ చెల్లిస్తున్న మూల్యం తక్కువేమీ కాదు…మూడేళ్ల పాటు ప్రతి మ్యాచ్ కు సుమారు 4.2 కోట్ల ఖర్చు ఐడీఎఫ్సీ భుజాలపై పడనుంది.

ఇప్పటివరకు టీమిండియా టైటిల్స్ స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న మాస్టర్ కార్డ్ ఈ సంవత్సరం మార్చిలో పక్కకు తప్పుకుంది. ఆ తరువాత టైటిల్స్ స్పాన్సర్ కోసం బీసీసీఐ బిడ్లకు ఆహ్వానం ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ ముఖ్యంగా బీసీసీఐ పిలిచినటువంటి స్పాన్సర్ బిడ్స్ కు కేవలం ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, సోనీలివ్లు మాత్రమే ముందుకు వచ్చాయి.

ఈ టైటిల్ స్పాన్సర్షిప్ లో చివరకు ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఎంపిక అయ్యింది. బీసీసీఐ నియమాల ప్రకారం ఇప్పుడు ఐడిఎఫ్సి బ్యాంక్ మూడేళ్ల పాటు మొత్తం 56 మ్యాచ్ లకు భారత్ టీంకు టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరించనుంది. ఈ 56 మ్యాచులలో 15 వన్డేలు ,15 టెస్టులు, 26 టీ20 మ్యాచ్ లు ఉంటాయి. వచ్చేనెల ఇండియాలో పర్యటించనున్న ఆస్ట్రేలియా జట్టు ఆడబోయే మూడు మ్యాచ్లో వన్డే సిరీస్ తో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ టైటిల్ స్నాన్సర్షిప్ మొదలవుతుంది.

ఇంతకుముందు 2022 వరకు బిసిసిఐ టైటిల్స్ స్పాన్సర్ గా పేటీఎం వ్యవహరించింది…ఆ తర్వాత మాస్టర్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి.. ప్రతి మ్యాచ్ కి 3.8 కోట్ల చెల్లించే విధంగా ఒప్పందం చేసుకోండి. మొన్న మార్చి తో ఈ గడువు ముగియడంతో.. తిరిగి టైటిల్ స్పాన్సర్షిప్ పొడిగించడానికి మాస్టర్ కార్డ్ ఆసక్తి చూపించలేదు.‘ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్’ బోర్డు మ్యాచ్ల టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులు సొంతం చేసుకోవడం ద్వారా ఇప్పుడు భారత్ క్రికెట్ నియంత్రణ మండలి ఖాతాలో వచ్చే మూడేళ్లలో టైటిల్స్ కాన్సెప్షన్ ద్వారానే రూ. 235 కోట్లు చేరనున్నాయి.

బీసీసీఐ నిర్వహించబోయే అంతర్జాతీయ మ్యాచులతో పాటు దేశవాళీ టోర్నమెంట్లు, అండర్ 19 ,అండర్ 23 టోర్నమెంట్లు కూడా ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరిస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం 2026 ఆగస్టు వరకు బీసీసీఐ తరఫున నిర్వహించబోయే మ్యాచ్లకు టైటిల్స్ స్పాన్సర్ గా ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ వ్యవహరిస్తుంది. అయితే ఒక్కసారిగా ఇంతకు ముందు స్పాన్సర్ షిప్ కి ఇప్పటికీ 40 లక్షలు పెంచడం జరిగింది.