https://oktelugu.com/

Kolkata doctor case : నిందితుడు రెగ్యులర్ పోలీస్ కాదు.. ఆర్జీ మెడికల్ కాలేజీలో అన్ని విభాగాల్లో యాక్సెస్.. కోల్ కతా డాక్టర్ కేసులో విస్తు పోయే వాస్తవాలు..

ఆ బాధితురాలి మృతదేహం వద్ద బ్లూటూత్ హెడ్సెట్ లభించింది. అది ఈ కేసులో కీలక ఆధారంగా మారింది. భవనంలోకి ప్రవేశిస్తున్న సమయంలో రాయ్ మెడకు హెడ్సెట్ ఉన్నట్టు సిసి కెమెరాలో కనిపించింది

Written By:
  • NARESH
  • , Updated On : August 12, 2024 / 09:48 PM IST

    kolkata doctor case

    Follow us on

    Kolkata doctor case: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్ కతా లోని ఆర్ జీ వైద్య కళాశాలకు చెందిన 31 సంవత్సరాల మహిళ డాక్టర్ హత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చనిపోయిన మహిళ డాక్టర్ కు సంఘీభావంగా దేశవ్యాప్తంగా పలువురు వైద్యులు నిరసనలు చేపడుతున్నారు. డాక్టర్ల ప్రాణాలకు భరోసా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ మహిళా వైద్యురాలిపై అఘాయిత్యానికి పాల్పడి, చంపేసిన సంజయ్ రాయ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ సంఘటనలో పలు దిగ్భ్రాంతి కరమైన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఘటన చోటు చేసుకున్నప్పుడు ఆ డాక్టర్ పై అఘాయిత్యానికి పాల్పడింది ఆసుపత్రి ఉద్యోగని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే అతడు ఆస్పత్రి ఉద్యోగి కాదని, మెడికల్ కాలేజీ క్యాంపస్ బిల్డింగ్ వద్డ ప్రతిరోజు కనిపించేవాడని తెలుస్తోంది..

    కోల్ కతా పోలీసు విభాగంలో..

    కోల్ కతా పోలీసు విభాగంలో ట్రాఫిక్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో కాంట్రాక్టు పద్ధతిలో అతడు పనిచేశాడు. ఆ సమయంలో ప్రతినెలా 12,000 వేతనంగా చెల్లించేవారు. ఆ తర్వాత అతడు 2019లో పోలీసు వెల్ఫేర్ సెల్ కు బదిలీ అయ్యాడు. ఆర్జీ మెడికల్ కాలేజ్ వద్ద ఉన్న పోలీస్ అవుట్ పోస్టులో పనిచేశాడు. అయితే ఆస్పత్రిలో ఉన్న అన్ని శాఖలకు అతడికి ఈ యాక్సిస్ ఉంది. ఫలితంగా దూరం నుంచి రోగులు వస్తే వాళ్లకు అడ్మిషన్ ఇప్పించేవాడు. ఈ పని చేసినందుకు డబ్బులు వసూలు చేసేవాడు. పూర్తిస్థాయిలో పోలీస్ కాకపోయినప్పటికీ సంజయ్ పోలీస్ బరాకుల్లో నివాసం ఉండేవాడు. కోల్ కతా పోలీస్ అనే టి షర్టు వేసుకొని తిరిగేవాడు. అతడి ద్విచక్ర వాహనంపై కోల్ కతా పోలీస్ అనే ట్యాగ్ ఉండేది. బయట తనను తాను కోల్ కతా పోలీస్ అని పరిచయం చేసుకునేవాడు.

    పోలీసులు ఎంక్వయిరీ చేయగానే..

    మహిళా వైద్యురాలి హత్యాచారం వెలుగులోకి రావడంతో పోలీసులు విచారణ వేగంగా జరుపుతున్నారు. ఈ క్రమంలోనే సంజయ్ తన నేరాన్ని ఒప్పుకున్నాడు. పోలీసులు విచారిస్తున్న సమయంలో అతడు ఏమాత్రం పాశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. పైగా కావాలంటే ఉరితీయాలని అతడు పోలీసులతో వాదించినట్టు తెలుస్తోంది. మరోవైపు అతడి మొబైల్ ఫోన్లో మొత్తం పెద్దల చిత్రాలకు సంబంధించిన వీడియోలు ఉండడం పోలీసులను నివ్వెర పరుస్తోంది. ఆ ఆస్పత్రి పరిసరాల్లో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. అందులో రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా సంజయ్ ని పోలీసులు అరెస్టు చేశారు. గత శుక్రవారం ఉదయం 4 గంటలకు అతడు అత్యవసర భవనంలోకి ప్రవేశించాడు. కొన్ని గంటల తర్వాత అక్కడ మహిళా వైద్యురాలి మృతదేహాన్ని అక్కడ గుర్తించారు.

    బ్లూ టూత్ కనిపించగానే..

    ఆ బాధితురాలి మృతదేహం వద్ద బ్లూటూత్ హెడ్సెట్ లభించింది. అది ఈ కేసులో కీలక ఆధారంగా మారింది. భవనంలోకి ప్రవేశిస్తున్న సమయంలో రాయ్ మెడకు హెడ్సెట్ ఉన్నట్టు సిసి కెమెరాలో కనిపించింది. అయితే అతడు వెళ్ళిపోతున్న సమయంలో ఆ హెడ్సెట్ కనిపించలేదు. మరోవైపు ఆ మహిళా వైద్యురాలి మృతదేహం వద్ద ఉన్న హెడ్సెట్, నిందితుడి హెడ్సెట్ పేరు కావడం విశేషం.. మహిళా వైద్యురాలిని చంపిన తర్వాత సంజయ్.. ఆధారాలు లభించకుండా ఉండేందుకు దుస్తులను శుభ్రం చేసుకున్నాడు. కానీ అతడు వేసుకున్న బూట్లపై రక్తపు మరకలు అలాగే ఉన్నాయి. ప్రస్తుతం సంజయ్ ని ఆగస్టు 23 వరకు రిమాండ్ లో ఉంచారు.