India vs South Africa Final : వన్డేలలో ఏ క్షణంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి.. ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి.. ఎవరూ చెప్పలేరు. ముఖ్యంగా ఐసిసి నిర్వహించే పెద్ద పెద్ద నాకౌట్ టోర్నీలలో.. ఊహించని మలుపులు చోటు చేసుకుంటాయి. ఆదివారం టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో కూడా ఇదే తరహాలో అద్భుతాలు చోటుచేసుకున్నాయి. మైదానంలో ప్రేక్షకులు ఊపిరి బిగబట్టే అనుభూతులను అందించాయి.
ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 298 రన్స్ చేసింది. షఫాలీ వర్మ (87), దీప్తి శర్మ (58) సూపర్ హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. స్మృతి మందాన(45) తన వంతు సహకారం అందించింది.. ఖాఖా మూడు వికెట్లు పడగొట్టింది.. తొలి వికెట్ కు స్మృతి, షఫాలి 103 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత టీమిండియా కాస్త ఇబ్బంది పడింది. చివరి వరకు ఆడి 298 పరుగులు చేసింది.
299 రన్స్ టార్గెట్ తో రంగంలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టుకు ఓపెనర్లు శుభారంభం అందించారు. తొలి వికెట్ కు కెప్టెన్ లారా , బ్రిట్స్ 51 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. బ్రిట్స్ ఔట్ అయిన తర్వాత లూస్(25) మినహా మిగతా వారంతా తేలిపోయారు. కెప్టెన్ లారా మాత్రమే ఒంటరి పోరాటం చేసింది. ఒకానొక దశలో సౌతాఫ్రికా ప్లేయర్లు భారత జట్టు మీద ఆధిపత్యం కొనసాగిస్తున్న నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ కౌర్ వ్యూహాత్మకంగా షఫాలీ శర్మను తెరపైకి తీసుకువచ్చింది. బంతిని ఆమె చేతికి అందించింది. ఆ తర్వాత మ్యాచ్ స్వరూపం ఒక్కసారిగా మారిపోయింది.
షఫాలి చేతికి బంతి రాకముందు వరకు దక్షిణాఫ్రికా పరిస్థితి 22 ఓవర్లకు 123/2 గా ఉంది. కానీ ఎప్పుడైతే బంతి వర్మ చేతిలోకి వెళ్ళిందో అప్పుడే పూర్తిగా పరిస్థితి మారిపోయింది.. ప్రమాదకరంగా మారుతున్న లూస్ ను షపాలి వర్మ అవుట్ చేసింది. ఇదే జోరులో కాప్ ను కూడా వెనక్కి పంపించింది. దీంతో ఒక్కసారిగా మ్యాచ్ టీమిండియా వైపు టర్న్ తీసుకుంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా జట్టు 16 పరుగులు చేసిన జఫ్టా ను దీప్తి శర్మ ఔట్ చేసింది. దీంతో దక్షిణాఫ్రికా కష్టాల్లో పడింది.
ఓపెనర్ గా వచ్చిన షఫాలీ 87 పరుగులు చేసింది. బంతి ద్వారా కీలకమైన రెండు వికెట్లు పడగొట్టింది. పైగా అత్యంత తెలివిగా బంతులు వేస్తూ దక్షిణాఫ్రికా బ్యాటర్లకు చుక్కలు చూపించింది. ఆమె వేస్తున్న బంతులు అత్యంత విచిత్రంగా ఉన్నాయని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారంటే ఆమె బౌలింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆమెను లేడీ వరుణ్ చక్రవర్తి అని అభివర్ణిస్తున్నారు. ఇదే స్థాయిలో గనుక ఆమె బౌలింగ్ చేస్తే టీమిండియాలో మిస్టీరియస్ బౌలర్ గా పేరు తెచ్చుకుంటుందని వివరిస్తున్నారు.
What a moment! #HarmanpreetKaur introduced #ShafaliVerma into bowling & she gets the wicket of Luus! #CWC25 Final #INDvSA, LIVE NOW https://t.co/gGh9yFhTix pic.twitter.com/8rsuBlFd78
— Star Sports (@StarSportsIndia) November 2, 2025