NEET UG 2025 Top Ranker: చైతన్య, నారాయణ తెలుగు రాష్ట్రాలలో ఏ స్థాయిలో విద్యా వ్యాపారం చేస్తున్నాయో అందరికి తెలుసు. దేశవ్యాప్తంగా వేలాది బ్రాంచ్లు ఉన్నప్పటికీ.. వేలాదిమంది విద్యార్థులు ఉన్నప్పటికీ ఆ కాలేజీలలో అంతగా ర్యాంకులు రావడం లేదని తెలుస్తోంది. దీంతో నీటి ఫలితాలు విడుదలైనప్పుడు, ఐఐటి, జేఈఈ ఇలాంటి జాతీయ పోటీ పరీక్షల్లో ఫలితాలు విడుదలైనప్పుడు.. ర్యాంకుల విషయంలో మాయాజాలం ప్రదర్శించాయి.. ఈసారి కూడా అదే స్థాయిలో మాయాజాలాన్ని ప్రదర్శించి విద్యార్థులను, విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి.. ఇదేదో మేం చేస్తున్న ఆరోపణ కాదు.. మేము ఏకపక్షంగా రాస్తున్న వార్త కాదు.. ఈరోజు ఉదయం అనేక వార్తాపత్రికలలో శ్రీ చైతన్య, నారాయణ వాణిజ్య ప్రకటనలు ఇచ్చాయి. ఇందులో శ్రీ చైతన్య, నారాయణ సంస్థలు ఆల్ ఇండియా రేంజ్ లో ఒకటో ర్యాంకు సాధించిన కావిష్.. తమ విద్యార్థి అని ప్రకటించుకున్నాయి. అయితే ఇక్కడే వ్యూహాత్మకంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఒకటో ర్యాంకు సాధించిన జీవన్ సాయికుమార్ ను తమ విద్యార్థి అని.. నారాయణ కాస్త అతని ఫోటో కటౌట్ స్థాయిలో పబ్లిష్ చేసింది. అతడికి వచ్చిన ర్యాంకును కూడా బీభత్సంగా పబ్లిష్ చేసింది. ఇక శ్రీ చైతన్య అయితే తాము ఇచ్చిన క్లాస్ రూమ్ అనే ప్రోగ్రామ్ ద్వారా కావిష్ ర్యాంకు సాధించాడని గొప్పగా చెప్పుకుంది.. అయితే ఇక్కడ అటు శ్రీ చైతన్య… నారాయణ సంయుక్తంగా కావిష్ ఫోటో ఎందుకు వాడుకున్నట్టు? అతడు తమ కాలేజీలో చదివి ర్యాంకు సాధించడాని ఎందుకు చెప్పుకున్నట్టు?? గతంలో చైతన్య నారాయణ కలిసి చైనా అకాడమీ కొనసాగించాయి. ఇప్పుడు ఆ అకాడమీ లేనట్టు తెలుస్తోంది.. ఒకవేళ అదే అకాడమీ గనుక ఉండి ఉంటే కచ్చితంగా సంయుక్త ప్రకటన విడుదల చేసేవి. ఇప్పుడు అలా కాకుండా ఎవరికి వారుగా ప్రకటనల్లో విద్యార్థి అని చెప్పుకున్నాయి.
వందల కోట్ల దందా
నీట్ ప్రవేశ పరీక్షలో విజయం సాధించాలంటే అనివార్యంగా తమ కాలేజీలలో చేరాల్సిందేనని ప్రచారాన్ని చైతన్య, నారాయణ కాలేజీలు ఎప్పటినుంచో చేస్తున్నాయి. అంతేకాదు వందల కోట్ల దందాకు పాల్పడుతున్నాయి. తమ కాలేజీలలో చదవకపోయినప్పటికీ.. తమ కాలేజీలకు సంబంధం లేకపోయినప్పటికీ.. ఎక్కడో చదివిన విద్యార్థులను తమ విద్యాసంస్థల్లో చదివినట్టుగా ప్రచారం చేసుకుంటున్నాయి చైతన్య, నారాయణ విద్యాసంస్థలు. వారు సాధించిన ర్యాంకులను ముందు పెట్టి లక్షలలో విద్యార్థుల నుంచి ఫీజుల వసూలు చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా బ్రాంచీలను ఏర్పాటు చేసి విద్యా వ్యాపారాన్ని అంతకుమించి అనే స్థాయిలోకి తీసుకెళ్తున్నాయి. వాస్తవానికి రాజస్థాన్ రాష్ట్రంలో కోటా ప్రాంతంలో విద్యాసంస్థలు ఎక్కువగా ఉంటాయి. చివరికి ఆ ప్రాంతాన్ని కూడా చైతన్య, నారాయణ హైజాక్ చేశాయి. అక్కడ కూడా భారీగా విద్యాసంస్థలను ఏర్పాటు చేశాయి. ఆ స్థాయిలో విద్యాసంస్థలను ఏర్పాటు చేసినప్పటికీ ర్యాంకులు రాకపోవడంతో.. ఇలా కొనుగోలు ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. అందువల్లే అడ్డగోలుగా ప్రచారం చేసుకుంటూ వందల కోట్లు దండుకునేందుకు ప్రణాళికలు రూపొందించాయి. ఈరోజు ఉదయం వివిధ వార్తాపత్రికల్లో చైతన్య, నారాయణ విద్యాసంస్థలు ప్రకటించిన వాణిజ్య ప్రకటనలోనే డొల్లతనం కనిపిస్తోంది. దీనినిబట్టి ఆ విద్యాసంస్థలు ఎంతకు దిగజారుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు అడ్డగోలు ప్రచారంతో తల్లిదండ్రులను, వారి పిల్లలను ఎలా మోసం చేస్తున్నాయో అవగతం చేసుకోవచ్చు. ఇంత స్థాయిలో మోసం జరుగుతున్నా.. ఈ స్థాయిలో దందా జరుగుతున్నా ప్రభుత్వాలు ఈ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోకపోవడం నిజంగా గమనార్హం.