Jammu Kashmir : జమ్ము కాశ్మీర్ హిమాలయాలకు దగ్గరగా ఉంటుంది. అందువల్లే అక్కడ ఉష్ణోగ్రతలు తక్కువ స్థాయిలో నమోదు అవుతుంటాయి. వర్షాకాలంలో కూడా అక్కడ చలిగాలులు వీస్తుంటాయి. ఇక శీతాకాలంలో అయితే ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలలోకి పడిపోతుంటాయి. ఆ సమయంలో అక్కడి వాతావరణాన్ని ఆస్వాదించడానికి ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు వస్తుంటారు. అక్కడి సరస్సులను, మంచు పర్వతాలను చూస్తూ పరవశించిపోతుంటారు. శీతాకాలంలో జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో వందల కోట్ల వ్యాపారం పర్యాటకం ఆధారంగా సాగుతుంటుంది. ఇక్కడ కేవలం పర్యాటకుల కోసమే ప్రత్యేకంగా హోటల్స్ నిర్మించారు. కొంతకాలంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉండడంతో అక్కడికి పర్యాటకులు విపరీతంగా వస్తున్నారు. గత ఏడాది శీతాకాలంలో సరైన స్థాయిలో మంచు కురవలేదు. దీంతో పర్యాటకులు ఆశించినంత స్థాయిలో రాలేదు. కానీ ఈ ఏడాది పరిస్థితి పర్వాలేకపోయినప్పటికీ.. ఊహించినంత స్థాయిలో మాత్రం మంచు కురవలేదు.. ఇప్పుడిక ఎండాకాలం మొదలు కావడంతో జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలోనూ ఉష్ణోగ్రతలు పెరగడం ప్రారంభమైంది. ప్రస్తుతం అక్కడ 25 నుంచి 30 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చి నెలలో ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఒక రకంగా అక్కడ రికార్డే. వాతావరణ మార్పుల వల్ల అక్కడ కూడా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
Also Read : కంటోన్మెంట్ జోన్లు ప్రకటన.. 44 రోజుల్లో 17 మంది మృతి.. జమ్మూ కాశ్మీర్‌లో అసలేం జరుగుతోంది.. ?
సముద్ర అలల్లా దూసుకొచ్చాయి..
జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో సాధారణంగా మార్చి నెలలో హిమభాతం అనేది సంభవించదు. కానీ సర్బాల్ అనే గ్రామంలో భయంకరమైన హిమభాతం సంభవించింది. భారీగా మంచు విరిగిపడి దూసుకు వచ్చింది. ఇటువంటి పరిణామం గతంలో ఎప్పుడూ ఇక్కడ చోటు చేసుకోలేదు. మంచు విరికి కిందికి దూసుకొస్తున్నప్పుడు ఆ సమీప ప్రాంతాల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం సంభవించలేదు. మంచు విరిగిపడి దూసుకు వస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ” ఉన్నట్టుండి పెద్ద పెద్ద మంచు ఫలకలు విరిగిపడ్డాయి. అవి అత్యంత భారీ పరిమాణంలో ఉన్నాయి. రాకాసి అలల మాదిరిగా దూసుకు వచ్చాయి. ఆ సమయంలో ఎవరూ అక్కడ లేకపోవడంతో ప్రాణ నష్టం సంభవించలేదు. మార్చి నెలలో ఇలా మంచు విరిగిపడటం గతంలో ఎప్పుడూ చూడలేదు. జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో హిమ పాతం మాత్రమే సంభవిస్తుంది. కానీ ఈసారి ఏకంగా మంచు ఫలకాలు విరిగి పడుతున్నాయి. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులే ఇందుకు కారణం అనుకుంటా. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి పరిణామం భవిష్యత్తులో చోటు చేసుకోబోయే ప్రమాదాన్ని సూచిస్తోంది. వాతావరణంలో ఏర్పడుతున్న మార్పులు మాలో తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నాయి.. భవిష్యత్తు కాలంలో ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో అర్థం కావడం లేదని” స్థానికులు అంటున్నారు.
Also Read : జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలపై నెలకొన్న ఉత్కంఠ
జమ్మూకశ్మీర్లోని సర్బాల్ గ్రామంలో హిమపాతం భయంకరంగా సంభవించింది. భారీగా మంచు విరిగిపడి దూసుకొచ్చిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రాణనష్టం ఏమీ జరగలేదని అధికారులు వెల్లడించారు.#JammuKashmir #Jammu#Kashmir#snowfall #India #viralnews pic.twitter.com/xbZmxQfGWw
— Anabothula Bhaskar (@AnabothulaB) March 7, 2025