Homeక్రీడలుJosh Hazlewood: ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ.. టి20 వరల్డ్ కప్ నుంచి కీలక...

Josh Hazlewood: ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ.. టి20 వరల్డ్ కప్ నుంచి కీలక బౌలర్ ఔట్

Josh Hazlewood: ఆస్ట్రేలియా జట్టుకు టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాకముందే వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే గాయం కారణంగా కమిన్స్ తప్పుకున్నాడు. ఇప్పుడు అదే దారిలో మరొక బౌలర్ కూడా వెళ్ళిపోయాడు. దీంతో టి20 వరల్డ్ కప్ ముందు ఆస్ట్రేలియా జట్టుకు కోలుకోలేని షాక్ లు తగులుతున్నాయి. ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హేజిల్ వుడ్ కీలకమైనవాడు. ఇటీవల అతడు యాషెస్ సిరీస్ కు దూరమయ్యాడు. ఇప్పుడు ఏకంగా టి20 వరల్డ్ కప్ కు కూడా దూరమయ్యాడు. […]

Josh Hazlewood: ఆస్ట్రేలియా జట్టుకు టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాకముందే వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే గాయం కారణంగా కమిన్స్ తప్పుకున్నాడు. ఇప్పుడు అదే దారిలో మరొక బౌలర్ కూడా వెళ్ళిపోయాడు. దీంతో టి20 వరల్డ్ కప్ ముందు ఆస్ట్రేలియా జట్టుకు కోలుకోలేని షాక్ లు తగులుతున్నాయి.
ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హేజిల్ వుడ్ కీలకమైనవాడు. ఇటీవల అతడు యాషెస్ సిరీస్ కు దూరమయ్యాడు. ఇప్పుడు ఏకంగా టి20 వరల్డ్ కప్ కు కూడా దూరమయ్యాడు. వాస్తవానికి అతడు సూపర్ 8 దశ వరకు వస్తాడని జట్టు మేనేజ్మెంట్ భావించినప్పటికీ.. సామర్థ్య  పరీక్షలు అతడు విఫలమైనట్టు తెలుస్తోంది. “సూపర్ దశనాటికి అతడు జట్టులోకి తిరిగి వస్తాడని ఆశాభావంతో మేము ఉన్నాం. అయితే రిస్కుల కంటే ప్రతికూల ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల అతడు జట్టుకు దూరంగా ఉండాల్సి వచ్చిందని” ఆస్ట్రేలియా సెలెక్టర్ టోనీ డోడ మైడ్ పేర్కొన్నాడు.
హేజిల్ వుడ్ దూరం కావడంతో.. అతడి స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారనేది ఇంతవరకు ఆస్ట్రేలియా మేనేజ్మెంట్ చెప్పలేదు. చివరిసారిగా అతడు అక్టోబర్ 2025లో భారత జట్టుతో జరిగిన వన్డే, టి20 సిరీస్లలో ఆడాడు. యాషెస్ సిరీస్ ప్రారంభంలో తొడ కండరాల నొప్పి వల్ల సిరీస్ కు దూరమయ్యాడు.
ప్రస్తుత టి20 వరల్డ్ కప్ కు కమిన్స్  దూరమయ్యాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ లో దక్షిణాఫ్రికా జట్టుతో.. ఇటీవల ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్లో నాలుగో మ్యాచ్లో మాత్రమే అతడు ఆడాడు. అయితే ఎల్లిస్, డేవిడ్ కు సంబంధించిన ఫిట్నెస్ విషయంలో సానుకూల వార్తలు ఆస్ట్రేలియా జట్టుకు లభించాయి. అయితే జంపా వచ్చేవారం కొలంబోలో జరిగే ప్రారంభ మ్యాచ్ కు అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది. నెదర్లాండ్ జట్టుతో జరిగే ప్రాక్టీస్ మ్యాచ్ రద్దు కావడంతో ఆస్ట్రేలియా సన్నద్ధత స్వల్పంగా దెబ్బతిన్నది. అయితే ఐలాండ్ జట్టుతో జరిగే మొదటి మ్యాచ్ కు ముందు ఆస్ట్రేలియా జట్టు సిద్ధం కావడానికి ఇంకా ఆరు రోజుల సమయం ఉంది.
కీలకమైన ప్లేయర్లు లేకపోయినప్పటికీ ఆస్ట్రేలియా సారథి మార్ష్ ఉత్సాహంగా ఉన్నాడు. మాథ్యూ కుహునే మాన్ బౌలింగ్ దళాన్ని ముందుండి నడిపిస్తాడని ఆస్ట్రేలియా సారథి నమ్ముతున్నాడు. అంతేకాదు మిగతా ఆటగాళ్లు కూడా ప్రత్యర్థి ప్లేయర్లకు చుక్కలు చూపిస్తారని ఆస్ట్రేలియా కెప్టెన్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.
Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper