Homeఎంటర్టైన్మెంట్Ram Charan Peddi Movie : 'పెద్ది' 2వ పాట రిలీజ్ డేట్ వచ్చేసింది..పూర్తి వివరాలు...

Ram Charan Peddi Movie : ‘పెద్ది’ 2వ పాట రిలీజ్ డేట్ వచ్చేసింది..పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం!

Ram Charan Peddi Movie : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) నటించిన ‘పెద్ది'(Peddi Movie) మూవీ రెండవ పాట అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ‘చికిరి చికిరి’ పాట గ్లోబల్ వైడ్ గా ఎలాంటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కేవలం తెలుగు వెర్షన్ లోనే ఈ పాటకు యూట్యూబ్ లో 160 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. ఇప్పటికీ ఈ పాట మ్యూజిక్ ప్లాట్ ఫారమ్స్ లో ట్రెండ్ అవుతూనే ఉంది. అంత పెద్ద బ్లాక్ బస్టర్ సాంగ్ తర్వాత ఈ చిత్రం నుండి విడుదల అవ్వబోయే ప్రతీ పాట పై అంచనాలు భారీ రేంజ్ లో ఉంటాయి. రెండవ పాట పైన కూడా అలాంటి అంచనాలే ఉన్నాయి. ఈ పాట సినిమాలోని ఇంట్రడక్షన్ సాంగ్ అట. మంచి మోటివేషనల్ గా కూడా ఉంటుందట.

అనంత శ్రీరామ్ ఈ పాటకు లిరిక్స్ ని అందించాడు. ‘చికిరి చికిరి’ పాటకు కొరియోగ్రఫీ చేసిన జానీ మాస్టర్ ఈ పాటకు కూడా కొరియోగ్రఫీ చేసాడు. మొదటి పాటకంటే రెండవ పాట చాలా బాగా వచ్చిందట. రామ్ చరణ్ స్టెప్పులు కూడా అదిరిపోతాయట. ఒక్క పాట హిట్ అయ్యినందుకే పెద్ది మూవీ అంచనాలు పాన్ ఇండియా లెవెల్ లో ఎవ్వరూ ఊహించని రేంజ్ కి చేరింది. ఇక రెండవ పాట కూడా హిట్ అయితే ఈ సినిమా రేంజ్ ఎక్కడికి వెళ్లి ఆగుతుందో మీ ఊహకాలకే వదిలేస్తున్నాం. ఈ పాటకు సంబంధించిన ప్రోమో ని శివరాత్రి రోజున విడుదల చేసి, పూర్తి పాటని వచ్చే వారం విడుదల చేయబోతున్నట్టు సమాచారం . మరి ఈ పాటకు ఈవెంట్ ని ఏమైనా ఏర్పాటు చేస్తారా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇకపోతే ఈ చిత్రాన్ని మొదట్లో మార్చి 27 న విడుదల చెయ్యాలని అనుకున్నారు కానీ, షూటింగ్ చాలా వరకు బ్యాలన్స్ ఉండడం తో ఏప్రిల్ 30 వ తేదికి వాయిదా వేశారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అవ్వడానికి ఇంకా 40 రోజుల సమయం ఉందట. రామ్ చరణ్ కూడా రెగ్యులర్ గా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Christopher Nolan: ది గ్రేట్ క్రిస్టోఫర్ నోలన్ కు నచ్చిన భారతీయ దర్శకుడు ఎవరో తెలుసా…

Christopher Nolan: క్రిస్టోఫర్ నోలన్.. ఈ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది. ప్రముఖ దర్శకుడిగా తనదైన శైలిలో చిత్రాలను ప్రేక్షకులకు అందించాడు. అందులో భాగంగా ఇటీవల విడుదలైన 'ది ఒడిస్సీ'...

Dhanush: విజయ్ సీఎం అయ్యాడని.. అందరూ అయిపోతారా..వీడియో వైరల్

Dhanush: తమిళనాడులో మరో సినిమా నటుడు రాజకీయాల్లోకి వస్తున్నాడా..? అనే చర్చ హాట్ టాపిక్ అయింది. ఇటీవల ప్రముఖ నటుడు ధనుష్ చేసే కొన్ని కార్యక్రమాలను భట్టి చూస్తే ఆయన కూడా త్వరలో...

Nagendra Sai: ఏడాదిలో 13 కొలువులు.. ఈ కడప యువకుడికి ఎలా సాధ్యమైంది.. చేసిన కృషి ఏంటి

Nagendra Sai: ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ రావడమే కష్టంగా ఉంది.. నోటిఫికేషన్లు వచ్చిన కాంపిటీషన్ చాలా ఎక్కువ. ఈ పరిస్థితులు పోటీపడి కొలువు పుట్టడం అంత సులభం కాదు. లక్షల...

Vaibhav Suryavanshi: తెలుగు గడ్డకు.. సూర్య వంశీకి ఏంటి సంబంధం.. వీవీఎస్ లక్ష్మణ్ చెప్పిన నిజం..

Vaibhav Suryavanshi: యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్య వంశీ జింబాబ్వే సిరీస్లో అదరగొట్టాడు. టీ మీడియా సాధించిన విజయాలలో ముఖ్యపాత్ర పోషించాడు. రెండు హాఫ్ సెంచరీలు చేసి అదరగొట్టాడు. తద్వారా తన మీద...

Hydra Ranganath: హైడ్రా రంగనాథ్ కూడా మనిషే.. అతడికీ కోపం ఉంటుంది..

Hydra Ranganath: ఆవుల వెంకట రంగనాథ్.. అలియాస్ హైడ్రా రంగనాథ్.. గడిచిన రెండు సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి కంటే ఎక్కువగా ఈ పేరు తెలంగాణ రాజకీయాలలో వినిపిస్తోంది. ముఖ్యంగా భారత రాష్ట్ర...
Oktelugu Epaper
Exit mobile version