Team India (1)
Team India : 17 ఏళ్ల తర్వాత భారత జట్టు టి20 ట్రోఫీ సాధించింది. 13 ఏళ్ల విరామం అనంతరం icc ట్రోఫీ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా వెస్టిండీస్ లోని బార్బడోస్ నుంచి గురువారం తెల్లవారుజామున స్వదేశంలో అడుగు పెట్టింది. బార్బడోస్ ప్రాంతంలో ఏర్పడిన హరికేన్ వల్ల టీమిండియా గత శనివారం నుంచి బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటల 50 నిమిషాల దాకా అక్కడే ఉండాల్సి వచ్చింది. వర్షం వల్ల అక్కడి విమానాశ్రయాలను ఇన్ని రోజులపాటు మూసివేశారు. చివరికి వాతావరణం కాస్త తెరిపినివ్వడంతో బుధవారం బిసిసిఐ ప్రత్యేక విమానం ఏర్పాటు చేసింది. బుధవారం తెల్లవారుజామున 4: 50 నిమిషాలకు ప్రత్యేక విమానం అక్కడ నుంచి బయలుదేరింది. గురువారం ఉదయం 6 గంటలకు ఢిల్లీ చేరుకుంది. ఉదయం 11 గంటలకు రోహిత్ ఆధ్వర్యంలో టీమిండియా ఆటగాళ్లు, కోచ్ రాహుల్ ద్రావిడ్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, బీసీసీఐ సెక్రటరీ జై షా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుస్తారు. అనంతరం ప్రత్యేక విమానంలో టీమిండియా ముంబై వెళ్ళిపోతుంది. అక్కడికి చేరుకున్న అనంతరం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో రోడ్ షో నిర్వహిస్తారు.. రెండు గంటలపాటు ఊరేగింపు సాగుతుంది.
రోహిత్ సేన ఓపెన్ టాప్ బస్సులో కప్ ను ప్రదర్శిస్తూ అభిమానులకు అవివాదం చేస్తారు.. గురువారం రాత్రి వాంఖడె మైదానంలో బీసీసీఐ భారత జట్టుకు సన్మానం చేస్తారు. “ప్రత్యేక విమానం ద్వారా భారత బృందం ఉదయం 6 గంటలకు ఢిల్లీ వచ్చింది.. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా, ఇతర జర్నలిస్టులు కూడా స్వదేశానికి చేరుకున్నారు. ఉదయం జట్టు సభ్యులు ఢిల్లీలో దిగిన తర్వాత ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆయన నివాసంలో కలుస్తారు. అనంతరం ముంబై వెళ్ళిపోతారు. అక్కడ నా రిమన్ పాయింట్ నుంచి ఓపెన్ టాప్ బస్సులో ఊరేగింపులో పాల్గొంటారు..వాంఖడె మైదానంలో సన్మానం ఉంటుంది.. ఈ సందర్భంగా వారికి 125 కోట్ల నగదు బహుమతి అందుకుంటారని” బీసీసీఐ అధికారులు ప్రకటించారు.. మరోవైపు ఇప్పటికే ప్రపంచ కప్ విజయోత్సవ ఊరేగింపులో పాల్గొనాలని జై షా, రోహిత్ శర్మ అభిమానులకు పిలుపునిచ్చారు.
బార్బాడోస్ లో కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు అక్కడే చిక్కుకుపోయారు. క్రికెటర్లు, బిసిసిఐ అధ్యక్షుడు, కార్యదర్శి, కోచ్ లు, సహాయక సిబ్బంది మొత్తం కలిపి 70 మంది అక్కడి హోటళ్లలోనే ఉండాల్సి వచ్చింది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో వారి రాకపై సందిగ్ధం నెలకొంది. ఇదే సమయంలో బిసిసిఐ ప్రత్యేక చార్టర్డ్ విమానాలను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో బిసిసిఐ ఆ నిర్ణయాన్ని విరమించుకుంది. చివరికి ఎయిర్ ఇండియా సహాయంతో ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయడంతో.. క్రికెట్ జట్టు స్వదేశానికి చేరుకుంది. విమానానికి “ఛాంపియన్స్ టి20 వరల్డ్ కప్ 2024” అనే పేరు పెట్టారు.. స్వదేశానికి చేరుకున్న టీమిండియా ఆటగాళ్లకు న్యూఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఆటగాళ్లందరికీ పూలదండలు వేసి ఘన స్వాగతం పలికారు. టీమిండియా ఆటగాళ్లు స్వదేశానికి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని.. బీసీసీఐ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో ఓ వీడియోను పంచుకుంది.. ఇందులో కెప్టెన్ రోహిత్ శర్మ, బుమ్రా, శివం దూబే , విరాట్ కోహ్లీ, ఇంకా చాలామంది ఆటగాళ్లు కనిపించారు. వారందరూ ట్రోఫీని సగర్వంగా ముద్దాడుతూ దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా బీసీసీఐ it’s home అనే క్యాప్షన్ జత చేసింది.
It's home #TeamIndia pic.twitter.com/bduGveUuDF
— BCCI (@BCCI) July 4, 2024