ఆస్ట్రేలియా vs ఇండియా: సిడ్నీ టెస్టుకు పొంచి ఉన్న ముప్పు?

పైకి ఎంత ధీమా చెబుతున్నా సరే ఆస్ట్రేలియా క్రికెట్ సంఘం వైఖరి మాత్రం అందరికీ మంటపుట్టించేలానే ఉంది. ఓవైపు భారత క్రికెటర్లు బయటకు వెళితే ఐసోలేషన్లో ఉండాలని.. కరోనా టెస్టులు చేయించి మరీ హింసించిన క్రికెట్ ఆస్ట్రేలియా.. అక్కడి అభిమానులు కరోనాతో స్టేడియాలకు వచ్చినా ‘అబ్బే అదేం లేదు’ అంటూ తప్పించుకుండడంపై భారత అభిమానులు మండిపడుతున్నారు. Also Read: గాయాల బెడద.. 3వ టెస్టుకు టీమిండియా టీం ఇదే? ఇటీవల రెండో టెస్టు ముగిశాక రోహిత్ సహా […]

Written By: NARESH, Updated On : January 6, 2021 4:29 pm
Follow us on

పైకి ఎంత ధీమా చెబుతున్నా సరే ఆస్ట్రేలియా క్రికెట్ సంఘం వైఖరి మాత్రం అందరికీ మంటపుట్టించేలానే ఉంది. ఓవైపు భారత క్రికెటర్లు బయటకు వెళితే ఐసోలేషన్లో ఉండాలని.. కరోనా టెస్టులు చేయించి మరీ హింసించిన క్రికెట్ ఆస్ట్రేలియా.. అక్కడి అభిమానులు కరోనాతో స్టేడియాలకు వచ్చినా ‘అబ్బే అదేం లేదు’ అంటూ తప్పించుకుండడంపై భారత అభిమానులు మండిపడుతున్నారు.

Also Read: గాయాల బెడద.. 3వ టెస్టుకు టీమిండియా టీం ఇదే?

ఇటీవల రెండో టెస్టు ముగిశాక రోహిత్ సహా ఐదుగురు క్రికెటర్లు బయటకెళ్లి హోటల్ కు వెళితే క్రికెట్ ఆస్ట్రేలియా సహా అక్కడి మీడియా ఎంత రచ్చ చేసిందో అందరికీ తెలిసిందే. అయితే కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకోకుండా నెపాన్ని మాత్రం టీమిండియాపై వేస్తోంది ఆస్ట్రేలియా క్రికెట్ సంఘం.

తాజాగా మెల్ బోర్న్ వేదికగా జరిగిన భారత్-ఆస్ట్రేలియా రెండో టెస్టుకు హాజరైన ఓ అభిమానికి కరోనా పాజిటివ్ గా తేలడం కలకలం రేపింది. దీంతో రెండోరోజు అతడిపాటు స్టేడియంలో ఆ స్టాండ్ లో కూర్చున్న ప్రేక్షకులను ఐసోలేషన్ లో ఉండాలని క్రికెట్ ఆష్ట్రేలియా సూచించింది. బాక్సిండ్ డే టెస్టు స్టేడియాన్ని మొత్తం సిబ్బంది శానిటైజ్ చేశారు.

Also Read: మహేంద్ర సింగ్ ధోని ‘పంట’ పండింది!

ఈ క్రమంలోనే మూడో టెస్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. సిడ్నీలో కరోనా కేసులు ఎక్కువగా ఉండడంతో అక్కడ ప్రేక్షకులపై ఆంక్షలను పెంచింది ప్రభుత్వం. సిడ్నీ టెస్టుకు 50శాతానికి బదులుగా 25శాతం మంది మాత్రమే ప్రేక్షకులను అనుమతించాలని క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు నిర్ణయించింది. నిబంధనలు అతిక్రమించిన వారు ఏకంగా 1000 డాలర్లు ఫైన్ చెల్లించాలని హెచ్చరించింది. ప్రేక్షకులను పావు వంతుకు తగ్గించిన ఆస్ట్రేలియా ఇప్పుడు ఆటగాళ్లకు ఎలాంటి భద్రత కల్పిస్తుందనేది ఆసక్తిగా మారింది.