https://oktelugu.com/

Horoscope Today : ఈ రాశివారిపై శ్రీ మహా విష్ణువు అనుగ్రహం.. వారు ఏ పనిచేసినా విజయమే..

Horoscope Today ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవాలి. పూర్వీకుల ఆస్తిపై శుభవార్త వింటారు. స్నేహితులతో వ్యాపారం చేస్తారు.

Written By:
  • Srinivas
  • , Updated On : July 4, 2024 / 08:07 AM IST
    Horoscope Today

    Horoscope Today

    Follow us on

    Horoscope Today: 2024 జూలై 4 గురువారం రోజున ద్వాదశ రాశులపై మృగశిర నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు మిథున రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు కొన్ని రాశుల వారిపై మహావిష్ణువు అనుగ్రహం ఉంటుంది. దీంతో వారు ఏ పని చేసినా విజయమే అవుతుంది. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి:
    ఉద్యోగులు కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు కొత్త పెట్టుబడుల విషయంలో ఇతరుల సలహాలు తీసుకోవాలి. పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.

    వృషభ రాశి:
    కొన్ని పనుల కోసం ఉద్యోగులు కష్టపడాల్సి ఉంటుంది. ఆదాయం తక్కువవుతుంది. కానీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. పొరుగువారితో మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

    మిథున రాశి:
    ఆర్థిక వృద్ధి ఉంటుంది. కుటుంబంలో ఓ వేడుకలో పాల్గొంటారు. వివాహ అర్హులకు సంబంధాలు వస్తుంటాయి. మీ పనికి ఆటంక కలిగించేవారు ఉంటారు.

    కర్కాటక రాశి:
    కొత్త పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి అనుకూల సమయం. వ్యాపార విషయంలో కొన్ని వివాదాలు ఉంటాయి. జీవిత భాగస్వామి పూర్తి మద్దతు ఉంటుంది.

    సింహారాశి:
    ఈ రోజు వాతావరణం ఆహ్లదంగా ఉంటుంది. విద్యార్థుల కోసం సమయం వెచ్చిస్తారు. పిల్లల విషయంలో బాధ్యతతో ఉండాలి. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.

    కన్య రాశి:
    కొన్ని రంగాల వారికి ప్రతికూల వాతావరణం ఉంటుంది. సోదరుల మద్దతు ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆస్తి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు.

    తుల రాశి:
    సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. కొన్ని బాధ్యతల విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ముఖ్యమైన పనులను ఇతరులకు అప్పగించొద్దు.

    వృశ్చిక రాశి:
    ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. విద్యార్థులు కొన్ని విషయాల్లో కష్టపడాల్సి వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులు ఆందోళనగా ఉంటారు.

    ధనస్సు రాశి:
    ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగులు కొన్ని శుభవార్తలు వింటారు. పెండింగ్ బకాయిలు వసూలవుతాయి. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు.

    మకర రాశి:
    వాహనాలపై ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామి కోసం బహుమతిని కొంటారు. పని ఒత్తిడి కారణంగా ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా ఉండకూడదు.

    కుంభరాశి:
    ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవాలి. పూర్వీకుల ఆస్తిపై శుభవార్త వింటారు. స్నేహితులతో వ్యాపారం చేస్తారు.

    మీనరాశి:
    వ్యాపారులు ముఖ్యమైన పనులపై శ్రద్ధ వహించాలి. జీవిత భాగస్వామి అనుమతితో కొన్ని ముఖ్యమైన పనులు చేస్తారు. విద్యార్థులు నిరాశతో ఉంటారు.