Olympic Games Paris 2024 : భారత్ ఒలింపిక్ పతకాలు సాధించలేకపోవడానికి కారణమిదే.. యూట్యూబర్ అన్వేష్ ఏంటి ఈ స్థాయిలో రెచ్చిపోయాడు?

లేకపోతే ఇలానే ప్రతిసారి పరువు పోతూనే ఉంటుందని" అన్వేషణ అన్వేష్ వ్యాఖ్యానించాడు. అయితే ఈ వీడియో ఇప్పటికే లక్షల్లో వ్యూస్ సొంతం చేసుకుంది. చాలామంది అన్వేష్ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : August 12, 2024 9:28 pm

YouTuber Anvesh

Follow us on

Olympic Games Paris 2024 : మన దేశం జనాభాలో ప్రపంచ దేశాలన్నిటికంటే మొదటి స్థానంలో ఉంది. కానీ మనకంటే జనాభాలో దిగువన ఉన్న దేశాలు పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ లో బంగారు పతకాలు సాధించాయి. మనమంటే గిట్టని చైనా మొదటి స్థానంలో, అమెరికా రెండో స్థానంలో నిలిచాయి. మన దేశం కేవలం 6 మెడల్స్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈసారి ఒక్క గోల్డ్ మెడల్ కూడా రాలేదు. టోక్యో ఒలంపిక్స్ లో నీరజ్ చోప్రా జావెలిన్ త్రో లో గోల్డ్ మెడల్ సాధించాడు. పారిస్ ఒలంపిక్స్ లో మాత్రం కాంస్యం తో సరి పెట్టుకున్నాడు. వినేశ్ ఫొగాట్ అయితే 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉండటంతో రెజ్లింగ్ ఫైనల్స్ లో ఆడేందుకు అర్హత సాధించలేకపోయింది. ఇక ఏడుగురు అథ్లెట్లు మెడల్స్ సాధించే ప్రక్రియలో నాలుగో స్థానంలో నిలిచారు. లేకుంటే భారత్ డబుల్ మార్క్ దాటేది.

భారత అథ్లెట్లు ఆరు మెడల్స్ మాత్రమే సాధించడంతో సోషల్ మీడియా వేదికగా పలువురు విమర్శలు చేస్తున్నారు. ఇందులో ప్రముఖ యూట్యూబర్, నా అన్వేషణ అన్వేష్ కూడా ఉన్నాడు. ఏ విషయమైనా సరే కుండబద్దలు కొట్టేలా చెప్పే అన్వేష్ .. భారత్ ఒలింపిక్ మెడల్స్ సాధించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశాడు. “మన దేశం జనాభాపరంగా అన్ని దేశాల కంటే ముందు వరుసలో ఉంది. కానీ మనకంటే తర్వాతి స్థానంలో ఉన్న చైనా, అమెరికా ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్స్ సాధించాయి. చైనా మొదటి స్థానం, అమెరికా రెండో స్థానంలో నిలిచాయి. కానీ భారత్ టాప్ -10 లో కూడా స్థానం సంపాదించుకోలేకపోయింది. భారతీయులుగా మనం ఆ ఘనత సాధించలేకపోవడం పట్ల కాస్త సిగ్గుపడదాం. మనదేశంలో ఆటలకు ప్రయారిటీ బాగానే ఇస్తారు. సౌకర్యాలు బాగానే ఉన్నాయి. ఆయన కూడా ఒక బంగారు పతకం కూడా సాధించలేకపోయారు మన ఆటగాళ్లు. మనకంటే ఎన్నో రెట్లు అట్టడుగున ఉన్న కెన్యా 4 బంగారు పతకాలు సాధించింది. మన దేశం మాత్రం మెడల్స్ జాబితాలో 71 స్థానంలో ఉంది. ఇంతకంటే సిగ్గుచేటు మరొకటి ఉంటుందా. ఇది ప్రతి భారతీయుడు ఆలోచించుకోవాల్సిన విషయమని” నా అన్వేషణ అన్వేష్ వ్యాఖ్యానించాడు.

“120 ఏళ్ల ఘన నేపధ్యం ఉన్న ఒలింపిక్స్ లో భారత్ ఇప్పటివరకు కేవలం 40 మెడల్స్ మాత్రమే సాధించింది. మన దేశం కంటే ఆఫ్రికా దేశాలలో అవినీతి చాలా ఎక్కువ. అక్కడి ఆటగాళ్లు రోడ్లమీద పడుకొని వాళ్ళ దేశాలకు గోల్డ్ మెడల్స్ సాధించారు. మరి మనకేం పోయేకాలం. ఆఫ్రికాలోని ఈజిప్టు, ఉగాండా, కెన్యా, అల్జీరియా వంటి దేశాల ఆటగాళ్లు గోల్డ్ మెడల్స్ సాధించారు. కానీ మన ఆటగాళ్లు మాత్రం జస్ట్ కాంస్యం, రజతం తో సరిపెట్టుకున్నారు. దీనివల్ల మన దేశం పరువు పోయింది. నాలుగో ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నామని జబ్బలు చరుచుకుంటున్నాం. మనమే తోపులమని చెప్పుకుంటున్నాం. కానీ విశ్వ క్రీడా వేదిక పై మాత్రం విఫలమవుతున్నాం. ఇప్పటికైనా ఆటల మీద దృష్టి సారించి.. దేశం పరువు కాపాడే పని చేపడితేనే భారతీయులుగా మనకు గౌరవం ఉంటుంది. లేకపోతే ఇలానే ప్రతిసారి పరువు పోతూనే ఉంటుందని” అన్వేషణ అన్వేష్ వ్యాఖ్యానించాడు. అయితే ఈ వీడియో ఇప్పటికే లక్షల్లో వ్యూస్ సొంతం చేసుకుంది. చాలామంది అన్వేష్ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు.