Australia WTC Final: క్రికెట్ ఇంగ్లాండ్ దేశంలో పుట్టి.. కమర్షియల్ గా భారతదేశంలో ఎదిగినప్పటికీ.. విజయాలు మాత్రం కంగారు గడ్డకే సాధ్యమయ్యాయి. వరుసగా విశ్వ సమరాలలో కంగారు జట్టు విజయాలు సాధించి ప్రపంచంలో క్రికెట్ ఆడే జట్లు అన్నింటికి అసూయ కలిగించింది. అసలు విజయం ఎలా సాధించాలి? మైదానంలో ఎలా శ్రమించాలి? ప్రత్యర్థి జట్టుపై ఎలా పై చేయి సాధించాలి? ఈ మూడు అంశాలలో కంగారు జట్టు ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. అందువల్లే ఆ జట్టు క్రికెట్ ను శాసిస్తోంది.. ఎప్పటికప్పుడు సరికొత్త శక్తిగా ఆవిర్భవిస్తున్నది.. దశాబ్దాల కాలమే కాదు.. నేటి నవీన కాలంలోనూ కంగారు జట్టు దుమ్ము రేపుతున్నది. అయితే అటువంటి ఆ జట్టు ఒక్కసారిగా చతికిల పడుతున్నది. ఎలా ఆడాలో తెలియక తలకిందులవుతున్నది. ముఖ్యంగా ఆ సంఘటన జరిగిన తర్వాత కంగారు జట్టు అంచనాలు అందుకోలేకపోతున్నది.
వరుసగా మూడు టోర్నీలలో..
క్రికెట్ ఆడే ఏ జట్టుకైనా ఐసీసీ నిర్వహించే మేజర్ టోర్నీలు గెలవడమే ప్రధమ ప్రాధాన్య అంశంగా ఉంటుంది. ఇందుకు కంగారు జట్టు మినహాయింపు కాదు. కంగారు జట్టు ఐసిసి టోర్నీలు గెలవడంలో ముందు వరుసలో ఉంటుంది.. 2023లో భారతదేశంపై భారతదేశంలో జరిగిన విశ్వ సమరంలో విజయం సాధించింది. 140 కోట్ల మంది భారతీయులను కన్నీరు పెట్టించింది. అంతేకాదు విశ్వసమరంలో విజయం సాధించిన తర్వాత ట్రోఫీని అందుకుని.. కాళ్ళ కింద పెట్టుకుంది. అప్పట్లో ఈ ఫోటో సామాజిక మాధ్యమాలలో సంచలనాన్ని సృష్టించింది.. ఇంత బలుపు ఏంటి.. ట్రోఫీకి ఎలా విలువ ఇవ్వాలో తెలియదా? అని చాలా మంది నెటిజన్లు మండిపడ్డారు. ఆయినప్పటికీ కంగారు జట్టు తన తీరు మార్చుకోలేదు. ఇక అప్పటినుంచి కంగారు జట్టుకు బ్యాడ్ టైం మొదలైంది.. గత ఏడాది జరిగిన పొట్టి ఫార్మాట్ విశ్వ కప్ లో కంగారు జట్టు వెనక్కి వచ్చేసింది.. ఆ జట్టు భారత్ చేతిలో ఓడిపోయి ఇంటికి వెళ్ళిపోయింది.. ఇక ఈ ఏడాది జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అదే ఫలితం పునరావృతమైంది. భారత్ చేతిలో ఓడిపోయి ఇంటికి వెళ్ళిపోయింది.. భారత్ జరిగే మ్యాచ్ కంటే ముందు ఇంగ్లీష్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో భారీ స్కోరును సైతం కంగారు జట్టు ప్లేయర్లు చేదించారు. కానీ ఇండియాతో జరిగిన మ్యాచ్లో మాత్రం ఓటమిపాలయ్యారు. ఇక డబ్ల్యూటీసీ తుది పోరులో కంగారు జట్టుకు ఊహించని ఫలితమే వచ్చింది.. సఫారీల చేతిలో ఐదు వికెట్ల తేడాతో తలవంచాల్సి వచ్చింది.. తద్వారా వరుసగా ఐసిసి టోర్నీలలో ఓటములు ఎదుర్కోవడంతో కంగారు జట్టుపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ” వారు ట్రోఫీలకు విలువనివ్వరు. ట్రోఫీ గెలిచిన తర్వాత కాళ్ళ కింద పెట్టుకుంటారు. కర్మ ఫలితం ఒకటంటూ ఉంటుంది. దానిని అనుభవించక తప్పదు.. అలాంటి అనుభవం కంగారు జట్టుకు ఎదురయింది కాబట్టి తప్పదు.. ఆటలో ఆట ద్వారానే గెలవాలి.. అంతే తప్ప దూషణలతో కాదు.. ప్రత్యర్థులను మానసికంగా ఇబ్బంది పెడుతూ.. అడ్డగోలుగా వ్యాఖ్యలు చేస్తూ.. ఇదే క్రికెట్ ఆట అంటే అని ఆస్ట్రేలియా ప్లేయర్లు అప్పట్లో వ్యాఖ్యానించేవారు. ఇప్పుడు కూడా అదే పద్ధతి అనుసరిస్తున్నారు. కాలం అన్ని రోజులు ఒకే విధంగా ఉండదు కదా. ఇప్పుడు కంగారు జట్టుకు అసలు సినిమా అర్థమవుతుందని” క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు..