Babar Azam : సరిగ్గా ఇన్ని సంవత్సరాలకు దక్షిణాఫ్రికాకు మళ్ళీ ఆ స్థాయిలో బౌలర్ దొరికాడు.. అతని పేరు వియాన్ మూల్డర్(vian mulder).. విపరీతమైన ఆవేశం ఉంటుంది. బంతివేయడమే ఆలస్యం.. తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉంటావికెట్ పడితే పట్టరాని ఆనందంతో ఊరేగుతుంటాడు. ఇక ప్రస్తుతం పాకిస్తాన్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్టులో ఒక్క వికెట్ పడగొట్టకపోయినా.. పాకిస్తాన్ జట్టుపై మానసిక యుద్ధం చేశాడు. అంతిమంగా అతడు అందులో గెలుపొందాడు. చివరికి తన జట్టును కూడా గెలిపించాడు. దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 615 పరుగులు చేసింది. రికెల్టన్ 259, వెర్రినే(verriney), బవుమా(babuma) సెంచరీలు చేశారు. మహమ్మద్ అబ్బాస్, సల్మాన్ అఘా చెరి మూడు వికెట్లు పడగొట్టారు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ 194 పరుగులకు అలౌట్ అయింది. బాబర్ అజాం 58 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. రబాడ మూడు వికెట్లు పడగొట్టాడు. ఫాలో అన్ తో రెండవ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన పాకిస్తాన్ జట్టు… 478 పరుగులకు అలౌట్ అయింది. కెప్టెన్ మసూద్ 145, బాబర్ అజామ్ 81 పరుగులు చేశారు. రబాడ, కేశవ్ మహారాజ్ చెరి మూడు వికెట్లు సాధించారు.
ముల్డర్ దెబ్బ కొట్టాడు
పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్ సమయంలో అజామ్(Babar Azam), మసూద్(Masood) తొలి వికెట్ కు 205 పరుగులు చేశారు. వీరిద్దరూ ఒకానొక దశలో దక్షిణాఫ్రికా చేసిన పరుగులను అధిగమించేలాగా కనిపించారు. దక్షిణాఫ్రికా కెప్టెన్ ఎంత మంది బౌలర్లను ప్రయోగించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. దీంతో ముల్డర్ తన సహనాన్ని కోల్పోయాడు. బాబర్ అజామ్ స్ట్రైకర్ గా ఉండగా బంతిని వేశాడు.. ఆ బంతిని అజామ్ డిఫెన్స్ అడాడు. ఆ బంతి కాస్త ముల్డర్ చేతిలోకి వచ్చింది. వెంటనే ఆవేశంతో ఆ బంతిని వికెట్ల వైపు కాకుండా.. అజామ్ కాళ్లను టార్గెట్ చేసి వేశాడు. అంత కాదు తన నోటికి పని చెప్పాడు. దీంతో బాబర్ కూడా అదే స్థాయిలో స్పందించాడు. అయితే ముల్డర్ ఉద్దేశాన్ని బాబర్ సరిగా అర్థం చేసుకోలేకపోయాడు. ఆ తర్వాత కొంతసేపటికి ఆట మీద పట్టు కోల్పోయి బాబర్ 81 పరుగుల వద్ద మార్గో జాన్సన్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. దీంతో పాకిస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత ఈ స్థాయిలో భాగస్వామ్యాలు నమోదు కాకపోవడంతో పాకిస్తాన్ 478 పరుగులకు ఆల్ అవుట్ అయింది. దక్షిణాఫ్రికా ఎదుట 60 పరుగుల టార్గెట్ విధించింది. దీంతో ఆ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా వికెట్ కోల్పోకుండానే చేదించింది. తద్వారా వరుసగా రెండో టెస్టు విజయం సాధించింది. ఇప్పటికే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లోకి వెళ్లిన దక్షిణాఫ్రికా.. లార్డ్స్ లో జరిగే ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది.
The Agressive Side Of Babar Azam ❤️.#BabarAzam #SAvsPAK #PAKvSA #PakistanCricket #Babar #SAvsPAK pic.twitter.com/eRME0Hn20C
— Babarology 56 (@HaroonRaso94849) January 5, 2025