YSR Congress Party : ఏపీలో రాజకీయాలు( politics) మారుతున్నాయి. కూటమి ఒకవైపు పాలన సాగిస్తూనే మరోవైపు రాజకీయంగా పట్టు బిగుస్తోంది. కూటమిలో మూడు పార్టీలు ఎవరికి వారుగా బలోపేతం కావాలని చూస్తున్నారు. ముఖ్యంగా జనసేన క్షేత్రస్థాయిలో పట్టు పెంచుకోవాలని చూస్తోంది. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం చేయాలన్న ఆలోచనతో ముందుకు సాగుతోంది. అందులో భాగంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులను టార్గెట్ చేస్తోంది. వారిని తమ వైపు తిప్పుకుని జనసేన బలపడడమే కాకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయవచ్చని భావిస్తోంది. అందులో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా పై ఫుల్ ఫోకస్ పెట్టింది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ద్వారా మంత్రాంగం నడుపుతోంది. ఓ మాజీ మంత్రి జనసేన లో చేరే అవకాశం ఉందని ప్రచారం నడుస్తోంది.
Also Read : చంద్రబాబుతో పని చేయడం అదృష్టం.. వైసిపి మాజీ నేత సంచలనం!
* భవిష్యత్తు లేని నాయకులంతా..
2024 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ. కనీసం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. ఈ తరుణంలో పార్టీకి భవిష్యత్తు లేదని భావిస్తున్న చాలామంది నేతలు బయటకు వెళ్లిపోయారు. ఉన్నవారు సైతం స్తబ్దుగా ఉండిపోయారు. గత ఎన్నికల్లో చాలా రకాల ప్రయోగాలు చేశారు జగన్మోహన్ రెడ్డి. అప్పట్లో చాలామంది సీనియర్ నేతలను సైతం పక్కన పెట్టారు. ఫలితాల తర్వాత ఆ నేతలు పార్టీలో ఉన్నామా లేమా అన్న రీతిలో ఉన్నారు. అటువంటి వారంతా ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నారు. అయితే జనంలో కొద్దిపాటి క్రేజ్ ఉన్న నేతలను తీసుకోవాలని భావిస్తోంది జనసేన. అందులో భాగంగా ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి మహీధర్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే ఈ విషయంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
* సీనియర్ మోస్ట్ లీడర్..
మానుగుంట మహీధర్ రెడ్డి( manugunta maheedar Reddy ) ప్రకాశం జిల్లాలోనే సీనియర్ మోస్ట్ లీడర్. 1989లో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2014 వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. 2014 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా కందుకూరు నుంచి పోటీ చేసి గెలిచారు. 2019లో మాత్రం ఆయనకు టికెట్ ఇవ్వలేదు. మొన్నటి ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వలేదు. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న మహిధర్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడటం మేలని ఒక నిర్ణయానికి వచ్చారు. జనసేన నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డితో జరిగిన చర్చలు ఫలప్రదం అయ్యాయని.. ఆయన త్వరలో జనసేనలో చేరడం ఖాయమని ప్రచారం జోరుగా సాగుతోంది.
* భవిష్యత్తు అవసరాల దృష్ట్యా..
వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. అదే జరిగితే జనసేనకు( janasena ) లభించే సీట్లు కూడా పెరుగుతాయి. అటు పవన్ సైతం అన్ని జిల్లాల్లో జనసేన ప్రాతినిధ్యం కోరుకుంటున్నారు. రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లాగా పేరుపొందిన ప్రకాశంలో కీలక నేతలు ఉండాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే మహీధర్ రెడ్డిని చేర్చుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆమంచి కృష్ణమోహన్ సైతం జనసేనలో చేరే అవకాశం ఉంది. మొత్తానికైతే ఉమ్మడి ప్రకాశం జిల్లా పై ఫుల్ ఫోకస్ పెట్టిందని మాత్రం తెలుస్తోంది.