BAN vs NEP : ఎంపైర్లను పిచ్చోళ్లను చేసిన బంగ్లా ఆటగాళ్లు.. వీడియో వైరల్

BAN vs NEP థర్డ్ అంపైర్ రివ్యూలో బంతి వికెట్లకు దూరంగా వెళ్తున్నట్టు కనిపించింది. దీంతో ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. నాట్ అవుట్ గా ప్రకటించాడు.

Written By: NARESH, Updated On : June 18, 2024 9:24 am

Tanzim Hasan Shakib was given out LBW on Sandeep’s ball.

Follow us on

BAN vs NEP : క్రికెట్లో ఆస్ట్రేలియా తర్వాత తొండి ఆట ఆడే ఆటగాళ్లుగా బంగ్లాదేశ్ క్రికెటర్లకు పేరు ఉంది. మైదానంలో దురుసు ప్రవర్తన, పదే పదే అప్పీల్ చేయడం, తోటి ఆటగాళ్లను రెచ్చగొడతారని అపవాదు బంగ్లా క్రికెటర్ల పై ఉంది. అయితే ఈ జట్టు ఆటగాళ్లు t20 వరల్డ్ కప్ లో భాగంగా సోమవారం నేపాల్ జట్టుతో జరిగిన మ్యాచ్లో.. మరోసారి తమ దుర్బుద్ధిని నిరూపించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చర్చకు దారి తీస్తోంది.. దీంతో బంగ్లా ఆటగాళ్లపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం నేపాల్ జట్టుతో జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ 21 పరుగుల తేడాతో గెలుపును అందుకుంది. ఈ గెలుపు ద్వారా సూపర్ -8 కు వెళ్లిపోయింది.

నేపాల్ జట్టుతో జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ సమయంలో.. ఆ జట్టు బ్యాటర్ జుకర్ అలీ ఐసీసీ నిబంధనలకు వ్యతిరేకంగా డీఆర్ఎస్ నిర్ణయం తీసుకోవడంలో డగ్ ఔట్ ను సంప్రదించాడు. ఇదంతా కూడా అంపైర్లు చూస్తుండగానే చేశాడు..” డీఆర్ఎస్ నిర్ణయం తీసుకోవాలా? వద్దా?” అని కోచ్ లను కంటి సైగలతో ప్రశ్నించాడు.. “డీఆర్ఎస్ తీసుకోవాలని” కోచ్ లు సూచించడంతో అతడు రివ్యూ కు వెళ్ళాడు. ఈ సమీక్ష బంగ్లా జట్టుకు లాభం చేకూర్చింది. వాస్తవానికి నిబంధనలకు విరుద్ధంగా డగ్ అవుట్ హెల్ప్ తీసుకున్నప్పటికీ అంపైర్లు ఏమాత్రం పట్టించుకోలేదు.

బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 14 ఓవర్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. నేపాల్ బౌలర్ సందీప్ వేసిన ఈ ఓవర్ లో తొలి బంతిని బంగ్లా బ్యాటర్ హసీన్ సాకీబ్ డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ బంతి బ్యాట్ కు దూరంగా వెళ్తూ ప్యాడ్లను తగిలింది. దీంతో నేపాల్ ఆటగాళ్లు ఎల్బి కోసం అంపైర్ ను గట్టిగా అప్పిలు చేశారు. దీంతో ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడు. ఈ దశలో బంగ్లా బ్యాటర్ మైదానాన్ని వదిలి వెళ్ళేందుకు సమాయత్తమయ్యాడు. ఈ దశలో నాన్ స్ట్రైకర్ గా ఉన్న జూకర్ అలీ అనే ఆటగాడు.. డగ్ ఔట్ వైపు ఓ చూపు చూశాడు.. డీఆర్ఎస్ తీసుకోవాలా? వద్దా? అన్నట్లుగా సైగలు చేశాడు. కోచ్ లు డగ్ ఔట్ సూచనలు చేయడంతో, రివ్యూ తీసుకోవాలని హసన్ ను కోరాడు.

థర్డ్ అంపైర్ రివ్యూలో బంతి వికెట్లకు దూరంగా వెళ్తున్నట్టు కనిపించింది. దీంతో ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. నాట్ అవుట్ గా ప్రకటించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో భారీ ఎత్తున దుమారానికి కారణమవుతోంది. కొంతమంది అభిమానులు బంగ్లా ఆటగాళ్లపై చర్యలు తీసుకోవాలని ఐసీసీకి సూచిస్తున్నారు. అయితే డగ్ ఔట్ సూచనతో బతికి బట్ట కట్టిన బంగ్లా ఆటగాడు.. ఆ తర్వాతి బంతికి క్లీన్ బౌల్డ్ కావడం గమనార్హం. దీనినే యద్భావం తద్భవతి అంటారు కావచ్చు.