286 runs in one ball : వన్డే ఫార్మాట్ 70 ఓవర్ల పాటు సాగేది. ఆ తర్వాత 60 ఓవర్లకు పరిమితమైంది. ఇప్పుడు అది 50 ఓవర్ల వరకు ఆగిపోయింది. సుదీర్ఘ ఫార్మాట్, వన్డే ఫార్మాట్ తర్వాత సరిగ్గా 18 సంవత్సరాల క్రితం టి20 వెలుగులోకి వచ్చింది. టి20 ఫార్మాట్ ప్రస్తుతం క్రికెట్ ప్రపంచాన్ని ఊపేస్తోంది. ఇప్పటికే ఐసీసీ టి20 టోర్నీలను విస్తృతంగా నిర్వహిస్తోంది. అనేక క్రికెట్ దేశాలు కూడా టి20 టోర్నీలను నిర్వహిస్తున్నాయి. ఇక బిసిసిఐ నిర్వహిస్తున్న ఐపీఎల్ అయితే ప్రపంచంలోనే అతిపెద్ద రిచ్ క్రికెట్ లీగ్ గా అవతరించింది. భవిష్యత్తు కాలంలో 10 ఓవర్ల పాటు సాగే క్రికెట్ మ్యాచ్లను కూడా నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సాధ్యమవుతుందా? దీనివల్ల బౌలర్లు ఎటువంటి ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది? తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయనేది.. క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇక క్రికెట్ అన్నాక ఎన్నో రికార్డులు బద్దలవుతూనే ఉంటాయి. ఎన్నో రికార్డులు పుట్టుకొస్తూనే ఉంటాయి. అలాంటి ఒక రికార్డు ఇప్పుడు కాదు గాని.. చాలా సంవత్సరాల క్రితమే చోటుచేసుకుంది కాకపోతే.. అది క్రికెట్ అంతగా అభివృద్ధి చెందని కాలం.. అంతగా క్రికెట్ గురించి పది జ్ఞానం లేని కాలం.. అయితే ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి రావడం.. కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపించడం.. పాత విషయాల గురించి ఆరా తీయడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి.. గతంలో జరిగిన ఓ అద్భుతమైన సంఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే.
Also Read: మెరుపు స్టంప్ ఔట్ .. ధోనిని గుర్తుచేసిన సంజు శాంసన్..
అంతర్జాతీయ క్రికెట్లో ఒక బంతికి సింగిల్ లేదా డబుల్ లేదా త్రిబుల్ పరుగులు తీస్తుంటారు. అప్పుడప్పుడు ఫీల్డర్ల తప్పుల వల్ల నాలుగు లేదా ఐదు పరుగులు వస్తుంటాయి. క్రికెట్ నిబంధన ప్రకారం బంతి ఇన్ ప్లే లో ఉన్నంతవరకు ఎన్నిసార్లు అయినా పరుగులు తీయడానికి అవకాశం ఉంటుంది. అయితే 1894లో వెస్టన్ ఆస్ట్రేలియాలోని విక్టోరియా, స్క్రాచ్ -11 జట్ల మధ్య ఒక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో బ్యాటర్ బలంగా బంతిని కొట్టాడు. అంతేకాదు అతడు కొట్టిన తీరుకు ఏకంగా 286 పరుగులు వచ్చాయి. ఒక రకంగా ఇది ఆరు కిలోమీటర్ల దూరాన్ని పరిగెత్తడంతో సమానం. అయితే ఆ బౌలర్ వైడ్ వెయ్యలేదు. నోబాల్ వెయ్యలేదు. అలాగని బ్యాటర్ ఫోర్ కొట్టలేదు. సిక్సర్ బాదలేదు. అయితే బ్యాటర్ కొట్టిన బంతి చెట్టు కొమ్మలో ఇరుక్కుపోయింది. ఆ బంతిని తీయడానికి ఫీల్డర్లకు ఇబ్బందికరంగా మారింది. దీంతో బ్యాటర్ ఆ స్థాయిలో పరుగులు తీయాల్సి వచ్చింది. మొత్తంగా క్రికెట్ చరిత్రలో ఇదొక రికార్డ్ గా మిగిలిపోయింది. కాగా అప్పట్లో క్రికెట్ ఇంత స్థాయిలో అభివృద్ధి చెందలేదు కాబట్టి ఈ సంఘటన పెద్దగా వెలుగులోకి రాలేదు. ఇక ఇటీవల కాలంలో గతంలో క్రికెటర్లు సాధించిన రికార్డుల గురించి కథనాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో.. ఈ రికార్డు కూడా బయటి ప్రపంచానికి తెలిసింది.