Site icon OkTelugu

Veteran Star Heroes: సెకండ్ ఇన్నింగ్స్ లో సక్సెస్ అవుతున్న ఒకప్పటి స్టార్ హీరోలు వీళ్లేనా..?

Veteran Star Heroes

Veteran Star Heroes

Veteran Star Heroes: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోలుగా వెలుగొందిన వాళ్లు సైతం ఇప్పుడు అవకాశాలు లేకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్టులు, విలన్లుగా మారి తనదైన రీతిలో ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు…ఒకప్పుడు ఫ్యామిలీ స్టార్ గా పేరు సంపాదించుకున్న జగపతిబాబు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా పలు రకాల పత్రాలను చేస్తు ముందుకు సాగుతున్నాడు. ఒకప్పుడు హీరోగా చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న వాళ్ళలో పెళ్లి పృథ్వి ఒకరు. ఆయన సైతం ఇప్పుడు బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. అనిమల్ సినిమాలో తను విలన్ గా నటించాడు. ఆ ఒక్క సినిమాతో అతనికి 20 సినిమాల నుంచి ఆఫర్స్ అయితే వచ్చాయట. మొత్తానికైతే ప్రస్తుతం అతను చాలా బిజీ ఆర్టిస్ట్ అయిపోయాడు… ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మ్యాన్ గా మాన్ గా గుర్తింపును సంపాదించుకున్న రాజశేఖర్ సైతం సెకండ్ ఇన్నింగ్స్ లో రాణించే ప్రయత్నం చేస్తున్నాడు. నితిన్ హీరోగా వచ్చిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేశాడు.

ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో శర్వానంద్ హీరోగా వస్తున్న బైకర్ సినిమాలో కోచ్ గా నటిస్తున్నాడు… రీసెంట్గా ఈ సినిమా నుంచి రాజశేఖర్ గ్లింప్స్ కూడా రిలీజైంది. ప్రస్తుతం ఈ సినిమాలో పాజిటివ్ క్యారెక్టర్ లో ఇస్తున్నప్పటికి వీలైనంత తొందరలో నెగెటివ్ పాత్రలో నటించే అవకాశాలైతే ఉన్నాయి.

విలన్ పాత్రలో నటించాలని చాలా కోరికగా ఉందంటూ గతంలో రాజశేఖర్ కొన్ని సందర్భాల్లో తెలియజేశాడు. ఇక ఏది ఏమైనా కూడా తొందర్లోనే తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా మంది విలన్స్ దొరకబోతున్నారనేది చాలా క్లారిటీ అర్థమవుతుంది…

ఇక ఇప్పుడున్న స్టార్ హీరోలకు గట్టి పోటీ ఇవ్వాలంటే ఒకప్పటి స్టార్ హీరోల వల్లే అవుతుందని పలువురు సినిమా మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు… చూడాలి మరి ఒకప్పటి స్టార్ హీరోల్లో ఎంతమంది ఇప్పుడు విలన్లుగా రాణిస్తారు, ఎంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మెప్పిస్తారు అనేది…

Exit mobile version