https://oktelugu.com/

Babar Azam : నా కొడుకును అనే ముందు.. మీ కింది నలుపులను చూసుకోండి.. పాక్ మాజీ ఆటగాళ్లకు ఇచ్చి పడేసిన బాబర్ తండ్రి..

Babar Azam : బాబర్ అజామ్ ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీలో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. న్యూజిలాండ్ జట్టుపై హాఫ్ సెంచరీ చేసినప్పటికీ.. అది అతడి స్థాయి ఇన్నింగ్స్ కాదు.

Written By: , Updated On : March 7, 2025 / 10:45 AM IST
Babar

Babar

Follow us on

Babar Azam : బాబర్ అజామ్ ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీలో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. న్యూజిలాండ్ జట్టుపై హాఫ్ సెంచరీ చేసినప్పటికీ.. అది అతడి స్థాయి ఇన్నింగ్స్ కాదు. టీమిండియాతో జరిగిన మ్యాచ్ లోనూ బాబర్ విఫలమయ్యాడు. ఇలా చెప్పుకుంటూ పోతే బాబర్ తన స్థాయికి తగ్గట్టుగా ఇన్నింగ్స్ ఆడలేక పోతున్నాడు. అప్పట్లో ఆసియా కప్ లో నేపాల్ జట్టుపై బాబర్ సెంచరీ చేశాడు. ఇప్పటివరకు అతడు ఆ స్థాయిలో ఇన్నింగ్స్ ఆడ లేకపోయాడు. అతడు వైఫల్య ప్రదర్శన కొనసాగిస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు న్యూజిలాండ్ జట్టుతో జరిగే టి20 సిరీస్లో చోటు కల్పించలేదు. దీంతో బాబర్ అభిమానులు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..” పాకిస్తాన్ క్రికెట్ జట్టులో బాబర్ ఒక్కడే ఉన్నాడా? మిగతా ఆటగాళ్లకు బాధ్యత లేదా? వారు ఎందుకు ఆడలేక పోతున్నారు? వారు తమ స్థాయికి తగ్గట్టుగా ఎందుకు ప్రదర్శన చేయలేకపోతున్నారు? ఈ విషయంపై ఎప్పుడైనా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆలోచించిందా? అలా చేయనప్పుడు బాబర్ పై మాత్రమే చర్యలు తీసుకోవడంలో అర్థం ఏంటి? పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏకపక్ష ధోరణి మానుకోవాలని” బాబర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : ఒరేయ్ ‘ఆజామూ’ పది పరుగులేనా.. ఇలా అడితే మీ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ గెలుస్తుందా?

ముందు మీ కింద నలుపు చూసుకోండి

బాబర్ కు న్యూజిలాండ్ జట్టుతో జరిగే టి20 సిరీస్ లో చోటు లభించకపోవడంతో.. అతడి తండ్రి సిద్ధిక్ ఇన్ స్టా గ్రామ్ లో తన స్పందన తెలియజేశాడు. బాబర్ పై తీవ్ర విమర్శలు చేస్తున్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్లకు ఇచ్చి పడేశాడు. ” బాబర్ కు నేను శిక్షణ ఇచ్చాను. అతడు ఎలా ఆడతాడు నాకు తెలుసు. జాతీయ జట్టుకు ఎలాంటి సేవలు అందించాడో కూడా తెలుసు. అతడు ఆడటం వల్లే కదా వన్డే ర్యాంకింగ్స్ లో రెండో స్థానంలో కొనసాగుతున్నది. ఆ విషయం మాజీ ఆటగాళ్లకు ఎందుకు తెలియడం లేదు. నా కొడుకు ఎలాంటి వాడో నాకు తెలుసు. నా కొడుకుని విమర్శించే మందు సీనియర్ ఆటగాళ్లు వాళ్లకింద నలుపును చూసుకోవాలి. అంతేతప్ప నోరు ఉంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడితే కుదరదు. మాజీ ఆటగాళ్లు విమర్శలు చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి. దానికి మించి సమాధానం ఇస్తే వారు తట్టుకోలేరు. బాబర్ గురించి విమర్శలు చేసేవారు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వెబ్సైట్లో రికార్డులను తనిఖీ చేసుకోవాలి. అప్పుడు వారికి సరైన సమాధానం లభిస్తుంది. అప్పటికి కూడా వారు బాబర్ ను విమర్శిస్తుంటే అది వారి ఇంగితానికి వదిలేస్తానని” సిద్ధిక్ వ్యాఖ్యానించాడు. ఇదే సమయంలో తన కుమారుడికి కూడా సిద్ధిక్ కొన్ని విషయాలు చెప్పాడు..” నువ్వు గతంలో భాగంగా ఉన్నావు. జట్టును నడిపించావు. ఇప్పుడు ఆడే పరిస్థితి లేదు. విమర్శలకు నీ ఆట తిడుతున్న సమాధానం చెప్పు. నీ కెరియర్ కు గారు బాటలు వేసుకో” అని పేర్కొన్నాడు..

Also Read : బాబర్ ను రెచ్చగొట్టాడు.. సౌత్ ఆఫ్రికా ను గెలిపించాడు.. ఓరయ్యా ఎందుకురా ఇంత ఆవేశం..