సీఎం జగన్ ఆశయాలు మహా గొప్పగా ఉన్నాయి. ఆయన అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సైతం ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. తన 18 నెలల పాలనలో ఇప్పటివరకు ప్రజల నుంచి విమర్శను ఎదుర్కొన్న దాఖలాలు అయితే లేవు. అమలులో మాత్రం అప్పుడప్పుడు ఆటంకాలు మాత్రం ఎదురయ్యాయి. ప్రతిపక్షాల కుట్రలతో బ్రేక్‌లు పడిన సందర్భాలు ఉన్నాయి.
Also Read: ప్యాకేజీ పవన్..: ఆ ముద్ర పోయేదెలా..!
ఇళ్ల పట్టాల పంపిణీ.. ప్రతిపక్షాల కుట్రలతో ఎన్ని వాయిదాలు పడి చివరకు ఎలా మొదలైందో అందరం చూశాం. ఇంకా కొన్ని చోట్ల కోర్టు కేసుల కారణంగా పట్టాల పండగా ఎప్పుడో తెలియని పరిస్థితి. ఇంగ్లిష్ మీడియం కూడా కోర్టు కేసుల వల్లే సందిగ్ధంలో పడింది. వీటితోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఇంటి వద్దకే రేషన్ బియ్యం పంపిణీ అనే కార్యక్రమం కూడా పదే పదే వాయిదా పడుతూ వస్తోంది. జనవరి 2021 నుంచి దీన్ని అమలు చేయడం గ్యారెంటీ అన్నారు. కానీ అది సాధ్యం కాలేదు. తీరా ఇప్పుడు ఫిబ్రవరి 1 అని అంటున్నారు. అయితే.. ఈసారి సీఎం జగన్ నేరుగా రేషన్ పంపిణీపై ప్రకటన చేయడంతో ప్రజల్లో కాస్తో కూస్తో నమ్మకం కుదిరింది.
బియ్యం పంపిణీ మాత్రమే కాదు.. బియ్యం నాణ్యతపై కూడా ఆయన చెప్పుకొచ్చారు. కొత్త సంవత్సరం కానుకగా తీపి కబురే చెప్పారు. ప్రతిపక్షాల సవాళ్లకు దీటుగా నాణ్యమైన స్వర్ణ రకం బియ్యాన్ని డోర్ డెలివరీ చేస్తామని ప్రకటించారు. రేషన్ బియ్యం నాణ్యత క్వాలిటీ ఏంటో, వాటిని దేనికి ఉపయోగించుకోవాలో అందరికీ తెలుసు. పేదలు మాత్రం నేటికీ అవే రేషన్ బియ్యంతో అన్నం వండుకుని పొట్ట నింపుకుంటున్నారు. తాజాగా నాణ్యమైన స్వర్ణరకం బియ్యం పంపిణీ కనుక పూర్తి స్థాయిలో సాధ్యమైతే అంతకంటే వారికి సంతోషకరమైన వార్త ఇంకోటి ఉండదు.ఒక వేళ నాణ్యమైనవి కాకుండా నాసిరకం పంపిణీ చేస్తే మాత్రం విమర్శలు ఎదుర్కోక తప్పదు. అందుకే ఈ విషయమై ఇప్పటికే అధికారులను సీఎం జగన్ హెచ్చరించారు కూడా.
Also Read: ఆ ఇద్దరు మంత్రుల మధ్య పొసగడం లేదట..: ఎందుకంటే..?
దేశంలోనే తొలిసారిగా ఏపీ ప్రభుత్వం ఇంటి వద్దకే రేషన్ అనే బృహత్తర కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. దీనికి వాహనాలు కావాలి, ప్యాకింగ్ చేయాలి, రేషన్ డీలర్లు కాకుండా ఇంకో ఇద్దరు మనుషులు కావాలి.. వాహనం ఇంటికి వెళ్లినప్పుడు లబ్ధిదారులు ఇళ్లవద్దే ఉండాలి.. ఆ తతంగం చాలా పెద్దది. కానీ.. ఇకపై ఇంటి వద్దకే రేషన్ అంటే.. వాహనం వచ్చినప్పుడు వాళ్లు ఇంట్లో ఉంటే చాలు. ఒకవేళ ఈ పథకం మాత్రం సక్సెస్ అయితే దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది. అందుకే జగన్ దీనిపై అంతగా ఫోకస్ పెట్టారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్