BCCI: ఇండియన్ టీం లో ఉన్న ప్లేయర్లందరు తమ స్థాయి మేరకు ఆడుతూ టీమ్ కి మంచి విజయాలను అందిస్తూ వస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే బీసీసీఐ వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ‘వార్షిక అవార్డుల ప్రధానోత్సవం’ పేరుతో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటుంది.
ఇక హైదరాబాద్ లో నిన్న ఈ అవార్డుల ప్రధానోత్సవానికి సంబందించిన ఈవెంట్ ని నిర్వహించారు. ఇక ఇందులో పురుష, మహిళ టీమ్ ల పేయర్లందరూ పాల్గొనడం విశేషం… పురుషుల టీం విషయానికి వస్తే రోహిత్ శర్మ, కే ఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా లాంటి స్టార్ ప్లేయర్లు పాల్గొన్నారు. అయితే ఈ ఈవెంట్ కి విరాట్ కోహ్లీ హాజరవ్వలేదు. ఎందుకంటే తను ఇప్పటికే పర్సనల్ ప్రాబ్లం వల్ల ఇంగ్లాండ్ తో ఆడే మొదటి రెండు టెస్ట్ మ్యాచ్ లకి దూరం అయ్యాడు. దానివల్లే ప్రస్తుతం తన పర్సనల్ పనులను చూసుకోవడంలో బిజీగా ఉన్న కోహ్లీ ఈ ఈవెంట్ కి హాజరు అవ్వలేకపోయాడు.
ఇక అవార్డుల ప్రధానోత్సవం తర్వాత మన ప్లేయర్లు అందరూ కలిసి దిగిన ఒక ఫోటో ‘పిక్ ఆఫ్ ది డే’ గా నిలవడమే కాకుండా సోషల్ మీడియాలో విపరీతమైన వైరల్ అవుతుంది. ఇక ఇందులో రోహిత్ శర్మ, శ్రేయశ్ అయ్యర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, శుభ్ మన్ గిల్, యశస్వి జైశ్వాల్ లాంటి ప్లేయర్లు ఉన్నారు…ఇక ఇదిలా ఉంటే ఈనెల 25వ తేదీ నుంచి ఇంగ్లాండ్ తో మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడడానికి ఇండియన్ టీమ్ రెడీ అవుతుంది. ఇక అందులో భాగంగానే అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడంలో ముఖ్య ఉద్దేశ్యం మన ప్లేయర్లను ఉత్సాహ పరచడమే అంటూ బిసిసిఐ తెలియజేసింది…
ఇక ఇది ఇలా ఉంటే ఈనెల 25 వ తేదీ నుంచి ఇంగ్లాండ్ తో జరిగే మొదటి క్రికెట్ మ్యాచ్ లో గెలిచి ఇండియన్ టీమ్ తమ సత్తా చాటుకోవాలని చూస్తుంది. ఇక హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుండటం వల్ల అక్కడ ఇండియన్ టీమ్ కి మంచి రికార్డు కూడా ఉంది. ఇక ఈ మ్యాచ్ లో విజయం సాధించి మన సత్తా ఏంటో చూపించాలని ఇండియన్ టీమ్ చూస్తున్నట్టుగా తెలుస్తుంది…