Homeక్రీడలుక్రికెట్‌IND Vs NZ: న్యూజిలాండ్ జట్టుతో CT ఫైనల్.. టీమిండియాలో ఆ మ్యాజికల్ బౌలర్ ఆడేది...

IND Vs NZ: న్యూజిలాండ్ జట్టుతో CT ఫైనల్.. టీమిండియాలో ఆ మ్యాజికల్ బౌలర్ ఆడేది అనుమానమే.. ఎందుకంటే?

IND Vs NZ: 8 సంవత్సరాల గ్యాప్ తర్వాత జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా సత్తా చాటింది. వరుసగా నాలుగు మ్యాచ్లలో విజయం సాధించి ఏకంగా ఫైనల్ వెళ్లిపోయింది. దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్లలో టీమిండియా లెజెండరీ ఆటతీరు ప్రదర్శించింది. బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి జట్లపై అద్భుతమైన విజయాలు సాధించి ఫైనల్ వెళ్ళిపోయింది.

Also Read: న్యూజిలాండ్ తో ఫైనల్ పోరు.. రోహిత్ సేన ఈ తప్పులు చేయొద్దు..

 

దుబాయ్ వేదికగా న్యూజిలాండ్ జట్టుతో ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ కోసం టీమిండియా తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. నెట్స్ లో విపరీతంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. రోహిత్ నుంచి మొదలుపెడితే హార్దిక్ వరకు అందరూ తమ శిక్షణలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో జట్టుకూర్పు విషయంలో ఇప్పటికే మేనేజ్మెంట్, కోచ్, కెప్టెన్ ఒక అంగీకారానికి వచ్చినట్టు తెలుస్తోంది. జాతీయ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం.. నాలుగు మ్యాచ్లలో అంతగా ప్రతిభ చూపని ఆటగాళ్లకు.. ఫైనల్ మ్యాచ్లో విశ్రాంతి ఇస్తారని తెలుస్తోంది. గణాంకాలను తీవ్రంగా పరిశీలిస్తున్న టీం మేనేజ్మెంట్.. మెరుగైన ఆట తీరు ప్రదర్శిస్తున్న ఆటగాళ్లకు మాత్రమే ఫైనల్ మ్యాచ్లో అవకాశం ఇస్తుందని సమాచారం. అయితే ఈ జాబితాలో ఓ కీలక ఆటగాడు చోటు కోల్పోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది.

అతనిపై వేటు తప్పదా

టీమిండియాలో ప్రధాన స్పిన్ బౌలర్ గా కులదీప్ యాదవ్ కొనసాగుతున్నాడు. అయితే అతడు ఐసీసీ నాకౌట్ మ్యాచ్ లలో పెద్దగా రాణించడం లేదు. అతని రికార్డులు దారుణంగా ఉన్నాయి. ముఖ్యంగా 2023 వన్డే వరల్డ్ కప్ సెమి ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టుపై కులదీప్ యాదవ్ 1/56 గణాంకాలు నమోదు చేశాడు. ఆస్ట్రేలియాలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 56 పరుగులు ఇచ్చి ఒక వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. 2024 t20 వరల్డ్ కప్ సెమి ఫైనల్ మ్యాచ్లో 13 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. ఇది మాత్రమే అతడి అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది. ఇక టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో 45 పరుగులు ఇచ్చిన కులదీప్ యాదవ్.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్లో కులదీప్ యాదవ్ 44 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అయితే కులదీప్ యాదవ్ గణాంకాలు సరిగ్గా పోవడంతో ఫైనల్ మ్యాచ్లో హర్షిత్ రాణా లేదా అర్ష్ దీప్ సింగ్ ను తీసుకుంటారని తెలుస్తోంది. దీనికి సంబంధించి జాతీయ మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి..” కులదీప్ యాదవ్ ను పక్కన పెట్టవచ్చు. అతని స్థానంలో పేస్ బౌలర్ కు అవకాశం లభించవచ్చు. ప్రస్తుతం టీమిండియాలో అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి భీకరంగా బౌలింగ్ చేస్తున్నారు. ఇందులో వరుణ్ చక్రవర్తి మినహా మిగతా ఇద్దరు ఆల్రౌండర్లు. ఇప్పటికే వారు తమ ప్రతిభను నిరూపించుకున్నారు. ఒకవేళ కులదీప్ యాదవ్ ను కనుక టీమిండియా మేనేజ్మెంట్ పక్కన పెడితే.. అతని స్థానంలో ఒక పేస్ బౌలర్ కు అవకాశం ఉంటుందని తెలుస్తోంది. మహమ్మద్ షమీ, హార్దిక్ పాండ్యా పేస్ బౌలింగ్ బాధ్యతను మోస్తున్నారు. ఒకవేళ కులదీప్ ను పక్కనపెట్టి అర్ష్ దీప్ సింగ్ లేదా హర్షిత్ రాణా ను జట్టులోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది.

 

Also Read:  40 ఏళ్ల వయసులో స్టార్ ఫుట్ బాలర్ నిర్ణయం వెనక్కి.. భారత జట్టుకు మంచి రోజులు వచ్చినట్టేనా?

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version