Iratta: గత కొద్దికాలంగా సినీ ఇండస్ట్రీలో మలయాళం చిత్రాలకు బాగా డిమాండ్ పెరుగుతుంది. క్రైమ్ ,సస్పెన్స్, థ్రిల్లర్స్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాలకు ఆదరణ విపరీతంగా ఉంది. ఈ నేపథ్యంలో మలయాళం లో రిలీజ్ అయి మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన చిత్రం ‘ఇరట్టా’…. ఈ మూవీలో హీరోయిన్గా అంజలి నటించింది. ప్రస్తుతం ఓటీటీలు హవా నడుస్తూ ఉండడంతో.. కంటెంట్ ఉన్న చిత్రాలు ఏ భాషమైనా సరే ప్రేక్షకులు ఎక్కువగా చూస్తున్నారు.
ఇరట్టా ప్రముఖ ఆన్లైన్ ప్లాట్ఫారం నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మంచి హైప్ క్రియేట్ చేస్తున్న ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం.. ఈ మూవీకి థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఆన్లైన్ స్ట్రీమింగ్ లో కూడా మంచి డిమాండ్ ఉంది. ఇక కథ విషయానికి వస్తే.. కేరళలోని వాగమన్ అనే ఒక ఊరిలో పోలీస్ స్టేషన్లో జరుగుతున్న ఒక కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మినిస్టర్ రావడంతో బందోబస్తు పోలీసులు ఏర్పాట్లు చేస్తుంటారు.
సడన్గా తుపాకీ పేలిన సన్ రావడంతో అందరూ అక్కడికి వెళ్లి చూస్తే అప్పటికే ఏఎస్ఐ వినోద్ (జోజు జార్జి) చనిపోయి ఉంటాడు. దాంతో పోలీస్ స్టేషన్ ని లాక్ చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎక్కడికి వెళ్ళనివ్వకుండా విచారణ జరుపుతారు. వినోద్ చనిపోయిన విషయం తెలుసుకొని అతని ట్విన్ బ్రదర్ డిఎస్పి ప్రమోద్ సంఘటనా స్థలానికి చేరుకుంటాడు..ఇంతకీ వినోద్ ని చంపింది ఎవరు? ప్రమోద్ వినోదుల మధ్య గొడవ ఏంటి? మాలిని ఎవరు? అనే విషయాలు తెలియాలి అంటే మూవీ చూడాల్సిందే.
మూవీ స్టార్టింగ్ లోనే పోలీస్ స్టేషన్లో వినోద్ చనిపోయే సీన్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది.. ఇక అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. వినోద్ గురించి విచారణ మొదలు పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరితో వినోద్ కి ఉన్న గొడవలు హై లైట్ చేయడం…ఫ్లాష్ ప్యాక్ తో పాటు మెల్లిగా వినోద్ హత్య వెనక కారణం రివీల్ చేసిన పద్ధతి. ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. మూవీ ఎండ్ అయ్యేసరికి వినోద్ ని ప్రమోద్ హత్య చేసినట్లు అనుమానం రావడంతో ప్రమోద్ ఆ కేసును చాలెంజిగా తీసుకుంటాడు.
అసలు ఒకానొక సందర్భంలో చూసే ప్రేక్షకులు కూడా వినోద్ని ప్రమోద్ చంపాడు అని ఫిక్స్ అయిపోతారు. కానీ ప్రమోద మిస్టరీ ఇచ్చేదించే విధానం ఊహకి అందని విధంగా క్రియేట్ చేయడం జరిగింది.డ్యూయల్‌లో రోల్‌లో జోజు జార్జ్ ఎక్సలెంట్ గా నటించాడు. అయితే ఈ మూవీ మొత్తం మీద అంజలికి ఒక్కటంటే ఒక్క డైలాగ్ కూడా లేదు. రెగ్యులర్ గా వచ్చే క్రైమ్ థ్రిల్లర్ చిత్రాల కంటే కూడా ఇది ఎంతో భిన్నంగా ఆసక్తికరంగా ఉంది. వీకెండ్ లో మంచి సస్పెన్స్ మూవీ చూడాలి అనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.