Homeక్రీడలుక్రికెట్‌Babar Azam Criticism: నువ్వు బ్యాటింగ్ చేయలేవు.. బంతినీ పట్టలేవు .. రిటైర్మెంట్ తీసుకో బాబర్

Babar Azam Criticism: నువ్వు బ్యాటింగ్ చేయలేవు.. బంతినీ పట్టలేవు .. రిటైర్మెంట్ తీసుకో బాబర్

Babar Azam Criticism: బాబర్ అజామ్ కు పాకిస్తాన్ అభిమానులు మామూలు ఎలివేషన్లు ఇచ్చే వాళ్ళు కాదు. అతడిని పాకిస్తాన్ క్రికెట్లో విరాట్ కోహ్లీ అని ఆకాశానికి ఎత్తేవారు. అప్పట్లో బాబర్ కూడా మెరుగైన ఇన్నింగ్స్ ఆడేవాడు. వేగంగానే బ్యాటింగ్ చేసేవాడు. ఆ తర్వాత ఫేమ్ రావడంతో బాబర్ ఆట పక్కదారి పట్టింది. అతడి ఏకాగ్రత పూర్తిగా దెబ్బతిని.. మొత్తంగా కెరియర్ నాశనమైంది. బాబర్ తన బ్యాటింగ్ మీద సరిగా ఫోకస్ చేయలేకపోవడంతో కొద్దిరోజుల పాటు మేనేజ్మెంట్ […]

Babar Azam Criticism: బాబర్ అజామ్ కు పాకిస్తాన్ అభిమానులు మామూలు ఎలివేషన్లు ఇచ్చే వాళ్ళు కాదు. అతడిని పాకిస్తాన్ క్రికెట్లో విరాట్ కోహ్లీ అని ఆకాశానికి ఎత్తేవారు. అప్పట్లో బాబర్ కూడా మెరుగైన ఇన్నింగ్స్ ఆడేవాడు. వేగంగానే బ్యాటింగ్ చేసేవాడు. ఆ తర్వాత ఫేమ్ రావడంతో బాబర్ ఆట పక్కదారి పట్టింది. అతడి ఏకాగ్రత పూర్తిగా దెబ్బతిని.. మొత్తంగా కెరియర్ నాశనమైంది.

బాబర్ తన బ్యాటింగ్ మీద సరిగా ఫోకస్ చేయలేకపోవడంతో కొద్దిరోజుల పాటు మేనేజ్మెంట్ పక్కన పెట్టింది. కెప్టెన్సీ నుంచి కూడా తొలగించింది. అయినప్పటికీ అతడు పూర్వపు లయను అందుకోలేదు. జట్టులో వస్తు పోతూ.. విసిటింగ్ ప్లేయర్ లాగా బాబర్ పరిస్థితి మారిపోయింది.. ఆ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ లో కూడా తీవ్రంగా నిరాశపరచడంతో అతనిపై విపరీతంగా విమర్శలు వ్యక్తం అయ్యాయి.

బాబర్ ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఆడుతున్నాడు. ఈ క్రమంలో ఒక యాడ్ షూటింగ్లో అతడు పాల్గొన్నాడు. షూట్ జరుగుతున్నప్పుడు అతడు బంతిని ఆదుకోవాలి. అతడికి గాయాలు కాకుండా మైదానంలో పరుపులు ఏర్పాటు చేశారు. కానీ బాబర్ బంతిని అందుకోలేకపోయాడు. ఇలా వరుసగా టేక్ లు చాలా తిన్నాడు. దీంతో బాబర్ తీరు పట్ల షూట్ మేకర్స్ తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.

బాబర్ బంతిని అందుకోలేకపోవడంతో సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి..”నువ్వు విరాట్ కోహ్లీ అని ఫీల్ అయ్యావు. పాకిస్తాన్ అభిమానులు నీకు విపరీతమైన ఎలివేషన్ ఇచ్చారు. కానీ నీ ఆట తీరు వారికి తెలియదు కాబట్టి.. గొప్పగా ఊహించుకున్నారు . ఇప్పుడు నీ అసలు రంగు బయటపడుతోంది. కనీసం క్యాచ్ కూడా పట్టలేకపోతున్నావు. బ్యాటింగ్ చేయలేవు.. క్యాచ్లు కూడా పట్టలేవు.. ఇక రిటైర్మెంట్ తీసుకో బాబర్” అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా, బాబర్ వ్యవహార శైలి పట్ల పాకిస్తాన్ అభిమానులు కూడా మండిపడుతున్నారు.. అతడు సరిగ్గా ఆడటం లేదని.. అతని వల్ల మిగతా ప్లేయర్లకు అవకాశాలు రావడంలేదని ఆరోపిస్తున్నారు.. అతడు ఇప్పటికైనా తన ఆట తీరు మార్చుకోవాలని సూచిస్తున్నారు. బాబర్ యాడ్ షూటింగ్లో కూడా బంతిని అందుకోలేకపోతున్నాడు అంటే.. అతని ఏకాగ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని పాకిస్తాన్ అభిమానులు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper