Homeక్రీడలుక్రికెట్‌Alliance Government : ఏప్రిల్ లో పెరిగిన కూటమి గ్రాఫ్.. మేలో మరింత ఛాన్స్!

Alliance Government : ఏప్రిల్ లో పెరిగిన కూటమి గ్రాఫ్.. మేలో మరింత ఛాన్స్!

Alliance Government : ఏపీలో( Andhra Pradesh) కూటమి ప్రభుత్వం వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అభివృద్ధితోపాటు సంక్షేమ పథకాల విషయంలో చాలా దూకుడుగా ఉంది. అదే సమయంలో ఉద్యోగాల భర్తీపై కూడా దృష్టి పెట్టింది. తద్వారా ప్రజల్లో సానుకూలత కలిగేలా చేస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో తాజాగా మెగా డీఎస్సీ ప్రకటించడం, మే రెండున అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనుండడం, మేలో కీలకమైన సంక్షేమ పథకాలు అమలు చేయనుండడంతో ప్రజల నుంచి ఒక రకమైన సానుకూలత ప్రారంభం అయింది.

Also Read : భజన దారి తప్పింది..ఆర్కే కొత్త పలుకులో “బాబు”కు డ్యామేజీ

* పది నెలలుగా పాలనపై ఫోకస్..
గత పది నెలలుగా ప్రభుత్వం పాలనపై ఫుల్ ఫోకస్ పెట్టింది. అమరావతి రాజధాని( Amaravati capital ) నిర్మాణానికి నిధుల సమీకరణ చేసింది. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కూడా జరిగింది. అయితే ఇంత చేసినా ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో సానుకూలత రాలేదు. కానీ ఈనెల 15 నుంచి ప్రభుత్వం గ్రాఫ్ అనూహ్యంగా పెరిగింది. వరుసగా తీసుకున్న నిర్ణయాలు సానుకూలంగా మారుతున్నాయి. ఎస్సీ వర్గీకరణ అంశం కూటమికి కలిసి వస్తుందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ కు సంబంధించి ప్రకటన కూడా వచ్చింది. మరోవైపు మత్స్యకార భరోసా కు సంబంధించి నిధుల విడుదలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు వేట నిషేధ సమయానికి గాను.. గత ప్రభుత్వం ఇచ్చిన పదివేల రూపాయల ను రెట్టింపు చేస్తూ.. 20వేల రూపాయలను అందించనుంది కూటమి ప్రభుత్వం.

* మెగా డీఎస్సీతో సానుకూలం.
అయితే అన్నింటికీ మించి 16 వేల 343 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్( DSC notification ) ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగా ఆయన పుట్టినరోజు నాడు నోటిఫికేషన్ రావడం అనేది నిజంగా ప్రభుత్వానికి సానుకూలమే. నిర్ణీత సమయాన్ని పెట్టుకొని మరి నోటిఫికేషన్ విడుదల చేశారు. 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి డీఎస్సీ విషయంలో హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే ఏటా డీఎస్సీ ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు. కానీ ఐదేళ్లపాటు ఎటువంటి నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయలేదు. కానీ ఎన్నికలకు ముందు 6100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే అక్కడికి కొద్ది రోజులకే ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. జగన్ సర్కారు ఇచ్చిన 6,100 పోస్టులకు అదనంగా పదివేలకు పైగా పోస్టులను జతచేస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది కూటమి ప్రభుత్వం.

* ఏకకాలంలో అన్ని అంశాలపై దృష్టి..
రాష్ట్రంలో ఏకకాలంలో అభివృద్ధి, ఉద్యోగాల భర్తీ, అమరావతి రాజధాని నిర్మాణం, సంక్షేమ పథకాల అమలు చేయాలని భావించింది కూటమి ప్రభుత్వం( Alliance government). అందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. అయితే అన్నింటికీ మించి ఉపాధ్యాయ నియామక ప్రక్రియ మాత్రం ప్రభుత్వం పై సానుకూలత పెంచేలా ఉంది. మరోవైపు మే 2న అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. దీంతో మరింత సానుకూలత పెరిగే అవకాశం కనిపిస్తోంది. సంక్షేమ పథకాల అమలు ప్రారంభమైన తర్వాత కూడా ప్రభుత్వ గ్రాఫ్ మరింత పెరిగే అవకాశం ఉంది.

Also Read : ఆ జిల్లాపై జనసేన ఫోకస్.. వైసీపీ నుంచి మాజీ మంత్రి ఔట్!

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular