https://oktelugu.com/

Central Budget 2024: కేంద్ర బడ్జెట్ 2024.. పన్ను మినహాయింపు పరిమితుల్లో సవరణ?

కొత్త బడ్జెట్ సామాన్యులకు గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోది. ఈ బడ్జెట్లో పన్ను మినిహాయింపులు ఎక్కువగా ఉంటుందని చెల్లింపుదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సెక్షన్ 80 సీ, 80డీ కింద మినహాయింపు పరిమితుల్లో సీతారామన్ సవరణ చేస్తారని నిపుణులు కూడా అభిప్రాయడుతున్నారు

Written By:
  • Srinivas
  • , Updated On : June 18, 2024 / 09:31 AM IST

    Central Budjet 2024

    Follow us on

    Central Budget 2024:  ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్ర బడ్జెట్ (2024)ను మొదటిసారి జూలై 24న ప్రవేశపెట్టనున్నారు. 60 ఏళ్ల కిందట మొరార్జి దేశాయ్ ఆరు సార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. కానీ నిర్మలా సీతారామన్ 7వ సారి బడ్జెట్ ప్రవేశపెడుతూ ప్రత్యేకంగి నిలుస్తున్నారు. బీజేపీతో పాటు ఆ కూటమి పార్టీల నుంచి 72 నుంది సభ్యులు క్యాబినెట్, సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు ఆమె ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్ ను సమర్పిం చారు. కాగా పూర్తి స్థాయి బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ కొన్ని పన్ను విధానాలకు మినహాయింపులు ఇవ్వనున్నారు.

    కొత్త బడ్జెట్ సామాన్యులకు గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోది. ఈ బడ్జెట్లో పన్ను మినిహాయింపులు ఎక్కువగా ఉంటుందని చెల్లింపుదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సెక్షన్ 80 సీ, 80డీ కింద మినహాయింపు పరిమితుల్లో సీతారామన్ సవరణ చేస్తారని నిపుణులు కూడా అభిప్రాయడుతున్నారు . ప్రభుత్వం చివరిసారిగా 2014-15 కేంద్ర బడ్జెట్లో సెక్షన్ 80సీ కింద మినహాయింపు పరిమితిని సవరించింది. ఈ సెక్షన్ కింద పన్ను ప్రయోజనాల కోసం రూ. 1.5 లక్షల నుంచి రూ. లక్షకు పెంచింది. మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు మినహాయింపు ప్రయోజనాల పరంగా అత్యంత కీలకమైన విభాగం. సెక్షన్ 80సీ కింద పన్ను చెల్లింపుదారులు సీసీఎఫ్. ఎన్సీఎస్ చిన్ని పొదువులు, జీవిత బీమా, ఈఎల్ఎస్ఎస్, యూలీప్ లు, హెూమ్ లోన్ ప్రిన్సిపల్ రీపేమెంటీత వాటిపై ప్రయోజనాలు పొందవచ్చు.

    కొత్త ప్రభుత్వంలో వెన్ను చెల్లింపుదారులు స్పష్టమైన, మరింత సమర్థవంతమైన పన్ను వ్యవస్థ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. వెస్ట్ను స్లాబ్ లను తగ్గించడంతో పాటు మినహాయింపులను క్రమబద్ధీక రించడం వంటివి సాధారణ ప్రజలకు సమ్మతిని సులభతరం చేసే అవకాశం ఉందని నీవుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆదాయంపు పన్నుప్రాసెసింగ్ సమయాన్ని తగ్గించడంతో పాటు పారదర్శకత మెరుగుపరచడానికి పన్ను విధానంలో డిజిటల్ సిస్టము పెంచేలా చర్యలు తీసుకునే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా స్కూల్ ఫీజులపై మినహాయింపు సిక్షన్ 80సి నుంచి మినహాయింపులు ఇస్తారని అంటున్నారు.