Viral video : ఓరయ్యా.. మీ ఆస్ట్రేలియాకు వన్డే వరల్డ్ కప్ తెచ్చాడు.. చివరికి అతడినే మర్చిపోయారంటే మీరు మామూలోళ్లు కాదు..

వన్డే వరల్డ్ కప్, టెస్ట్ ఛాంపియన్ షిప్, టీ 20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలను సాధించి ఆస్ట్రేలియా సరికొత్త చరిత్ర సృష్టించింది. అయితే క్రికెట్లో రారాజుగా వెలుగొందినప్పటికీ.. ఆస్ట్రేలియా జట్టులోని ఆటగాళ్లకు అంతగా ఫాలోయింగ్ ఉండదు.

Written By: Anabothula Bhaskar, Updated On : August 12, 2024 9:40 pm

Pat Cummins, Travis Head

Follow us on

Viral video: క్రికెట్ కు మన దేశంలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒక మతం లాగా క్రికెట్ ను ఆచరిస్తారు. ఇంకొందరైతే ఆరాధిస్తారు. క్రికెటర్లు అనుభవించే సెలబ్రిటీ హోదా గురించి సప్తకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. మన దేశ క్రికెటర్లకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. కొంతమంది క్రికెటర్లనైతే ఆరాధ్య దైవాలుగా భావిస్తుంటారు. మనతోపాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్తాన్ వంటి దేశాలు క్రికెట్ ఆడుతాయి. కాకపోతే ఆ దేశాల కంటే మనదేశంలో క్రికెట్ అంటే విపరీతమైన క్రేజీ ఉంటుంది.. ఇక భారత్ ఆడే మ్యాచ్ లకైతే విపరీతంగా ప్రేక్షకులు హాజరవుతుంటారు. మైదానాలు కిక్కిరిసిపోతుంటాయి.. గత ఏడాది మనదేశంలో వన్డే వరల్డ్ కప్ జరిగితే.. ప్రతి మైదానం ప్రేక్షకులతో సందడిగా మారాయి.

ఇక మన దేశం తర్వాత ఆస్ట్రేలియాలో కూడా క్రికెట్ ను ఆరాధిస్తారు. ఇప్పుడు కాదు గాని స్టీవ్ వా, పాంటింగ్ హయాంలో ఆస్ట్రేలియా ప్రపంచ క్రికెట్ ను శాసించింది. వన్డే వరల్డ్ కప్, టెస్ట్ ఛాంపియన్ షిప్, టీ 20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలను సాధించి ఆస్ట్రేలియా సరికొత్త చరిత్ర సృష్టించింది. అయితే క్రికెట్లో రారాజుగా వెలుగొందినప్పటికీ.. ఆస్ట్రేలియా జట్టులోని ఆటగాళ్లకు అంతగా ఫాలోయింగ్ ఉండదు. ఎందుకంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న వీడియోని చూస్తే అలానే అనాల్సి వస్తుంది.

గత ఏడాది భారత్లో జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలిచింది. భారత్ తో జరిగిన ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. ఆస్ట్రేలియా విజేతగా నిలవడంలో ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కీలకపాత్ర పోషించాడు. ఇక్కడ మాత్రమే కాదు ఫైనల్ మ్యాచ్లో బ్యాట్స్ మెన్ ట్రావిస్ హెడ్ అద్భుతంగా ఆడి ఆస్ట్రేలియాకు ట్రోఫీ అందించడంలో కీలకపాత్ర పోషించాడు. అయితే వీరిద్దరిని భారత ప్రేక్షకులు గుర్తుపెట్టుకున్నంతగా.. ఆస్ట్రేలియా వాసులు మదిలో నిలుపుకోలేకపోయారు. అటు కమిన్స్, ఇటు హెడ్ అంటే ఎవరో తమకు తెలియదని ఆస్ట్రేలియన్లు చెబుతుండడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది..” మీకు క్రికెట్ ఆస్ట్రేలియా గురించి తెలుసా? అందులో కమిన్స్, హెడ్ ఆట తీరు ఎప్పుడైనా చూశారా? వారి గురించి ఎప్పుడైనా విన్నారా?” అని ఓ యూట్యూబర్ ప్రశ్నలు అడిగితే.. చాలామంది తమకు తెలియదని సమాధానం చెప్పారు.. అయితే చివర్లో భారత నేపథ్యానికి చెందిన ఓ వ్యక్తి మాత్రం తనకు విరాట్ కోహ్లీ మాత్రమే తెలుసని పేర్కొన్నాడు.. ఈ వీడియో పోస్ట్ చేసిన ఓ నెటిజన్..”ఐసీసీకి ఈ అనుభవం సిగ్గుచేటు. ఆస్ట్రేలియాలో క్రికెట్ అవసాన దశలో ఉంది” అంటూ రాస్కొచ్చాడు. ట్విట్టర్లో ఈ వీడియోను ఇప్పటికే ఐదు లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు.