Gold Price Today : భారతీయ మహిళలకు బంగారం అంటే ఎంతో ప్రీతి. ఇంట్లో పెళ్లిళ్లు లేదా శుభకార్యాలు ఏ చిన్న సందర్భం అయినా కూడా మహిళలు ఎక్కువగా బంగారం కొనడానికి ప్రాధాన్యత ఇస్తారు. అంతగా మన దేశ సంప్రదాయాలతో బంగారం ముడిపడి ఉంది. బంగారాన్ని పెళ్లిళ్లలో కానుకగా ఇచ్చే సంప్రదాయం కూడా మన భారతదేశంలో ఉంది. అందువలన మన దేశం మార్కెట్లో బంగారానికి డిమాండ్ ఎల్లప్పుడూ ఒకేలాగా ఉంటుంది. అయితే బంగారాన్ని అలంకారంతోపాటు ఆర్థిక భరోసాగా కూడా భావించడం జరుగుతుంది. గత కొన్ని ఏళ్ల నుంచి పసిడిని మంచి పెట్టుబడి మార్గంగా అందరూ భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో జరిగే పరిణామాల కారణంగా మన దేశ మార్కెట్లో పసిడి ధరలలో హెచ్చుతగ్గులు కనిపిస్తూ ఉంటాయి. రోజు రోజుకి బంగారం ధరలలో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలో బంగారం కొనుగోలు చేయాలని వేచి చూస్తున్న వారికి గందరగోళం ఏర్పడింది. ముఖ్యంగా వీటి ధరలు అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న డాలర్ మారకంపై ఆధారపడి ఉంటాయని చెప్పొచ్చు. ఇక ఈరోజు జూన్ 11వ తేదీ మనదేశంలో ఉన్న పలు ముఖ్యమైన ప్రాంతాలలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలు అయిన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు మరియు వరంగల్ నగరాలలో ఈరోజు స్వచ్ఛమైన బంగారం తులం ధర రూ.97,570, 22 క్యారెట్ల బంగారం తులం ధర రూ.89,440 గా ఉన్నాయి.
ఇక దేశంలో పలు ప్రధాన నగరాలు అయినా ముంబై, కోల్కత్తా, చెన్నై, కేరళ వంటి నగరాలలో ఈరోజు స్వచ్ఛమైన బంగారం తులం ధర రూ.97,570, 22 క్యారెట్ల బంగారం తులం ధర రూ.89,440 గా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో మాత్రం ఈరోజు స్వచ్ఛమైన బంగారం తులం ధర రూ.97,720, 22 క్యారెట్ల బంగారం తులం ధర రూ.89,590 గా ఉన్నాయి. ఇక అన్ని ప్రధాన నగరాలలో కూడా ఈరోజు కిలో వెండి ధర రూ.1,19,100 గా ఉందని సమాచారం.