Hanuman Ansh: ఈ ఏడాది ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల పరంగా అద్భుతాలను నెలకొల్పిన సినిమాలే ఎక్కువ. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు ఒకపక్క నిరాశపరుస్తుంటే, మరోపక్క తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కళ్ళు చెదిరే వసూళ్లను రాబడుతున్నాయి. రీసెంట్ గా మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ‘ఇరుముడి’ ప్రభంజనం ఇలాంటిదే. ఇప్పుడు బాలీవుడ్ లో ‘హనుమాన్ అమ్స్’ అనే సినిమా కూడా ఇరుముడి లాంటి ప్రభంజనమే. ఎలాంటి అంచనాలు లేకుండా, ‘స్పైడర్ మ్యాన్’ తో పాటు , అనేక బాలీవుడ్ బడా సినిమాలకు పోటీగా ఈ చిత్రం విడుదలైంది.
ఆ కారణం చేత, ఈ సినిమాని పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు. అలా మూడు వారాలు గడిచిపోయాయి. మూడవ వారం లో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి గుర్తింపు లభించింది. ఆ కారణం చేత మూడవ వారం లో ఈ చిత్రానికి దాదాపుగా 10 కోట్ల 35 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. మౌత్ టాక్ రోజు రోజుకి బాగా వ్యాప్తి చెందడం తో , ఈ వీకెండ్ లో ఈ చిత్రానికి థియేటర్స్ భారీగా పెంచారు. ఫలితంగా శుక్రవారం రోజున ఈ చిత్రానికి 6 కోట్ల 12 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు రాగా, శనివారం రోజున 9 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చాయి. అంటే మూడవ వారం ఈ చిత్రం రాబట్టిన వసూళ్లు మొత్తాన్ని, ఒక్క రోజులో రాబట్టింది అన్నమాట. దీనిని బట్టీ ఈ సినిమా ప్రభంజనం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు నిర్మాతలు. మొదటి రోజున కేవలం 15 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఇప్పటి వరకు 4 వారాల్లో ఈ చిత్రానికి 24 కోట్ల 75 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. వచ్చే శనివారం ఈ 24 కోట్ల నెట్ వసూళ్లు ఒక్క రోజులో వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఫుల్ రన్ లో ఈ చిత్రం కచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలను సృష్టించబోతుంది. కలెక్షన్స్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి. ఈ చిత్రం లో శోబినావ్ సత్య హీరో గా నటించగా, విశాల్ చతుర్విది దర్శకత్వం వహించాడు. నీమ్ కరోలి బాబా జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.